రచ్చ బండ

అనర్హతల మాటేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు తెలుగు రాష్ట్రాల్లో విపక్షాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార పార్టీలోకి చేస్తున్న జంపింగ్స్ జోరందుకున్నాయి. అధికార పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారా? లేక అధికార పార్టీయే ఆకర్షిస్తున్నదా? అనేది వేరు విషయం. ఏదైతేనేం రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలను బలహీనపరచాలనుకోవడం అధికార పార్టీ ఎత్తుగడ అని అనుకోవచ్చు.
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరఫున 15 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఫిరాయింపుల పర్వం ప్రారంభంకాగా నేటికీ ఆ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు సైకిల్ దిగి ‘కారు’ ఎక్కేశారు. ఇలా పార్టీ ఫిరాయిస్తున్నది టిడిపినే కాదు, వైకాపా, కాంగ్రెస్ నుంచి కూడా జరిగింది. బిఎస్‌పి విలీనమైంది. పార్టీ ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాల్సిందిగా సంబంధిత పార్టీలు స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి వద్ద పిటీషన్లు దాఖలు చేశాయి. టిఆర్‌ఎస్‌లో చేరిన టిడిపి ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటీషన్లపై నిర్ణయం తీసుకోవాలా? లేక వారు విలీనాన్ని కోరుతూ ఇచ్చిన లేఖపై నిర్ణయం తీసుకోవాలా? అనేది అసెంబ్లీ స్పీకర్ ముందు పెద్ద సవాల్‌గా నిలిచింది. టిడిపి నుంచి ఒక్కొక్కరూ ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరారు. కాబట్టి 10వ షెడ్యూలు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం మూడింట రెండో వంతు టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరినందున వారిని విలీనంగా స్పీకర్ గుర్తించాలని, దీనికి చిక్కులేమీ ఉండవని ఆ రెండు పార్టీ నేతల భావన. కాగా తమ పార్టీ తరఫున ఎన్నికై టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై తాము దాఖలు చేసిన అనర్హత పిటీషన్లను పరిశీలించకుండా, వాటిపై నిర్ణయం తీసుకోకుండా విలీనం నిర్ణయం ఎలా తీసుకుంటారన్నది పిటీషనర్ల వాదన. ఈ అంశంపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునేలా చూడాలని కోరుతూ హైకోర్టులో వారు పిటీషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, అయితే త్వరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు కోర్టు తెలిపింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో స్పీకర్‌కు నిర్ణీత గడువు పేర్కొనలేదు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్‌ఎస్‌లో చేరి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. టిడిపి ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రభృతులపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ వద్ద పిటీషన్ దాఖలు చేసిన పిటీషనరే అంటే మొన్నటి వరకు టిడిపి శాసనసభాపక్షం నాయకునిగా వ్యవహారించిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా టిఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి పెరిగింది. కాబట్టి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని, మూడింట రెండో వంతు మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినందున 10వ షెడ్యూలు ప్రకారం విలీనమైనట్లు స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడిందన్న టిఆర్‌ఎస్ నేతల వాదన. అలా చేయడం సరైంది కాదని, తొలుత అనర్హత పిటీషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, లోగడ సుప్రీంకోర్టు కూడా ఇదే విధంగా స్పష్టం చేసిందని న్యాయ నిపుణులు ఉదహరిస్తున్నారు. ఒకవేళ అనర్హత పిటీషన్‌ను ఎదుర్కొంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యే తన సభ్యత్వానికి రాజీనామా చేస్తే కేసు ఉండదని అంటున్నారు. టిడిపి ఎమ్మెల్యేలు కోరుతున్నట్లు విలీనాన్ని స్పీకర్ ఆమోదించడానికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని 10వ షెడ్యూలులో స్పష్టత ఉన్నప్పటికీ, తొలుత స్పీకర్ అనర్హత పిటీషన్‌పై నిర్ణయం చెప్పాల్సి ఉంటుందని కొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లోగడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న కెఆర్ సురేష్ రెడ్డి హయాంలో కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ ఇండిపెండెంట్‌గా పోటీ చేయగా, టిఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కొందరు ఆయన నామినేషన్‌ను బలపరచడమే కాకుండా, ఓట్లు వేసి గెలిపించారు. కాసానికి 11 ఓట్లు రావాల్సి ఉండగా, 14 ఓట్లు లభించాయి. పార్టీ ‘విప్’ను ధిక్కరించి ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓట్లు వేసిన తమ పార్టీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాల్సిందిగా టిఆర్‌ఎస్ అప్పటి శాసనసభాపక్షం నాయకుడు ప్రస్తుత మంత్రి ఈటెల రాజేందర్ స్పీకర్ వద్ద పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై సుమారు రెండేళ్ళ పాటు వాదనలు జరిగి, చివరకు స్పీకర్ నిర్ణయం ప్రకటించడానికి రెండు రోజుల ముందు ఐదుగురు ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. మరో ఐదుగురిపై అనర్హత వేటు వేశారు. ఆ కేసు ‘విప్’ ధిక్కారానికి సంబంధించింది. ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది. అయినా రెండూ అనర్హత పిటీషనే్ల. ఇప్పుడు స్పీకర్ తొలుత అనర్హత పిటీషన్లపై నిర్ణయం తీసుకుంటారా? లేక విలీనంపై నిర్ణయం తీసుకుంటారా? అది కూడా వచ్చే నెలలో ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోగా నిర్ణయం తీసుకుంటారా? లేదా? అని అన్ని పార్టీల నాయకులు ఎదురు చూస్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే అసెంబ్లీ అధికారులు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు టిఆర్‌ఎస్ (టెజరీ బెంచ్) వైపు సీట్లు కేటాయించేందుకు అవకాశం లేదు. దీంతో ఫిరాయించిన ఎమ్మెల్యేలు టిడిపికి లోగడ కేటాయించిన స్థానాల్లోనే కూర్చోవాల్సి ఉంటుంది. సమావేశాల్లోగా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి