S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/31/2016 - 05:35

ఏలూరు, మే 30: రాష్ట్రంలో కాపులను బిసిల్లో చేర్చడం ఖాయమని, దీని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని టిడిపి నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ముద్రగడ పద్మనాభం గ్రహించాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు.

05/31/2016 - 05:35

ఏలూరు, మే 30: జిల్లాలో జూన్ 2వ తేదీ నుండి 7వ తేదీవరకు నవ నిర్మాణ దీక్షా కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలుచేయాలని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ నుండి సోమవారం తహసిల్దార్లు, ఎంపిడిఓలతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు.

05/31/2016 - 05:34

జంగారెడ్డిగూడెం, మే 30: జూన్ 4న స్థానిక పొగాకు వేలం కేంద్రాల ఆవరణలో వర్జీనియా పొగాకు రైతు సదస్సు నిర్వహిస్తున్నట్టు పిసిసి అధికార ప్రతినిధి జెట్టి గురునాధరావు తెలిపారు. సోమవారం స్థానిక పాతబస్టాండువద్ద జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు.

05/31/2016 - 05:34

మొగల్తూరు, మే 30: మొగల్తూరు మండలం మోడి గ్రామంలో మనే్న దొరయ్యకు చెందిన పండుకప్పల చేపల చెరువులో సోమవారం చేపల పట్టుబడి జరిగింది. ఈ పట్టుబడిలో ఆరు కేజీల బరువు గల పండుకప్ప చేప పడటంతో రైతులకు ఆశ్చర్యం కల్గించింది. ఈ పండుకప్ప సుమారు 1200 రూపాయలు ఖరీదు వుంటుందని చేపల చెరువు రైతు దొరయ్య స్థానిక విలేఖరులకు తెలిపారు. చుట్టూ చేపల చెరువులు గల రైతులు ఈ పండుకప్పను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

05/31/2016 - 05:33

ఏలూరు, మే 30 : ప్రజలకు మెరుగైన సత్వర సేవలు అందించే దిశగా రెవిన్యూ శాఖలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా జూన్ 1 నుండి ఆటోమ్యూటేషన్ విధానం అమల్లోకి రానున్నట్లు ఏలూరు ఆర్‌డివో తేజ్‌భరత్ చెప్పారు. స్థానిక ఆర్‌డివో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ సమస్యలపై వినతులను ఆయన స్వీకరించారు.

05/31/2016 - 05:30

నెల్లూరు, మే 29: జిల్లాలో ఉన్న 5 రవాణా శాఖ కార్యాలయాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పనులు చేపడుతున్నట్లు ఉప రవాణా కమిషనర్ ఎన్.శివరాంప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఈ విలేఖరితో మాట్లాడుతూ కార్యాలయంలో ఏ పని ఉన్నా మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, అవసరమైన సమాచారాన్ని తమ ఉద్యోగుల వద్ద పొందవచ్చని భరోసా ఇచ్చారు.

05/31/2016 - 05:29

నెల్లూరు కలెక్టరేట్, మే 30: అభివృద్ధి చెందిన నగరాలకు దీటుగా రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలను సుందరీకరించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని పట్టణాభివృద్ధి, పురపాలక మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని వనంతోటలో సోమవారం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన రోడ్ వాక్యూమ్ స్వీపర్ మిషన్ (రహదారులను శుభ్రపరచే వాహన యంత్రం)ను ఆయన ప్రారంభించారు.

05/31/2016 - 05:28

వేదాయపాళెం, మే 30: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ముగిసాయి. సోమవారం జరిగిన ప్రథమ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షకు మొత్తం 14,248 మంది విద్యార్ధులకు గాను 13,324 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 924 మంది గైర్హాజరయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 1,632 మంది విద్యార్థులకు గాను 1,505 మంది విద్యార్థులు హాజరుకాగా 127 మంది గైర్హాజరయ్యారు. మాల్‌ప్రాక్టీస్ కేసులు ఎక్కడా నమోదు కాలేదు.

05/31/2016 - 05:28

హైదరాబాద్, మే 30: మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు తెలంగాణ ప్రభుత్వం ఎమ్సెట్-2 నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులను జూన్ 1నుండి స్వీకరించనుంది. దాదాపు 60వేల మంది పరీక్షకు దరఖాస్తు చేస్తారని అంచనా. దరఖాస్తు చేసిన వారిలో ఎక్కువమందికి హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల్లోనూ పరీక్ష కేంద్రాలకు సన్నాహాలు చేస్తున్నారు.

05/31/2016 - 05:28

నెల్లూరు టౌన్, మే 30: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో రెండేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా ఏడు వందలకు పైగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పి సురేంద్రరెడ్డి అన్నారు.

Pages