భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.వి.ఎం.సురేశ్‌బాబు, ఒంగోలు
ప్ర: మనశ్శాంతితో స్థిరపడే యోగం ఉన్నదా?
సమా: ఒకే లక్ష్యంతో, ఒకే దీక్షతో భగవద్గీతను గురువుగా భావిస్తూ ప్రయత్నించండి. ఫలితం లభిస్తుంది. శాంతి బయట లేదు, మనలోనే ఉంది. ‘మనసే మనిషికి తీయని వరమూ, మనిషి బ్రతుకు నరకవౌను మనసు తనది కానిచో’ అంటూ సినీ గీతాలైనా గొప్ప నీతిని బోధించాయి. ఆలోచించండి.
డి.రేవతి, గజపతినగరం
ప్ర: నా సంకల్పం నెరవేరుతుందా?
సమా: ఆ అవకాశం లేదు. పెద్దల మాటనే పాటించండి.
ఎ.సుజాత, రామకృష్ణనగర్ (నెల్లూరు)
ప్ర: ఆరోగ్య విషయం..
సమా: ఒక ఆపరేషన్ సూచన ప్రాయంగా కనబడుతోంది. ఆ తరువాత కుదుటపడుతుంది. ఊపిరితిత్తులకు సంబంధించి సమస్య వస్తే అశ్రద్ధ చేయకండి. గుండెలో బరువులా అనిపించినా జాగ్రత్తపడండి.
ఐ.విజిత, సూళ్ళూరుపేట (నెల్లూరు)
ప్ర: వివాహ విషయం- విద్యా విషయం...
సమా: రెండూ బాగానే ఉన్నాయి. ఉత్తరం వైపు నుంచి స్ర్తి సహాయముగా సంబంధము రాగలదు. విద్యా విషయంలో భాషా సంబంధమైన రంగములు శ్రేష్ఠము.
ఎ.నాగరత్నమ్మ, ఆదోని (కర్నూలు)
ప్ర: కుమారుని వివాహం నా సంకల్ప ప్రకారం జరుగుతుందా?
సమా: మీ సంకల్పంలోనే మార్పు వచ్చే అవకాశం ఉంది. మీ అబ్బాయి సంకల్పమే జరుగుతుంది. మీరు రాజీపడతారు.
దూరి సురేశ్, దాసన్నపేట - విజయనగరం
ప్ర: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం నాకు వస్తుందా?
సమా: ఆ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పైగా తద్వారా ధనవ్యయమూ, శ్రమ, ఆలస్యమూ సూచించబడుతున్నాయి.
ఐతా ఆనందబాబు, గమళ్లపాలెం (నెల్లూరు)
ప్ర: మొన్నటివరకూ మీ భవిష్యకాలం శీర్షికను తేలికగా తీసుకొని కొట్టిపారేశాను. కానీ, మా బంధువుల విషయంలో మీరు చెప్పినవి నూరుపాళ్ళూ నిజమైనాయి. దయచేసి నా స్థిరత్వాన్ని గురించి చెప్పండి.
సమా: మీలో చురుకుదనం పాలు ఎక్కువ అనుకుంటున్నారు. చురుకుదనానికి, తొందరపాటు తనానికి తేడా గమనించండి. అప్పుడు మీకు అన్నీ సాధ్యమవుతాయి. జూన్ తరువాత మంచి మార్పు రాగలదు.
జొన్నవిత్తుల వెంకటప్పయ్య, తార్నాక
ప్ర: గురు నిలయమనే దైవ కార్యాన్ని సంకల్పించి, అది పూర్తి చేయగలనా?
సమా: ‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన’- పవిత్ర కార్యంలో ప్రయత్న లోపం చేయకండి. గీతావాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. దైవ సహాయం కోసం ‘సర్వార్థ సిద్ధి రామాయణం’ (ఉమాసంహిత ప్రోక్తము)లో ఒక ప్రత్యేక సర్గ ఉంది. అది పారాయణం చేసి అరటిపండ్లు నివేదించాలి. అలా చేయండి. ‘క్రియాసిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే’ అని భారవి సూక్తి.
ముత్యాల శ్రీనివాస్, మంగళగిరి
ప్ర: నేను నా జీవితంలో ఆర్థికంగా స్థిరపడకలేకపోతున్నాను. కారణం ఏమిటి?
సమా: లోగడ చేసిన కొన్ని పనులు.. బహుశా తొందరపాటు వల్లనో, ఎత్తుగడ అనుకొని చేసి ఉన్నారు. అవి వికటించాయి. కొంచెం ఓపిక పట్టండి. ఎత్తులు, జిత్తులు కాకుండా దూరదృష్టితో మంచివారి సలహాతో ప్రయత్నించండి. ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా..’ -అని ధైర్యం తెచ్చుకోండి. *

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి. బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర, కోదండ రామాలయం రోడ్డు,
శ్రద్ధాబాద్ (సైదాబాద్), హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com