Karimnagar

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్

Hide this category: 
Show

ఎమర్జెన్సీపై విస్తృత చర్చ జరపాలి

కరీంనగర్ టౌన్, జూన్ 26: నాలుగు దశాబ్దాల క్రితం దేశంలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీపై విస్తృత చర్చ జరుపుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఆపార్టీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని ఫిల్మ్‌భవన్‌లో ఎమర్జెన్సీ వ్యతిరేక నిరసన దినం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నాటి కాంగ్రెస్ హాయాంలోతప్పుడు విధానాలతోఅధికారం చేపట్టిన ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని రద్దు చేసే దిశగా ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతోభయపడి, ఎమర్జెన్సీ విధించందని అన్నారు.

రవికుమార్‌కు ఎక్సెలెన్సీ అవార్డు

హుజూరాబాద్, జూన్ 26: హుజూరాబాద్ మండలం రాజపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న వెనిశెట్టి రాజ్‌కుమార్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, పరిశ్రమల సమాఖ్య (ఫెపాప్సి) ఎక్స్‌లెన్సీ అవార్డుతో సత్కరించింది. ఈనెల 25 వ తేదీ ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఉపాధి, కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా రవికుమార్ ఈ అవార్డు అందుకున్నారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు విద్యార్థుకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, పుస్తకాలు అందించడం, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ, వృద్దులకు, అనాధలకు దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలను రవికుమార్ నిర్వహించారు.

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్

వీణవంక, జూన్ 26: మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న బండ సంపత్ (28) అలియాస్ సిద్ధు అనే అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు జమ్మికుంట గ్రామీణ సిఐ నారాయణ, వీణవంక ఎస్‌ఐ దామోదర్ రెడ్డిలు సోమవారం తెలిపారు. వీణవంక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఖాసిపేట మండలం సోమగూడెంకు చెందిన బండ సంపత్ చిన్నతనం నుండి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. పట్టపగలు, రాత్రివేళల్లో ఇండ్లకు తాళాలు వేసి ఉంచగా వాటిని ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సిఐ తెలిపారు.

స్మార్ట్‌సిటీ ప్రతిష్టను దిగజార్చవద్దు

కరీంనగర్, జూన్ 25: కొద్దిపాటి నిధులతోనే కరీంనగర్ నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పట్టించుకోని నగరపాలక సంస్థ పాలకవర్గం స్మార్ట్ సిటీ పథకం కింద వచ్చే భారీ నిధులతో చేపట్టే పనుల్లో అదే మాదిరిగా వ్యవహరిస్తే స్మార్ట్ సిటీ ప్రతిష్ట దిగజారడమే కాకుండా నగర ప్రజల ముందు నగుబాటు కాకతప్పదని టిడిపి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హెచ్చరించారు.

నేడు ‘రంజాన్’ వేడుకలు

కరీంనగర్, జూన్ 25: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రంజాన్ వేడుకలు సోమవారం జరగనుండగా, ఈ ద్గాలు, మజీదులు ముస్తాబయ్యాయి. ఈద్గాలు, మజీదులు విద్యుత్ కాంతులతో దగదగలాడుతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంతోపాటు జగిత్యాల, పెద్దపల్లి, గోదావరిఖని, హుజురాబాద్, కోరుట్ల, సిరిసిల్ల, మెట్‌ప ల్లి తదితర పట్టణాల్లోని ఈద్గాలు, మజీదులలో ముస్లీంలు ప్రత్యేక నమాజు చేయనున్నారు. అలాగే గ్రామాల్లోని ప్రార్థన స్థలాల వద్ద ప్రార్థనలు చేయనున్నారు. సోమవారం ఉదయం 8గంటల నుంచి ప్రారంభంకానున్న ప్రత్యేక పార్ధనల సందండి 11గంటల వరకు కొనసాగనుంది.

మయూరాన్ని రక్షించలేక పోయాం

సుల్తానాబాద్, జూన్ 25: భూపతిపూర్ గ్రామంలోని ఇటుక బట్టీల వద్ద జాతీయ పక్షి నెమలిని గుర్తించి గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఆదివారం పట్టుకున్నారు. ఇటుక బట్టీల వద్ద నీరు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన నెమలిని రక్షించేందుకు గాను ఆ గ్రామ సర్పంచ్ మునీశ్వరి, పోచమల్లు, ఎంపిటిసి భూమేష్, వీరగోని రమేష్ గౌడ్, కలువల తిరుపతి, ఆర్టీసి కండక్టర్ జెట్టి శ్రీనివాస్, విఆర్‌ఓ రాంరెడ్డితో పాటు పలువురు ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలో మృతి చెందింది. ఈ మేరకు ప్రజాప్రతినిధులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి చనిపోయిన నెమలిని పూడ్చి వేశారు.

ప్రతి పైసా లెక్క చూపాల్సిందే..

కరీంనగర్, జూన్ 25: ప్రతి పైసాకు లెక్క చూపాల్సిన సమయం రానే వస్తోంది. మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ (వస్తు సేవల పన్ను) విధానం అమలు చేయబోతోంది. దీంతో ఇప్పటిదాకా తప్పుడు లెక్కలతో సర్కార్ ఖజానాకు బొక్క పెట్టిన బడాబడా వ్యాపారుల్లో అయోమయం, ఆందోళన మొదలు కాగా, జీరో దందాకు ఇక చెల్లుచీటే. అటు చిరు వ్యాపారులకు ఊరట, ఇటు వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. ఏదిఏమైనా నాలుగు రోజుల్లో జిఎస్టీ అమలు కాబోతున్న దరిమిలా అందరి నోటా జిఎస్టీ పలుకే వినపడతోంది.

లక్ష్యానికి మించి మొక్కలు నాటాలి

కరీంనగర్, జూన్ 23: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమాన్ని జిల్లా అధికారులు సమన్వయంతో లక్ష్యానికి మించి మొక్కలు నాటి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని గ్రామాలలో హరితరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలతో అధికారులు సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటించాలని, నాటిన మొక్కలన్నీ సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రోడ్ల జంక్షన్ల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

సిరిసిల్ల, జూన్ 23: సిరిసిల్ల పట్టణ రోడ్ల జంక్షన్ అభివృద్ది పనులు నత్త నడకన సాగడంపై జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ పురపాలక ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సిరిసిల్ల పట్టణ రోడ్ల జంక్షన్ల అభివృద్దిపై పురపాలక ఇంజనీర్లు, సెస్, ఆర్ అండ్ బి అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు. అభివృద్ది పనులు ఆశించిన మేర వేగంగా జరగక పోవడంపై పురపాలక ఇంజీనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీచౌక్ అంబేద్కర్ చౌరస్తా జంక్షన్ల అభివృద్ది పనులు నెమ్మదిగా జరుగడం వల్ల పట్టణ ప్రజలు జిల్లా కేంద్రంకు వచ్చే వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు.

గోపాల్‌పూర్ హత్య కేసులో తండ్రీ కొడుకుల అరెస్ట్

ముకరంపుర కరీంనగర్, జూన్ 23: కరీంనగర్ మండలం గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన నాగిరెడ్డి హరికృష్ణ అనే యువకుడిని ఈ నెల 19న హత్య చేసిన అదే గ్రామానికి చెందిన ఎర్ర యేసురెడ్డి, ఎర్ర రామకృష్ణ అనే తండ్రీ, కొడుకులను శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ శశిధర్‌రెడ్డి తెలిపారు.

Pages