S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/14/2016 - 02:48

శ్రీకాకుళం(టౌన్), మే 13: ఆదినారాయణుడుగా ప్రసిద్ధికెక్కిని ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం కొబ్బరి చెక్కల వేలం మళ్లీ వాయిదా పడింది. ఈనెల 13వ తేదీన నిర్వహించిన తలనీలాలు, కొబ్బరి చెక్కల వేలంలో తలనీలాలకు వేలం ఖరారు కాగా కొబ్బరి చెక్కలకు 11.30 లక్షల రూపాయలకు వెల్లడంతో దేవస్థానం అధికారులు కనీసం 13 లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని ఆశించి వేలం వాయిదా వేసిన విషయం తెలిసిందే.

05/14/2016 - 02:47

శ్రీకాకుళం, మే 13: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. మండువేసవిలో సైతం మంచినీటికి ఇబ్బంది లేకుండా ఈ నీటి పథకాన్ని నిర్మించినట్టు పేర్కొన్నారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం టెక్కలి ప్రజలు దాహార్తితీర్చే టెక్కలిలో సమగ్ర మంచినీటి పథకాన్నిమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

05/14/2016 - 02:46

సీతంపేట, మే 13: సీతంపేట గ్రామంలో ఒక సెల్ దుకాణ యజమాని ఆన్‌లైన్‌లో మోసానికి గురయ్యాడు. బాధితుడు అందించిన వివరాలివి. మూడు రోజుల కిందట ఫోన్ నెంబరు 9136170083 నుంచి దుకాణ యజమాని జి.మన్మధరావుకు ఫోన్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి మన్మధరావుకు మీకు శ్యామ్‌సంగ్ జె-5 మోడల్ సెల్ ఫోన్, రెండు గ్రాములు బంగారం బహుమతిగా మీ నెంబరుకు వచ్చిందని చెప్పాడు.

05/14/2016 - 02:45

శ్రీకాకుళం, మే 13: పారాలీగల్ వాలంటీర్లు గ్రామస్థాయిలో చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు వి.బి నిర్మలాగీతాంబ పారాలీగల్ వలంటీర్లకు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా న్యాయస్థానాల ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ నిర్వహించిన నాలుగు రోజుల పారాలీగల్ వలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

05/14/2016 - 02:45

ఎచ్చెర్ల, మే 13: బోధకులకు డేటాబేస్‌పై మరింత పరిజ్ఞానం అవసరమని పినకిల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కు చెందిన రిసోర్స్ పర్సన్ వేణు స్పష్టంచేశారు.

05/14/2016 - 02:44

సారవకోట, మే 13: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలల్లో పనిచేస్తున్న సిబ్బంది రోగుల పట్ల సేవాదృక్పథంతో పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి స్థానిక మండల ప్రత్యేకాధికారి కోటేశ్వరరావు హితవుపలికారు. మండల పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్భంగా శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులను పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

05/14/2016 - 02:44

ఎచ్చెర్ల, మే 13: రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. జిల్లాలో రైతుభరోసా కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించేందుకు విచ్చేసిన రఘువీరాకు చిలకపాలెం కూడలిలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడారు.

05/14/2016 - 02:09

బంటుమిల్లి, మే 13: జూన్ నెల నుండి పెన్షన్ దారులకు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా నగదు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ బాబు.ఎ మండలంలోని బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

05/14/2016 - 02:09

మచిలీపట్నం (కల్చరల్), మే 13: పాఠకులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య కోరారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం పర్మినెంట్, అవుట్ సోర్సింగ్, గ్రామీణ గ్రంథాలయాల్లో పని చేస్తున్న సిబ్బందికి గ్రంథాలయాల నిర్వహణపై ఒక రోజు శిక్షణా తరగతి నిర్వహించారు.

05/14/2016 - 02:08

నాగాయలంక, మే 13: భారత దేశంలో తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన తెలుగువాడి బ్యాంకుగా ఆంధ్రా బ్యాంక్ ఇతర బ్యాంకులకు ధీటుగా నిలవటం ఆ జాతికే గర్వకారణమని ఎపి ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నాగాయలంకలో శుక్రవారం ఆంధ్రా బ్యాంక్ నవశక్తి ఆధునీకరణ పనులకు ఆయన ప్రారంభోత్సవం చేసిన అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. దేశ ప్రగతిలో బ్యాంకింగ్ వ్యవస్థ మూలస్తంభంగా నిలుస్తుందన్నారు. అట్టి వాటిలో డా.

Pages