ధర్మసందేహాలు

వారు వీరును ఒక్కరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కవి తిక్కన, ఖడ్గ తిక్కన ఒకరేనా?
- శివాజీరావు, హైద్రాబాద్
అనుశ్రుతంగా వచ్చే ఐతిహ్యం ప్రకారం ఖడ్గతిక్కన మనుమ సిద్ధ రాజు యొక్క ఆస్థానంలో సేనాపతులలో ఒక్కడు. కవి తిక్కన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఒక్కడు. వీరిద్దరూ వరుసకు సోదరులని ఒక ప్రతీతి.
* శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేసే సమయంలో భార్యభర్తలు ఇరువురు నార వస్తమ్రులు ధరించినారు కదా? అయితే రావణుడు సీతను ఎత్తుకుపోయే సమయంలో బంగారు ఆభరణాలు విడిచిపెట్టిందని అంటారు కదా? ఇది ఎలా కుదురుతుంది? - కె.వి.ప్రసాదరావు, కందుకూరు
అరణ్యవాసానికి బయలుదేరే ముందు శ్రీరాముడితోపాటు సీతాదేవి కూడా నార చీరలు ధరించటానికి సిద్ధపడగా, దశరథుడు నివారించి, వనవాస నియమం రాముడికే గాని సీతకు కాదనీ, అందువల్ల ఆమె రాజవస్త్రాలు, రాజాభరణాలు ధరించాలని శాసించి, వారు వెళ్ళే రథంలో ఆభరణాలను, వస్త్రాలను పెట్టించాడని వాల్మీకి రామాయణంలో వుంది. అందువల్ల వనవాస సమయంలో సీతాదేవి బంగారు ఆభరణాలను ధరించే వుంది అనటంలో సందేహం లేదు.
* కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకు మూఢ దినాలలో అట్లతదియ మొదలగు నోములు చేయించవచ్చునా?
- కె.కృష్ణకుమారి, గుడివాడ
స్ర్తిల వ్రతాలకు వ్రతకథలో చెప్పిన నియమాలు తప్పితే అంతకుమించిన నియమాలు వుండవు. కనుక వ్ఢ్యౌది దోషాలు ఆ వ్రతాలకు వర్తించవు.
* కొన్ని స్తోత్రాలలో ప్రాతఃకాలంలో పఠించమని, కొన్ని స్తోత్రాలలో త్రికాలములో పఠించమని, కొన్ని సోత్రాలలో దేవాలయాలలో పఠించమని, ఇలాంటి సూచనలను కనిపిస్తున్నాయి. ఈ భేదాలకు కారణమేమిటి? - ఖండాబా, హైద్రాబాదు
ఆ స్తోత్రాలను రచించిన మహర్షులకు ఆయా దేవతల ద్వారా అందిన సూచనలను ఆ మహర్షులు తమ స్తోత్రాలలో మనకు అందిస్తున్నారు. కనుక అవి ఆయా దేవతల ఆజ్ఞలే అని భావించి మనం ఆ ప్రకారంగానే ఆచరించుకోవాలి. అంతేగానీ వాటిని మహర్షులయొక్క అభిప్రాయభేదాలుగా దర్శించరాదు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org