ఆటాపోటీ

దటీజ్ ఫరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఏదైనా రేసులో పాల్గొని, ఎవరైనా తోయడంతో లేదా పొరపాటునో కిందపడి.. వెంటనే లేచి మళ్లీ పరుగులు పెట్టి విజేతగా నిలవడం కేవలం సినిమాలకే పరిమితం కాదని నిరూపించాడు బ్రిటిష్ స్టార్ అథ్లెట్ మో ఫరా. రియో ఒలింపిక్స్ పురుషుల 10,000 మీటర్ల పరుగులో పోటీపడిన అతను రేస్ సగం పూర్తయిన సమయంలో పట్టుతప్పి కింద పడ్డాడు. అయితే, వెంటనే కోలుకున్నాడు. పైకి లేచి రేస్‌ను కొనసాగించాడు. 27 నిమిషాల 5.17 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. అత్యంత నాటకీయంగా సాగిన ఈ రేస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. లక్ష్యం మరో వంద మీటర్ల దూరంలో ఉండగానే, అందరి కంటే ముందున్న ఫరా తనదైన ట్రేడ్‌మార్క్ ఫోజుతో ప్రేక్షకులకు అభివాదం చేశాడు. కెన్యాకు చెందిన పాల్ తనుయ్ 27 నిమిషాల 5.64 సెకన్లతో రజత పతకాన్ని అందుకున్నాడు. తమిరట్ టొలా (ఇథియోపియా) 27 నిమిషాల 6.26 సెకన్లతో కాంస్య పతకాన్ని సాధించాడు. కాగా, ఫరాకు ఒలింపిక్స్‌లో ఇది మూడో స్వర్ణం. లండన్ ఒలింపిక్స్‌లో అతను 10,000 మీటర్లు, 5,000 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాలను గెల్చుకున్నాడు. ఈసారి 5,000 మీటర్ల పరుగులో కాంస్యంతో సరిపుచ్చాడు.

- సత్య