Karimnagar

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్

Hide this category: 
Show

ఊపందుకున్న ఖరీఫ్ సాగు పనులు

జగిత్యాల రూరల్, జూన్ 27: ఖరీప్ సీజన్ ప్రారంభంలోనే ఆశించిన మేర వర్షపాతం నమోదు కావడంతో సాగు పనులు గ్రామాల్లో ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. జగిత్యాల ప్రాంతంలో ఎక్కువగా మొక్కజొన్న, పసుపు, వరిని అధిక విస్తీర్ణంలో సాగు చేపట్టేందుకు రైతులు ఆసక్తి చూపుతారు. ఇటీవల కురిషిన వర్షాలకు దుక్కులు దున్ని ఎరువులు వేసుకున్న రైతులు దుక్కుల్లో విత్తనాలు విత్తేందుకు తేమ పూర్తి స్ధాయిలో ఉండడంతో వారం రోజులుగా గ్రామాల్లో సాగు పనులు చురుకుగా సాగుతున్నాయి.

పారిశుద్ధ్యంలో కాసులపల్లి ఆదర్శం

పెద్దపల్లి రూరల్, జూన్ 27: సంపూర్ణ పారిశుద్ధ్యం లక్ష్యంగా ఆ గ్రామ ప్రజా ప్రతినిధులు, ప్రజలు కలిసి కట్టుగా ఒక్కటయ్యారు. ఇందు కోసం ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం అందిస్తుండటంతో ఇంటింట వ్యక్తి గత మరుగు దొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టారు. మురికి కాల్వలు లేని గ్రామంగా గుర్తింపు తీసుకు వచ్చారు. అందరికి సంపూర్ణ ఆరోగ్యం కోసం దోమలు, ఈగలు లేని గ్రామంగా చేసుకొని, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని కాసులపల్లి గ్రామంలో వంద శాతం వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించుకోవడంతో పాటు ఇంటింట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నారు. దీనితో గ్రామంలో మురికి కాల్వల అవసరం లేకుండా పోయింది.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

కరీంనగర్ టౌన్, జూన్ 27: జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషిచేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంఘటన కార్యదర్శి సకినాల హర్షవర్ధన్ కోరారు. మంగళవారం నగరంలోని ఆసంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సకాలంలో ఏకరూప దుస్తులు అందజేయాలని, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వ్యాయామ విద్య పోస్టులు సత్వరమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

హరితహారం మొక్కలు సిద్ధం

మానకొండూర్, జూన్ 27: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చెపట్టుతున్న హరిత హారం కార్యక్రమంలో భాగంగా జులై మొదటి వారంలో నుండి మొక్కలు నాటే కార్యక్రమానికి మండల అధికారులు ప్రణాళికలను సిద్దం చేశారు. మండలంలోని నాలుగు నర్సరి కేంద్రంలో ఏడు లక్షల మొక్కలు సిద్దంగా ఉన్నాయి. మండలంలోని ప్రతి గ్రామానికి 40 వేలు, మండలానికి 10 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం గా అధికారులు కార్యచరణను చెపట్టుతున్నారు.

అటకెక్కిన రైతుల రుణమాఫీ

చొప్పదండి, జూన్ 27: ఎన్నికల సమయంలో వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం రైతుల రుణమాఫీని అటకెక్కించిందని, మరో పక్క రైతులు పంటలు పండించి ధాన్యాన్ని అమ్ముకుంటే 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తామన్న ప్రభుత్వం 24 రోజులైనా డబ్బులు ఇవ్వటం లేదని, పైగా ఆన్‌లైన్ ద్వారా రైతులకు డబ్బులు రావటం లేదని, బ్యాంక్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పడిగాపులు కాస్తున్నారని, ఇదేనా రైతులకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసే న్యాయం అంటూ పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది.

రైతన్నా...పారాహుషార్...!

