ఆటాపోటీ

లోచెపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా స్టార్ స్విమ్మర్ ర్యాన్ లోచెపై బ్రెజిల్ పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. దోపిడీకి గురయ్యామంటూ తప్పుడు కేసు పెట్టినందుకు లోచెపై కేసు దాఖలైందని స్థానిక మీడియా ప్రకటించింది. పోలీస్ దుస్తుల్లో ఉన్న కొంత మంది తమ వాహనాన్ని అడ్డుకొని, తుపాకీ గురిపెట్టి దోచుకున్నారని రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న లోచె, జాక్ కాంగర్, గన్నర్ బెంజ్, జిమీ ఫీగెన్ గతనెల 15న ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ సంఘటనను ప్రతిష్ఠాత్మకంగా స్వీకరించిన బ్రెజిల్ అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. కేసును పరిశీలించిన అధికారులకు లోచె తదితరులను గుర్తుతెలియని వ్యక్తులు దోచుకున్నారనడానికి సాక్ష్యాలు దొరకలేదు. అంతేగాక, లోచె బృందం తాగిన మైకంలో ఒక గ్యాస్ స్టేషన్ రెస్ట్‌రూమ్‌ను పాక్షికంగా ధ్వంసం చేసినట్టు సీసీ కెమెరా ఫుటేజ్‌లో స్పష్టమైంది. ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడు గస్తీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిలో ఎవరూ లోచెకుగానీ, అతని సహచర స్విమ్మర్లకుగానీ తుపాకీ గురిపెట్టిన దృశ్యాలేవీ కనిపించలేదు. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే లోచె స్వదేశానికి వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత ఇంటిదారి పట్టిన జాక్ కాంగర్, గన్నర్ బెంజ్‌లను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోచెతో కలిసి తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణతో వారిని విచారించారు. జిమీ ఫీగెన్ నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఆతర్వాత వారిని విడిచిపెట్టిన పోలీసులు, తాజాగా లోచెపై కేసు నమోదు చేశారు.