మెయిన్ ఫీచర్

మనసున్న వైద్యులు.. అడవి బిడ్డలకు ఆపన్నహస్తం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిరిజన గ్రామాల్లో వైద్యసేవలు అందిస్తున్న ఆదర్శ దంపతులు
పలు అవార్డులు సొంతం పద్మ పురస్కారం ప్రకటన

వైద్యనారాయణోహరిః అనే మాటను అక్షరసత్యం చేసేది కొందరే. ఇలాంటి కోవకు చెందుతారు ఈ వైద్య దంపతులు. లక్షల్లో సంపాదన. విదేశాల్లో సుఖవంతమైన జీవనం. ఇవేమి ఈ మనసున్న వైద్యులను మురిపించలేదు. పోషకాహారం లేమితో.. దొరికింది తిని.. నాటుసారా మత్తులో తూగే అడవిబిడ్డలే తమ బిడ్డలుగా భావించారు. పల్లెల ప్రగతితోనే దేశాభివృద్ధి అని గాంధీ మహాత్ముని మాటలే ఈ దంపతులకు ఆదర్శప్రాయమయ్యాయి. గాంధేయ మార్గంలో సామాజిక సేవకు నడుం బిగించారు. సేవ చేయాలంటే ‘సెర్చ్’ (సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్, యాక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్ కమ్యూనిటీ) అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి వేలాది మంది గిరిజనులకు వైద్యం చేస్తున్నారు. చదువుకున్న చదువుకు సార్థకత తీసుకువస్తున్నారు. అందుకే రాణీ అభయ్ బంగ్‌కు పద్మశ్రీ పురస్కారం దక్కింది.

డాక్టర్ రాణీ అభయ్ బంగ్, ఆమె భర్త అభయ్ బంగ్ అమెరికాలో వైద్య వృత్తి చేసేవారు. గాంధేయ మార్గంలో ప్రయాణించే ఈ అదర్శ దంపతులు తమ మాతృభూమికి సేవ చేయాలని భావించి లక్షల్లో వచ్చే సంపాదనను కాదని భారతదేశానికి తిరిగివచ్చారు. తమ సేవకు వారు మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లాను ఎంపికచేసుకున్నారు. ఈ జిల్లాలో అత్యధికి శాతం మంది గిరిజనులే నివశిస్తారు. చదువుసంధ్యలకు దూరంగా.. రోగాలతో సహజీవనం చేస్తున్న వీరి స్థితిగతులపై తొలుత సర్వే నిర్వహించారు. గోండ్ గిరిజనులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో వీరికి నివ్వెరపోయే నిజాలు తెలిశాయి. ఈ జిల్లాలోని అనేక గ్రామాలలో దాదాపు 92శాతం మహిళలు జననేంద్రియ రుగ్మతలుతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. దాదాపు 58 గ్రామాలలో పిల్లలు న్యూమోనియాతో చనిపోతున్నట్లు తెలుసుకున్నారు. వీరి ప్రాణాలను కాపాడేందుకు తమ చేయూత అవసరం అని భావించారు.
కర్మభూమి ఏర్పాటు..
సాయం చేయడంలోనే నిజమైన సంతోషం ఉందని భావించిన ఈ దంపతులు గోండో గిరిజనులు అధికంగా ఉండే షోద్ గ్రామాన్ని ఎంచుకున్నారు. అక్కడ 13 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. గోండో గిరిజనులు ఏవిధంగా గుడిసెలు నిర్మించుకుంటారో అలానే వీరు కూడా ఆసుపత్రిని నిర్మించారు. వార్డులు సైతం అలానే ఉంటాయి. ఔట్ పేషెంట్ విభాగం ఉన్నది. అలాగే గిరిజనులు తినే ఆహార పదార్థాలలో పౌష్టికాహారమైన వాటితో క్యాంటీన్ సైతం ఏర్పాటుచేశారు. అంబులెన్స్ సదుపాయం ఉన్నది. ఈ పదమూడు ఎకరాల్లోనే ట్రైనింగ్ సెంటర్, రీసెర్చ్ సెంటర్, మద్యానికి బానిసైలన గిరిజనులు ఆ మత్తు మహమ్మారి నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఓ సెంటర్, మందుల షాపు, ఈ ఆసుపత్రిలో పనిచేసే స్ట్ఫా కోసం క్వార్టర్స్, ప్రేయర్ కమ్ మీటింగ్ హాలు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్, విజిటర్స్ ఉండేందుకు కూడా క్వార్టర్స్ నిర్మించారు. ఈ ప్రాంగణానికే ‘కర్మభూమి’అని పేరు పెట్టారు.
గిరిజన మహిళల్లో చైతన్యం..
ప్రతి రోజూ సాయంత్రం డిన్నర్‌కు ముందు వీరంతా మీటింగ్ హాలులో సమావేశమవుతారు. గిరిజనుల్లో పోషకారలేమిని తరిమికొట్టడానికి ఏలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తారు. అవగాహన సదస్సులో ఏర్పాటుచేసి చైతన్యవంతుల్ని చేయటానికి ఏమేమి చేయాలో చర్చిస్తారు. గాంధేయ మార్గంలో ఆ అడవిబిడ్డల్లో మార్పు తీసుకరావటానికి ప్రయత్నిస్తారు. తొలి రోజుల్లో ఈ జిల్లాలో ఉండే దాదాపు అరవై గ్రామాల్లో ఈ దంపతులు చెప్పులు లేకుండా కాలినడకన వెళ్లి వారికి వైద్య సేవలు అందించారు.
మూఢ నమ్మకాలతో ఆధునిక వైద్యసేవలు దగ్గరకు రానివ్వని ఆ గిరిజన మహిళలతో డాక్టర్ రాణీ అభయ్ బంగ్ మమేకమై వారితో మాట్లాడి వైద్య సేవలు అందించేవారు. అలా వారిలో జననేంద్రీయ జబ్బులకు ట్రీట్‌మెంట్ చేసేవారు. ఈ జబ్బులే ఎయిడ్స్‌గా మారకుండా కాపాడారు. ఆడపిల్లలకు నైతిక విషయాలను బోధించేవారు.
పుట్టే బిడ్డల్లో ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు తలెత్తకుండా వైద్య సేవలు అందించారు. రాణీ అభయ్ చేసిన కృషి ఫలితంగా ఇక్కడ చైల్డ్ మోరాలిటీ 12 నుంచి 30 శాతానికి పెరిగింది. ఈ విషయాన్ని వివిధ దేశాల ఆర్గనైజేషన్స్ సైతం గుర్తించాయి.
స్వచ్ఛందంగా సేవలు
క్రమేణ సేవ చేయాలనే అభిలాష కలిగిన ఇతర వైద్యులను కలుపుకుని సెర్చ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. సెర్చ్ సంస్థలో ఎంతోమంది వైద్యులు చేరారు. వీరంతా సామాజిక సేవ కోసం వచ్చినవారే. వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వేలాదిమంది గిరిజనులు నాడి పట్టి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఎన్నో అవార్డులు సొంతం..
వీరు చేస్తున్న సామాజిక సేవను గుర్తించి ఎన్నో సంస్థలు సైతం అవార్డులు అందజేశాయి. మేక్‌అర్తర్ సంస్థ ‘సృజనాత్మక సోషల్ వర్క్ అవార్డును అందజేసింది. 2003లో ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డును ఆ రాష్ట్ర ప్రభుత్వ అందజేసి గౌరవించింది. 1996లో శేషాద్రి గోల్డ్ మెడల్, 2005లో టైమ్ మేగజైన్ 18 మంది గ్లోబల్ హెల్త్ హీరోలు జాబితాలో ఈ దంపతులకు చోటు దక్కింది. 2006లో రాణీ అభయ్ బంగ్‌కు జమన్‌లాల్ బజాజ్ పురస్కారం దక్కింది. అల్బెర్ట్ ఐన్‌స్టీన్‌ను ఆదర్శంగా తీసుకుని ఈ దంపతులు తమ సేవాకార్యక్రమాలను కొనసాగించేందుకు ముందుకు సాగుతున్నారు.
దారుముక్తి సంఘటన అనే విభాగాన్ని ఏర్పాటుచేసి మద్యపానంపై అవగాహన సదస్సులు ఏర్పాటుచేసేవారు. సదస్సుకు మూడువేలమంది డెలిగేట్స్ హాజరయ్యేవారంటే వీరు చేసిన కృషి ఏలాంటిదో తెలుసుకోవచ్చు. క్రమేణ ఆ అమాయక గిరిజనులలో మద్యపానం వ్యసనం దూరం చేయగలిగారు.

-టి.ఆశాలత