కరీంనగర్, జూన్ 27: ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. అన్నదాతకు చేతినిండా పని మొదలైంది. ఇప్పుడిపుడే కురుస్తున్న వర్షాలతో దుక్కులు దున్ని, విత్తనాలు చల్లేందుకు రైతన్న సన్నద్ధమవుతున్నాడు. విత్తేందుకు ఆసరాగా ఎరువులు, పురుగుల మందులు కూడా కొనుగోలు చేస్తుండగా, సందట్లో సడేమియాలా కొంతమంది వీటికి నకిలీ మకిలీ అంటగడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారులు దళారుల సహాయంతో ఆ నకిలీ విత్తనాల అమ్మకాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

సాక్షరభారత్ ఎంసివోలకు ఉద్యోగ భద్రత

కరీంనగర్ టౌన్, జూన్ 27: నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చుతూ, ఏళ్ళ తరబడి విధులు నిర్వహిస్తున్న జిల్లాలోని సాక్షరభారత్ మండల,గ్రామ సమన్వయకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎంసివో,విసివోల సంఘం జిల్లా అధ్యక్షురాలు ఏరువ లలితారెడ్డి కోరారు. మంగళవారం నగరంలోని టీఎన్జీవోల సంఘం భవన కార్యాలయంలోనిర్వహించిన ఆసంఘం జిల్లాసమావేశంలోపాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, జీవోనెం 203ప్రకారం 2010నుంచి కో ఆర్డినేటర్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి మండలస్థాయిలో నెలకు రూ.6వేలు, గ్రామస్థాయిలో నెలకు రూ.2వేలు మాత్రమే గౌరవ వేతనంగా అందజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జిఎస్‌టి అమలుపై వస్త్ర వ్యాపారుల నిరసన

జమ్మికుంట, జూన్ 27: వస్త్ర వ్యాపారాం చేస్తు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న బట్టల వ్యాపారంపై జిఎస్‌టి అమలుకు వ్యతిరేకంగా మంగళవారం జమ్మికుంట గాంధి చౌక్ వద్ద వ్యాపారులు నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడిమేడ్, క్లాత్ అసోసియోషన్ హైద్రాబాద్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తాంగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. రెడిమేడ్ క్లాత్ అసోసియేషన్ అధ్యక్షులు బుర్ర సత్యం, నాగుల శ్రీనివాస్‌లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమలు చేసే జి ఎస్‌టితో బట్టల వ్యాపారంపై అధనపు ఆర్ధిక భారం పడుతుందన్నారు. సోంత పెట్టుబడితో వ్యాపారం చేస్తు,పలువురికి ఉపాధి కల్పిస్తున్నమాన్నారు.

ఈద్ ముబారక్

కరీంనగర్, జూన్ 26: ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే ఈద్-ఉల్-్ఫతర్ (రంజాన్) వేడుకలను సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముస్లీం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 8గంటల నుంచి ప్రారంభమైన ప్రత్యేక పార్ధనల సందండి 11గంటల వరకు కొనసాగింది. చిన్నా, పెద్ద అనే తారమత్యం లేకుండా నూతన దుస్తులు ధరించి, వేలాది సంఖ్యలో ముస్లీం సోదరులు రంజాన్ వేడకుల్లో ఆనందోత్సహాల నడుమ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల కోసం తరలివచ్చిన ముస్లీం సోదరులతో కరీంనగర్ జిల్లా కేంద్రం శివారులోని సాలెహ్‌నగర్ ఈద్గా కిటకిటలాడింది. ఇక్కడికి చేరుకున్న ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు.

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

జమ్మికుంట, జూన్ 26: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల, మతాలను గౌరవిస్తుందని, ముస్లీం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుందని ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం జమ్మికుంట పట్టణంలో ముస్లీం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ పీతర్ (రంజాన్ ) పండుగను ఈద్గా మజీద్ కమిటి అధ్యక్షులు యం ఎ హుస్సేన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటలను ముస్లీం ఈద్గా కమిటి అధ్యక్షులు హుస్సేన్, ముస్లీంలు శాలువాతో సన్మానించారు.

Pages