యువ

సైకిల్‌కి వెలుగుజిలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనిరుద్ధ తయారుచేసిన ఈ సైకిల్ ల్యాంప్ పేరే లూమినీర్. శక్తిమంతమైన చిన్న సైజ్ బల్బును, దానితోపాటే రీచార్జబుల్ యూనిట్‌ను సైకిల్ హ్యాండిల్ బార్ మధ్యలో ఏర్పాటు చేశాడు. దీనిని కంప్యూటర్ యుఎస్‌బి ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. కాబట్టి బయటకి వైర్లేమీ కనిపించవన్నమాట. సైకిల్ ఉన్నవారెవరైనా ఈ లూమినీర్‌ను కొనుక్కోవచ్చు. సైకిల్‌కి అమర్చుకోవచ్చు.
---
ఒకప్పుడు సైకిళ్లకూ లైట్లుండేవి. వాటిని డైనమో అనేవారు. లైట్ లేని సైకిళ్లను పోలీసులు సీజ్ చేసేవారు కూడా. వెనక టైరుకి పక్కనే ఉండే బ్యాటరీ ఘర్షణ శక్తితో చార్జ్ అయ్యేది. డైనమో వెలిగేది. కాలక్రమంలో సైకిల్‌కి లైటేంటి అనుకున్నారో ఏమో తీసేశారు. అయితే లైటుంటేనే బాగుంటుందనుకునే సైక్లిస్టులు ఇప్పటికీ ఉన్నారు. ఇది గమనించిన హైదరాబాద్ కుర్రాడు అనురుద్ధ సురభి రావు హ్యాండిల్ బార్‌లోనే లైట్‌ను ఏర్పాటు చేశాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుని ఢిల్లీ నిఫ్ట్‌లో చేరి డిగ్రీ పూర్తి చేసిన అనిరుద్ధ, ఇటలీకి వెళ్లి అక్కడ ప్రముఖ కార్ల కంపె నీ ఫెరారీలో ఏడాది కాలం పనిచేశాడు. తర్వాత లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లోనూ, ఇంపీరియల్ కాలేజీలోనూ డిజైనింగ్‌లో డిగ్రీలు చేశాడు. గత ఏడాది హైదరాబాద్‌కు తిరిగివచ్చిన అనిరుద్ధ, క్వోల్ట్ అనే సంస్థ ను ఏర్పాటు చేసి, మొట్టమొదటగా ‘లూమినీర్’ను డిజైన్ చేశాడు. అనిరుద్ధ తయారుచేసిన ఈ సైకిల్ ల్యాంప్ పేరే లూమినీర్. శక్తిమంతమైన చిన్న సైజ్ బల్బును, దానితోపాటే రీచార్జబుల్ యూనిట్‌ను సైకిల్ హ్యాండిల్ బార్ మధ్యలో ఏర్పాటు చేశాడు. దీనిని కంప్యూటర్ యుఎస్‌బి ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. కాబట్టి బయటకి వైర్లేమీ కనిపించవన్నమాట. సైకిల్ ఉన్నవారెవరైనా ఈ లూమినీర్‌ను కొనుక్కోవచ్చు. సైకిల్‌కి అమర్చుకోవచ్చు. వచ్చే ఆగస్ట్‌నుంచీ లూమినీర్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నా డు అనిరుద్ధ.
*