S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 16:40

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆర్థిక బిల్లు అని లోక్‌సభ కార్యదర్శి స్పష్టం చేశారని, ద్రవ్యబిల్లుపై ఓటింగ్ జరిపే సంప్రదాయం రాజ్యసభలో లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం స్పష్టం చేశారు. కొన్ని అంశాలపై రాజ్యసభలో నేరుగా చట్టం చేసే అవకాశం లేదన్నారు.

08/05/2016 - 16:40

ఇంఫాల్: పదహారేళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షను విరమించుకోవద్దని, బయటి వ్యక్తిని వివాహం చేసుకోవద్దని ‘మణిపూర్ ఉక్కుమహిళ’ షర్మిలకు కొన్ని సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సైనికులకు ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ 16 ఏళ్లుగా ఆమె దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

08/05/2016 - 16:39

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. చెవిలో పూలు పెట్టుకుని కార్లు, బైక్‌లను వారు శుభ్రం చేశారు. హోదా విషయంలో బిజెపి తీరు సరిగా లేదని వారు విమర్శించారు.

08/05/2016 - 16:39

గౌహతి: అస్సాంలోని కోక్రాఝార్‌లో శుక్రవారం ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతాదళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతాదళాలు గాలింపుచర్యలను ప్రారంభించాయి. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

08/05/2016 - 16:37

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో అత్యాచార ఆరోపణలతో జైలుకెళ్లిన నిందితుడిని ఖైదీలు దాడి చేసి చంపేసిన ఘటన చోటు చేసుకుంది. సుపేలా పోలీసుస్టేషన్‌ పరిధిలో అజయ్‌ దేవంగన్‌(34) అత్యాచార ఆరోపణలపై అరెస్టయ్యాడు. శుక్రవారం ఉదయం జైలు సిబ్బంది చూసేసరికి తనగదిలో చనిపోయి ఉన్నాడు. ఇద్దరు ఖైదీలు అతడిపై తీవ్రంగా కొట్టి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

08/05/2016 - 16:31

దిల్లీ: కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌ ఎంపీలు శుక్రవారం రాజ్యసభలో ఛైర్మన్‌ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

08/05/2016 - 16:20

నల్లగొండ: యాదాద్రిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆధ్వర్యంలో టీడీపీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వైకుంఠద్వారం వరకు సాగింది. లక్ష సంతకాలతో కూడిన 10 వేల పోస్టు కార్డులను సీఎం కేసీఆర్కు పంపించారు.

08/05/2016 - 16:16

ముంబైః శుక్రవారం ఉదయం నుంచీ ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైఃలో జన జీవనం స్తంభించిపోయింది. పలు రైళ్ళు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎయిర్ పోర్ట్ , రోడ్లు, రైల్వే ట్రాక్ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆఫీసులు, స్కూళ్ళకు వెళ్ళాల్సిన జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

08/05/2016 - 15:59

హైదరాబాద్ : మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల రైతులతో హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ముఖాముఖి ప్రారంభమవుతుంది. బలవంతపు భూసేకరణపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు, జస్టిస్ చంద్రకుమార్, టి. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతోపాటు వామపక్షాల నేతలు పాల్గొనున్నారు.

08/05/2016 - 15:56

హైదరాబాద్: క్రిమిలేయర్ కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈ అంశంపై త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలువనున్నట్లు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు శుక్రవారం తెలిపారు. 27 శాతం రిజర్వేషన్ కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన బీసీ సంఘాలకు సూచించారు. రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో మంచి ఫ్యాకల్టీ, డైరెక్టర్ లేక సిలబస్ పూర్తి కాలేదని విమర్శించారు.

Pages