అనగనగా

మొలకలు - మల్లాది వేంకట కృష్ణమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూల్ నించి తిరిగి వచ్చిన సంచిత్ తన తండ్రి ఇంటి వెనకాల తోటలో మోకాళ్ళ మీద కూర్చుని ఏదో చేస్తూండటం చూసి అడిగాడు.
‘‘ఏం చేస్తున్నావు నాన్నా?’’
‘‘విత్తనాలు నాటుతున్నాను.’’ ఆయన జవాబు చెప్పాడ.
‘‘ఇవి ఎంతకాలంలో మొలుస్తాయి?’’ అడిగాడు.
పక్కనే ఉన్న బీర, సొర, బెండ మొదలైన బొమ్మలున్న విత్తనాల కవర్లని చూపించి తండి చెప్పాడు.
‘‘వీటి మీదే ఉంది. చదువు. తాజా కూరగాయలు తింటే ఆరోగ్యం.’’
సంచిత్ తండ్రికి పనిలో సహాయం చేసాడు. ఇద్దరూ చేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చారు.
‘‘నువ్వు నీ ఫ్రెండ్ ఇంటికి పుట్టినరోజు పార్టీకి వెళ్ళిస్తానని చెప్పావు. వెళ్ళలేదా?’’ తల్లి అడిగింది.
‘‘లేదు. నువ్వు మాల్‌కి వెళ్తున్నావు కాబట్టి నీతో వద్దామని వచ్చేసాను.’’ సంచిత్ చెప్పాడు.
ఆ మాటలు విన్న తండ్రి చెప్పాడు.
‘‘ఇతరులతో కలిసి గడపడం విత్తనాలు నాటడం లాంటిది.’’
‘‘అంటే?’’ సంచిత్ అడిగాడు.
‘‘స్నేహం అనే మొక్కలు మొలకెత్తడానికి పదిమందిని కలవడానికి అది మంచి అవకాశం. ఒకోసారి కొన్ని విత్తనాలు మొలకెత్తనట్లుగా కొందరితో స్నేహం బలపడదు. కాని కొందరితో అది బలపడి సరైన సమయానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. బంధువులతో, స్నేహితులతో కలిసి గడిపే అవకాశం దొరికితే దాన్ని వదులుకోకూడదు.’’ తండ్రి చెప్పాడు.
సంచిత్ తన మిత్రుడు ఇంటికి వెళ్తానని అనడంతో మాల్‌కి వెళ్ళే తల్లి వాడిని అక్కడ దింపి వెళ్ళింది.
*

మల్లాది వేంకట కృష్ణమూర్తి