S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 21:39

ఏలూరు, ఆగస్టు 4: జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలను అక్టోబరు 2వ తేదీన బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటిస్తానని ఈ లోగా అన్ని మున్సిపాల్టీల్లోనూ వ్యక్తిగత మరుగుదొడ్లు, పబ్లిక్, కమ్యూనిటీ మరుగుదొడ్లు నూరుశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.

08/05/2016 - 21:39

ఏలూరు, ఆగస్టు 4: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చింతలపూడి మండలం ఫాతిమాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలను గురువారం సాయంత్రం రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత పరామర్శించారు. బాధితురాలకు ఆధునిక వైద్యాన్ని సత్వరమే అందించాలని అవసరమైతే విజయవాడకు తరలించి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని డిసిహెచ్ ఎస్ డాక్టర్ శంకరరావును ఆదేశించారు.

08/05/2016 - 21:38

గోపాలపురం, ఆగస్టు 4: మెట్టప్రాంతంలోని రైతాంగం పట్టు పరిశ్రమ సాగు చేయడం ద్వారా అధిక లాభాలు అర్జించ వచ్చని పట్టు పరిశ్రమ శాఖ ఉప సంచాలకులు ఎ సుబ్బరామయ్య అన్నారు. మండలంలోని రాజఆంపాలెం గ్రామంలోని రైతులు కాకర్ల హరిరామకృష్ణ, పెనుబోతుల లక్ష్మీశాంతి పొలంలో నిర్మించిన పట్టు పురుగుల షెడ్లను సుబ్బరామయ్య గురువారం పరిశీలించారు.

08/05/2016 - 21:37

ఎంత తెల్లగా ఉన్నవారికైనా మోచేతులు, మోకాళ్లపై నల్లగా, గరుకుగా ఉంటుంది. చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నలుపుపోవాలంటే ఇలా చేయండి.
రాత్రి పడుకోబోయే ముందు మోకాళ్లకీ, మోచేతులకీ ఖచ్చితంగా ఆలివ్ ఆయిల్ లేదా ఆముదం నూనెతో మర్దన చేసుకుని నిద్రపోండి. ఈ నూనెలు చర్మం ముడతలు పడడాన్ని తగ్గిస్తాయి.

08/05/2016 - 21:51

బరువు పెరగటానికి అనేక కారణాలు ఉండవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, భోజనానికి సమయపాలన లేకపోవడం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం, కొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా అధిక బరువు నమోదు కావచ్చు. మరి ఇటువంటి సమస్యల బారిన పడకుండా కొవ్వు కరిగించుకొని పొట్ట తగ్గించుకొనేందుకు కొన్ని ఆహారాలు ప్రత్యేకంగా తీసుకోవాలి. శరీరం నుండి కొవ్వును కరిగించడంలో ఇది ఒక చాలా ముఖ్యమైన ఇంటి చిట్కా.

08/05/2016 - 21:30

రాజమహేంద్రవరం, ఆగస్టు 4: గోదావరి నది వరద తాకిడితోక్రమేణా ఉగ్రరూపం దాలుస్తోంది. అఖండ హారతికి నిత్య హారతి విశేషంగా జరుగుతోంది. అశేష భక్తజనం నిత్యం సాయంత్రం వేళ హారతిని తిలకించి తరిస్తున్నారు. గురువారం రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో అఖండ గోదావరి నదికి అఖండ హారతి కార్యక్రమం వైభవంగా సాగింది. పుణ్య నది గోదావరికి వేద పండితులు విశేష హారతి నీరాజనాలు పలికారు.

08/05/2016 - 21:29

అమలాపురం, ఆగస్టు 4: నవ మాసాలు మోసి, కని, పెంచిన కొడుకుకు తన కన్నతల్లి భారమైంది. ఆమెకు పట్టెడన్నం పెట్టలేక రోడ్డు పక్కన వదిలి పోవడంతో స్థానికులు, పోలీసులు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్చి ఆశ్రయం కల్పించారు. తల్లిని రోడ్డుపై వదిలిన కొడుకుపై సీనియర్ సిటిజన్ యాక్ట్ 24 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి సిఐ వైఆర్‌కె శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

08/05/2016 - 21:29

శంఖవరం, ఆగస్టు 4: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆవిర్భావ దినోత్సవం రత్నగిరిపై గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. రత్నగిరిపై దేవస్థానం ఛైర్మన్ ఐవి రోహిత్, ఇఓ కాకర్ల నాగేశ్వరరావుల పర్యవేక్షణలో నిర్వహించిన స్వామివారి జయంతోత్సవాలను రత్నగిరిపై వేద పండితుల మంత్రోచ్ఛారణలతో భక్తుల సత్యదేవ నామస్మరణతో మార్మోగింది.

08/05/2016 - 21:28

కాకినాడ, ఆగస్టు 4: జిల్లాలో ప్రతి శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రతి మండలంలో కనీసం 2 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు. కాకినాడ కలెక్టరేట్‌లో గురువారం అటవీ శాఖ, చిన్న పత్రికల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మనం-వనం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

08/05/2016 - 21:28

రంపచోడవరం, ఆగస్టు 4: ఉపాధి హామీ పథకం అమల్లో నిధులకు కొదవలేదని, గిరిజనుల జీవనోపాధి కల్పనకు అధికారులు సమన్వయంతో కృషిచేస్తూ వారి అభివృద్ధికి తోడ్పాడాలని జిల్లా కలెక్టర్ అరుణకుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం స్థానిక ఐటిడిఎ సమావేశపు హాల్లో వివిధ శాఖల జిల్లా, డివిజన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

Pages