బిజినెస్

పెట్రోహబ్‌గా ట్రింకోమలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 13: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భారత్, శ్రీలంక శుక్రవారం నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్‌కు వ్యూహాత్మక పొరుగుదేశంగా ఉన్న శ్రీలంకతో సంబంధాలను పెంపొందించుకునేందుకు చేపట్టనున్న పలు చర్యలను మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. ట్రింకోమలీని పెట్రోలియమ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహాయాన్ని అందజేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేస్తూ, శ్రీలంకలో రైల్వే రంగం అభివృద్ధికి 31.8 కోట్ల డాలర్ల వరకు రుణాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. హిందూ మహాసముద్రంలోని మూడు దేశాల్లో జరుపుతున్న పర్యటనలో చివరిగా మోదీ శుక్రవారం ఉదయం కొలంబో చేరుకున్నారు. అనంతరం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో మోదీ సమావేశమై ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రాంతీయంగా ప్రాధాన్యత కలిగిన వివిధ ఇతర అంశాలపై చర్చించారు. ఆ తర్వాత సిరిసేనతో కలసి మోదీ సంయుక్తంగా విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, భారత ప్రధాన మంత్రి శ్రీలంకలో పర్యటించడం 1987 తర్వాత ఇదే తొలిసారి అని, ప్రస్తుతం తాను జరుపుతున్న పర్యటనకు గల ప్రాముఖ్యత ఏమిటో తెలుసని అన్నారు. సిరిసేనతో తాను జరిపిన సమావేశం ఫలప్రదమైందని, దీంతో భారత్, శ్రీలంక మధ్య భవిష్యత్తులో సంబంధాలు మరింత బలోపేతమవుతాయన్న నమ్మకం కుదిరిందని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా వీసా, కస్టమ్స్, యువజనాభివృద్ధి, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక నిర్మాణానికి సంబంధించిన నాలుగు ఒప్పందాలపై భారత్, శ్రీలంక సంతకాలు చేశాయి. భారత్, శ్రీలంక మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు, రెండు దేశాల్లో టారిఫ్ యేతర అవరోధాలను తగ్గించేందుకు, అధికారుల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు కస్టమ్స్ ఒప్పందం దోహదపడుతుందని మోదీ పేర్కొన్నారు. వివిధ రంగాల్లో భారత్, శ్రీలంక సాధించిన పురోగతి పటిష్టమైన ఆర్థిక సహకారం పట్ల రెండు దేశాలకు గల నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. గత కొన్ని దశాబ్దాల్లో భారత్, శ్రీలంక మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగిందని, భారత్‌తో వాణిజ్యం పట్ల శ్రీలంకకు గల ఇబ్బందులు ఏమిటో తమకు తెలుసని, ఇంతకుముందు న్యూఢిల్లీలో చెప్పినట్లుగానే ఈ ఇబ్బందులను తొలగించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తామని మోదీ హామీ ఇచ్చారు.
శ్రీలంక కరెన్సీ దన్ను
ఇదిలావుంటే, 150 కోట్ల డాలర్ల కరెన్సీ మార్పిడికి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక (సిబిఎస్‌ఎల్)తో ఒప్పందాన్ని కుదర్చుకునేందుకు భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) అంగీకరించింది. శ్రీలంక కరెన్సీ విలువను స్థిరంగా ఉంచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని మోదీ తెలిపారు.