బిజినెస్

ఆఫ్రికా చమురుపై ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: మధ్యప్రాచ్య దేశాలపై అధికంగా ఆధారపడకుండా ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే ఇకమీదట ఆఫ్రికా నుంచి చమురు దిగుమతులను పెంపొందించుకోవాలని యోచి స్తోంది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం భారత్ చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతు న్నాయ. ఇందులో మూడింట రెండు వంతుల చమురు సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ తదితర మధ్యప్రాచ్య దేశాల నుంచే దిగుమతి అవుతోంది. దీంతో దేశీయ చమురు అవసరాల కోసం మధ్యప్రాచ్య దేశాలపై అధికంగా ఆధారపడకూడదని భారత్ నిశ్చయించుకున్నట్లు తెలిపారు. గత కొనే్నళ్లుగా ఆ ప్రాంతం నుంచి దిగుమతులను కూడా తగ్గించుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో భారత్ మొత్తం 99.36 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకోగా, ఇందులో 57 శాతం మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చింది. 2014లో భారత్ ఆఫ్రికా పశ్చిమ ప్రాంతం నుంచి 29 మిలియన్ టన్నులు, ఉత్తర ప్రాంతం నుంచి 3 మిలియన్ టన్నులుసహా ఆఫ్రికా నుంచి మొత్తం 32 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకుందని మంత్రి వివరించారు. ప్రధానంగా నైజీరియా, అంగోలా నుంచే ఈ దిగుమతులు జరిగాయని, దేశీయ వినియోగంలో ఈ దిగుమతుల వాటా సుమా రు 16 శాతం మేరకు ఉందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. రానున్న సంవత్సరాల్లో ఈ దిగుమతులు మరింత పెరుగుతాయన్నారు. ఇంధన వనరులకు సంబంధించి భారత్, ఆఫ్రికా దేశాల 4వ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆఫ్రికా ఖండంలో గత రెండు దశాబ్దాల నుంచి ఇంధన వనరుల రంగం ఎంతో వేగవంతంగా విస్తరిస్తోందని, అలాగే ఆ ఖండంలో భారత చమురు సంస్థల ప్రయోజనాలు కూడా పెరుగుతున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. దేశ ఇంధన దిగుమతులను భౌగోళికంగా ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న విధానంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అందుకే మన్ముందు ఆఫ్రికా ఖండం నుంచి పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను పెంపొందించుకోవడంపై దృష్టి కేంద్రీకరిస్తోందని ఆయన తెలిపారు. ఆఫ్రికా నుంచి జరుగుతున్న చమురు దిగుమతులు భారత దేశ ఇంధన భద్రతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయన్నారు. గత ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో దిగుమతి చేసుకున్న 99.36 మిలియన్ టన్నుల చమురులో మూడో వంతు ఆఫ్రికా ఖండం నుంచి రాగా, ఉత్తర అమెరికా నుంచి సుమారు 16 శాతం చమురును దిగుమతి చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. కాగా, గత ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య భారత్‌కు అధిక మొత్తంలో చమురును సరఫరా చేసిన దేశాల్లో సౌదీ అరేబియా 19.56 మిలియన్ టన్నులతో అగ్రస్థానంలో నిలువగా, 17.01 మిలియన్ టన్నులతో ఇరాక్ ద్వితీయ స్థానంలోనూ, 11.59 మిలియన్ టన్నులతో నైజీరియా తృతీయ స్థానంలోనూ ఉన్నాయని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.