ఆటాపోటీ

ఒక్కటైన ప్రత్యర్థులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాకర్ చరిత్రలోనే అసాధారణ క్రీడాకారులుగా పేరుప్రఖ్యాతులు సంపాదించిన ప్రత్యర్థులు పీలే, డిగో మారడోనా ఒకే వేదికపై కలవడం అభిమానులకు కనువిందు చేసింది. ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ఒక్కో జట్టులో ఐదుగురు సభ్యులు ఆడిన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌ని తిలకించేందుకు పీలే, మారడోనా హాజరయ్యారు. ఒకరినినొకరు సాదరంగా ఆహ్వానించుకున్నారు. అనంతరం మారడోనా మాట్లాడుతూ పీలే లాంటి ఐకాన్ ఆటగాళ్లు సాకర్‌కు మార్గదర్శకులని ప్రశంసించాడు. పీలే వంటి అసాధారణ ప్రతిభావంతులు అరుదుగా ఉంటారని కొనియాడాడు. పీలే కూడా అంతే ఒద్దికగా మారడోనాను పొగడ్తల్లో ముంచెత్తాడు. ప్రపంచ శాంతి కోసం తనవంతు కృషి చేస్తున్న మారడోనా ప్రశంసనీయుడని అన్నాడు. సుమారు ఒకటిన్నర దశాబ్దాల వైనాన్ని మరచి ఇద్దరూ ఈ విధంగా ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు హర్షధ్వానాలతో వారిని అభినందించారు. ఇరవయ్యో శతాబ్దంలో మేటి క్రీడాకారుడిని ఎంపిక చేసి, ప్లేయర్ ఆఫ్‌ది సెంచరీ అవార్డును ఇవ్వాలని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ 2000లో నిర్ణయించినప్పుడు పీలే, మారడోనా మధ్య పోటీ తలెత్తింది. మొదట ఆన్‌లైన్ ద్వారా ఓటింగ్‌ను నిర్వహించగా, మారడోనాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే, ఆన్‌లైన్ వాడకందారుల్లో ఎక్కువ మంది యువతీయువకులే కాబట్టి వారికి పీలే గురించిన పూర్తి అవగాహన ఉండదన్న వాదన తెరపైకి వచ్చింది. పీలే సాకర్ ఆడిన రోజుల గురించిగానీ, అతను అందించిన సేవల గురించిగానీ తెలియనివారు వేసిన ఓట్లను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారంటూ చాలా మంది ఫిఫాను నిలదీశారు. దీనితో కంగుతిన్న ఫిఫా మరోసారి ఓటింగ్ జరపాలని నిర్ణయించింది. ఫిఫా పత్రికను చదివే వారే ఓటింగ్‌లో పాల్గొనాలన్న నిబంధన విధించింది. ఆ ఓటింగ్‌లో పీలేకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. రెండు రకాల ఓటింగ్‌లో రెండు రకాల ఫలితాలు రావడంతో ఫిఫా మల్లగుల్లాలు పడింది. చివరికి ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ప్రకటించింది. ఈ సంఘటన జరిగిన తర్వాత చాలాకాలం పీలే, మారడోనా పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శలు గుప్పించుకున్నారు. బద్ధశత్రువులుగా ముద్రపడ్డారు. చాలాకాలం తర్వాత ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడమేగాక, ఒకరినొకరు ప్రశంసించుకోవడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.