ఆటాపోటీ

నిర్మాణాలు నాసిరకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఒలింపిక్స్ కోసం చేపట్టిన పలు నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయన్న విషయం మరోసారి స్పష్టమైంది. మడురెరా పార్క్‌లో ఏర్పాటు చేసిన ఒలింపిక్స్ రింగ్స్‌లో ఒకటి పాక్షికంగా విరిగింది. ఎవరో బలంగా కొట్టినందుకో లేక ఉద్దేశపూర్వకంగా పెకళించే ప్రయత్నం చేసినందుకో అది విరగలేదు. పార్క్‌లో పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఓ పిల్లవాడి చేయి తగిలి అది విరగడం విశేషం. ఒలింపిక్ రింగ్స్‌ను మరీ ఇంత నాసిరకంగా తయారు చేస్తారా అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటికే క్రీడా గ్రామంలోని చాలా గదులు పైకప్పు పెచ్చులు ఊడిపోయి, వైర్లు వేళ్లాడుతూ కనిపిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చాలా గదులు దుర్వాసన వెదజల్లుతున్నాయి. ట్రైనింగ్ చేసే వేదికల్లోనూ వౌలిక వసతులు లేవని ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న అథ్లెట్లు వాపోతున్నారు. ఒలింపిక్స్ రింగ్ విరిగిపోవడం అక్కడి నిర్మాణాలు తీరుతెన్నులకు అద్దం పడుతున్నది.

- సత్య