బిజినెస్

హెచ్‌పీసీఎల్‌లో భారీ రియాక్టర్ అమరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్)కు చెందిన విశాఖ రిఫైనరీ ఆధునీకరణలో భాగంగా దేశంలోనే అతిపెద్ద పుల్ కన్వర్షన్ హైడ్రోక్రాకర్ యూనిట్(రియాక్టర్)ను మంగళవారం అమర్చారు. యూనివర్సల్ ఆయల్ ప్రొడక్ట్స్ ఇంజనీర్ ఇండియా కంపెనీ సంయుక్తంగా విశాఖ రిఫైనరీలో 3.053 ఎంఎంటిపిఎ సామర్థ్యం కలిగిన ప్రతిష్ఠాత్మకమైన రియాక్టర్ యూనిట్‌ను విజయవంతంగా అమర్చడం పూర్తి చేశారు. హెచ్‌పిసిఎల్‌కు చెందిన విశాఖ రిఫైనరీ ప్రాజెక్ట్ ఆధునీకరణలో భాగంగా రెండు దశల్లో రియాక్టర్స్‌ను నెలకొల్పారు. తొలిదశ కింద 1646 టన్నుల బరువు, గోడ దళసరి 254.5ఎంఎం, 55.6 మీటర్ల పొడువుగల రియాక్టర్‌ను విజయవంతంగా ఏర్పాటుచేసినట్లు హెచ్‌పిసిఎల్ అధికారులు తెలిపారు. రెండవ దశ రియాక్టర్‌ను 454 మిలియన్ టన్నుల బరువు, గోడ దళసరి 184.5ఎంఎం, 28.5 మీటర్ల పొడువు ఉంది. ఇదిలాఉండగా ప్రతిష్ఠాత్మకమైన ఈ రియాక్టర్స్‌ను గుజరాత్‌లోని ఎల్ అండ్ టి షిప్‌యార్డ్‌లో తయారుచేశారు. ఈ ఏడాది మార్చి 22వతేదీన గుజరాత్‌లోని హజీరా నుండి జలమార్గం ద్వారా హిందుస్థాన్ షిప్‌యార్డ్‌కు తీసుకు వచ్చారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు తరలించారు. దేశంలోని ఒకేచోట అతిపెద్ద రియాక్టర్లను నెలకొల్పిన ఘనతను దీంతో విశాఖ హెచ్‌పిసిఎల్ సొంతం చేసుకుంది.

చిత్రం... హెచ్‌పిసిఎల్‌లో రియాక్టర్‌ను అమర్చుతున్న దృశ్యం