ఆరోగ్య భాగ్యం

మెనోపాజ్ సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెలనెలా వచ్చే ఋతుస్రావం 45-50 సం. వయసులో ఆగిపోవడం స్ర్తి జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు. దీనినే ‘మెనోపాజ్’ అంటాం. సంతానోత్పత్తి చివరి దశగా మనం దీన్ని గుర్తించాలి. 40 సంవత్సరాల కంటే ముందే బహిష్టులు ఆగిపోతే దానిని ప్రిమెచ్యూర్ మెనోపాజు లేక అకాల వృ ద్ధాప్యం అంటారు. కొంతమందికి 55 ఏళ్ల వయసు వరకు కూడా బహిష్టులు రావచ్చు. ఐతే ఇది చాలా తక్కువ శాతంగా (3-4% వరకు) ఉండవచ్చు. 40 ఏళ్లకు ముందే మెనోపాజు వస్తే స్ర్తి ఆరోగ్యానికి మంచిది కాదు.
అండాశయంలో వుండే అండకణాలు (్యజషళఒ) ఈస్ట్రోజన్ అనబడే ఒక ముఖ్యమైన హార్మోన్‌ను ఉత్పత్తిచేస్తాయి. మెనోపాజ్ సమయంలో ఈ ఫాలికిల్స్ లోపించి ఈస్ట్రోజన్ ఉత్పత్తి క్రమేపీ తగ్గి ఆగిపోతుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువుకి కొన్ని మిలియన్ల సంఖ్యలో వుండే ఫాలికిల్స్ ఆమె జీవితకాలంలో 350-400 వరకు మాత్రమే ఖర్చు అవుతాయి. మిగతావాటిలో నిద్రాణ స్థితిలో కొన్ని, అణిగిపోయి మరికొన్ని - మెనోపాజు సమయంలో పూర్తిగా లుప్తమైపోతాయి. మెనోపాజు వయస్సును ఒక స్ర్తిలో నిర్ణయించే విషయాలు- వంశపారంపర్యత, స్ర్తి యొక్క పోషణ, సంతాన ప్రాప్తి, ఎక్స్‌రే చికిత్సలు, గర్భసంచి తొలగించే ఆపరేషన్లు, ఓవరీలపై శస్తచ్రికిత్స రేడియేషన్ కీమోథెరపీ ప్రభావం వంటివి. ఇవి కూడా మెనోపాజుకి దారి తీస్తాయి.
సంతానం లేని స్ర్తిలకి, సంతానం కోసం వాడే మందుల వల్ల కూడా మెనోపాజు త్వరగా వచ్చే అవకాశం వుంది.
అయితే ఫామిలీ ప్లానింగ్ పిల్స్ వాడిన వారిలో మెనోపాజు సరిఅయిన సమయంలో వస్తుంది.
అందుకనే 40 ఏళ్ల కంటే ముందు బహిష్టులు ఆగిపోతే 2-3 నెలలు చూసి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. అలాగే ఆలస్యమైతే అంటే- 50 సం.వరకూ పిరియడ్సు వస్తున్నా వైద్యుల్ని సంప్రదించాలి.
ధూమపానం చేసే స్ర్తిలకు త్వరగా మెనోపాజు వ స్తుంది. త్వరగా వస్తే ఏమిటి నష్టం? అని అనుకోకూడదు. ఎందుకంటే వంట్లో ఈస్ట్రోజన్ తగ్గితే ఎముకల పటుత్వం తగ్గి ఎముకలు నొప్పి, మరీ తగ్గితే ఎముకలు గుల్లగా మారి పుటుకు పుటుకుమని విరిగిపోతాయి. దీనే్న ఆస్టియోపోరోసిస్ లేక గుల్ల ఎముకల వ్యాధి అంటారు. ముఖ్యంగా చేతులు, ముంజేతులు, తుంటి ఎముకలు విరిగితే ఆ స్ర్తి జీవితం దుర్భరం. దానికి ఆపరేషన్లు, నడవడంలో, పనిచేయడంలో కష్టాలు తప్పవు.
నడుము గొలుసులో లాగ చిన్నచిన్న ఎముకలు వరుసగా వుంటాయి. మనం వంగడానికి వీలయేలాగ చిన్నచిన్న అతుకులతో వుంటాయి. త్వరగా మెనోపాజు వచ్చిన స్ర్తిలకు నడుములో ఎముకలు కూడా విరిగి అడ్డదిడ్డంగా అతుక్కుని వంకరగాను, గూనిగాను నడుము వంగిపోవచ్చు. కనుక మెనోపాజు త్వరగా రాకుండా చూడాలి. సెక్సు సంబంధిత సమస్యలు కూడా రావచ్చు.
మెనోపాజు సక్రమమైన సమయంలో వచ్చినా ఎముకలు చర్మం, తల వెంట్రుకల నిగారింపు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందుకనే వైద్య సలహాలు వీరికి తప్పనిసరి. మెనోపాజు తర్వాత 20-30 సం.వరకూ స్ర్తి జీవిస్తుంది. కనుక ఆ మూడోవంతు వయసు ఆరోగ్యంగాను ఆనందంగాను గడపాలి- తగిన వైద్య సలహాలతో.

-- డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో