ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( అక్టోబర్ 30 నుండి నవంబర్ 5 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలందు అసౌకర్యాలున్నప్పటికీ ప్రయోజనాలుంటాయి. పరామర్శలకు వెళ్లవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆనందాన్నిస్తాయి. విద్యార్థులకు కళాశాల విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురుచూపులు వద్దు. ఆశించినవి పొందుతారు. ఆశయాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. కొన్ని నిర్ణయాలు మంచి ఫలితాలిస్తాయి. స్పెక్యులేషన్ మేలు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
ఆలోచనలు కలసి వస్తాయి. బంధుమిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు. వ్యాపార విస్తరణకు అవకాశాలున్నాయి. ఆదాయ సమీకరణకు అనుకూలం. ఖర్చులు పెంచుకోకండి. ప్రణాళికా పథకాలతో మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లు ఉంటాయి. శ్రమానుకూలంగా స్ర్తిలకు కలసి వస్తుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం. ఆదాయ వ్యవహారాలందు ఆచితూచి వర్తించాలి. ఉద్యోగ, వ్యాపారాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. ఒక వార్త సంతోషాన్నిస్తుంది. అకాల భోజనాల వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోండి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఆదాయానికి లోటుండదు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. వాహన సౌఖ్యం. సంతానంతో సఖ్యత, సంతాన ప్రాప్తి. కుటుంబ వ్యవహారాలందు తృప్తి. వస్తు, వస్త్ర ప్రాప్తి. బంధువులతో స్నేహంగా మెలగండి. పరిస్థితులు చేజారకుండా చూసుకోండి. వృత్తి, వాహన రంగం, రియల్ ఎస్టేట్, డైరీ, వ్యవసాయ రంగాలందు కొత్త పోకడలకు అవకాశాలు. నిరుద్యోగులకు శ్రమానుకూలంగా ఉద్యోగావకాశాలు కలసి వస్తాయి. సిబ్బందితో సఖ్యంగా ఉండాలి. దంపతులు ముఖ్యులను కలుసుకుంటారు. ఉపయుక్తమైనవి అందుకుంటారు. పెట్టుబడులు మిశ్రమం.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

అనుకున్నది సాధించే అవకాశాలున్నాయి. ప్రోత్సాహకాలు, మన్ననలు అందుకుంటారు. రాజకీయ నాయకులు కొన్ని అనుకూల విషయాల్లో సాయపడతారు. వ్యవహార ఒప్పందాలు మెళకువ అవసరం. స్పెక్యులేషన్ మిశ్రమం. రావలసిన ఆదాయ వనరులు రెట్టింపు అవుతాయి. శ్రమ మేరకు ఫలితాలుంటాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలం. ఉద్యోగం మేలైన మార్పులకు లోనవుతుంది. ఔషధ సేవనం అవసర పడవచ్చు. చుట్టాలు, దూరపు మిత్రుల రాక ప్రయోజనం కలిగిస్తుంది. భాగస్వామ్య వ్యవహారాలు ఫలవంతం అవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

చేద్దామనుకున్న కార్యాలు పూర్తి చేస్తారు. మిత్రుల సాయం తీసుకుంటారు. జీవితంలో ఈ వారం గుర్తుండి పోతుంది. కుటుంబ సభ్యులు కావలసినవి, రావలసినవి లౌక్యంగా అందుకుంటారు. జాయింట్ వ్యవహారాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యవహార, ఆదాయ స్థితులు అంచనాలకు తగ్గట్టు ఉండకపోవచ్చు. ఆదరాబాదరాగా పనులు చేయకండి. ఇబ్బందులు పడవచ్చు. ఆలోచనలను తగ్గిచుకోండి. దంపతులు సామరస్యం పాటించండి. నిరుద్యోగులకు సానుకూల ఉపాధి లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అధికారుల మన్ననలు అందుకుంటారు.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

ఆర్థిక పుష్టి. ఖర్చుల విషయమై దృష్టి పెట్టండి. తలపెట్టే వ్యవహారాలందు నైపుణ్యం ప్రదర్శిస్తారు. తలనొప్పి, పంటి, కంటి, వొంటి నొప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సౌఖ్యం. సంతాన ప్రాప్తి. విద్య, వైద్య, ప్రయాణ, సాంకేతిక రంగాల వారు సత్ఫలితాలను అందుకుంటారు. స్వీయ పర్యవేక్షణ మేలు. మిత్రులు చేదోడువాదోడుగా ఉంటారు. అవివాహితులు శుభవార్తలు వింటారు. వాహన మరమ్మతులుంటాయి. విలువైన వస్తువులతో ప్రయాణాలందు అప్రమత్తత కలిగి ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. అనుకోని ప్రయాణాలున్నాయి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

ఆదాయ వ్యయాలు తృప్తినిస్తాయి. అనుకున్న పనులు ప్రణాళిక మేరకు పూర్తి చేస్తారు. అన్నింటా సంతృప్తి. వ్యతిరేక భావనలు దరికి రానీయకండి. ప్రయాణాలు చేస్తారు. వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. పరిధిని దాటి వెళ్లకండి. వివాదాలలో తలదూర్చకండి. మంచికిపోతే చెడు ఎదురవుతుందన్నట్లు ఉంటుంది. సేవా కార్యక్రమాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రియల్ ఎస్టేట్, వైద్య రంగాల వారికి మెరుగైన ఫలితాలుంటాయి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

అనుకున్న దానికి వ్యతిరేకంగా కార్యాలు ఆలస్యంగా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయ విధానాలు సమీక్షించుకోవలసి వస్తుంది. ముఖ్యుల సాయంతో పనులు పూర్తవుతాయి. ప్రయాణాలందు జాగ్రత్త అవసరం. ప్రతి విషయంలోనూ స్వీయ పర్యవేక్షణ, వీక్షణ మేలు. పోటీ పరీక్షలు అనుకున్న విధంగా కాకుండా మారవచ్చు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితాలుంటాయి. ఉద్యోగులకు బదిలీలు, అదనపు బాధ్యతలుంటాయి. పనులు పెండింగ్ పెట్టకండి. ఫలవంతమైన పనులు చేస్తారు. ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. అనుమానంతో మెలగకండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

వ్యతిరేక భావనలు వద్దు. బంధువుల పనులు మీరు చేయాల్సి రావచ్చు. అతిగా వర్తించకండి. ఆదాయ వ్యయాలు తృప్తినిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు శ్రమానుకూలంగా పరిశీలనతో మెరుగైన ఫలాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. కలగాపులగంగా అన్నీ ఒకేచోట ఉంచకండి. తర్వాత పనులందు ఇబ్బందులు, తలనొప్పులుంటాయి. కుటుంబానికి కావలసినవి సమకూర్చుకుంటారు. ఆరోగ్యం తృప్తినిస్తుంది. వస్తు విలువలు పెరుగుతాయి. ప్రయాణాలందు మెళకువ అవసరం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
ఆదాయం మెరుగవుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. అన్ని రంగాల వారు అనుకున్న ఫలితాలు పొందుతారు. వినోద, ఆధ్యాత్మిక ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. మీ చాకచక్యంతో కష్టాల్ని ఇష్టంగా, ఇబ్బంది లేనంత వరకు భరించండి. వైషమ్యాలకు అవకాశం ఇవ్వొద్దు. స్పెక్యులేషన్ వాయిదా మేలు. ధన వ్యయం. సర్దుబాట్లు, దిద్దుబాట్లు పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. విద్యార్థులు అనుకున్నవి సాధిస్తారు. నూతన పరిచయ లాభాలు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆర్థిక, వ్యయాలు మెరుగవుతాయి. నిరర్థకమైనవి వదిలించుకునే ప్రయత్నం చేయాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఫలవంతం. పంతాలకు, పట్టింపులకు పోకండి. మిత్రులు ముఖ్యమైన కార్యకలాపాలందు సాయపడతారు. ప్రయాణాలందు అప్రమత్తంగా ఉండండి. ప్రకృతి విపత్తులు ఇబ్బంది పెట్టవచ్చు. ధైర్యంతో ముందుకు సాగండి. కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒంటరిగా ఉన్నవారు వివాహ బంధంతో జంటలవుతారు. విలువైన వస్తువులతో ప్రయాణంలో జాగ్రత్త. స్పెక్యులేషన్ అనుకూలం. వివాదాలకు తావివ్వకండి. ఉద్రేకంతో మాట్లాడకండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

పనులు పూర్తి చేస్తారు. పెండింగ్‌లో వున్న పనులు ఇతరుల సాయంతో, మీ నేర్పుతో పూర్తి చేస్తారు. మిత్రులు, బంధువులు సమయానికి ఆదుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగులు, చేతి వృత్తుల వారు సంబంధిత వారి నుంచి సహాయానికై ఎదురుచూస్తారు. ఆర్థిక వ్యవహారాలందు ఆలోచన మేలు. హామీలు ఇవ్వకండి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కలవరపెడుతుంది. వాతావరణం మీకు ఇబ్బంది కలిగించవచ్చు.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855