ఆటాపోటీ

ప్రార్థన మరచిపోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాకర్ స్టార్ క్రిస్టియానొ రొనాల్డో మ్యాచ్‌లకు ముందు ప్రత్యేక ప్రార్థనలు చేస్తాడు. పొరపాటున ప్రార్థన మరచిపోయిన ఒకటి రెండు సార్లు మైదానంలో గోల్స్ చేయలేకపోవడంతో అతనికి ఈ నమ్మకం పెరిగిపోయింది. తాను ఎక్కడ ఉంటే అక్కడికే మతాధికారిని పిలిపించుకొని, ప్రార్థనాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాతే అతను మ్యాచ్‌కి సిద్ధమవుతాడు. ప్రపంచ సాకర్ చరిత్రలోనే అత్యధిక సంపాదనగల ఆటగాడిగా రికార్డు సృష్టించిన రొనాల్డో ఎంత సంపాదించాడో అంతకు మించి నమ్మకాల ఊబిలో కూరుకుపోయాడు. ఏదైనా మ్యాచ్‌లో గోల్ చేస్తే, ఆ టోర్నమెంట్ మొత్తం అదే షర్టుతో ఆడతాడు. ఆ షర్టు మురికిపట్టినా, చినుగులు పడినా దానిని మాత్రం వదలడు. మైదానంలోకి కుడికాలు ముందు పెట్టి నవడం అతని మరో నమ్మకం. ఎవరేమనుకున్నా ప్రార్థనలు చేయడమే తన బలమని, ఆ కారణంగానే తాను అంతర్జాతీయ సాకర్ రంగంలో నిలదొక్కుకోగలిగానని అంటాడు రొనాల్డో. నిజమే. ఆ నమ్మకమే అతనిని తిరుగులేని సూపర్ స్టార్‌గా నిలబెట్టింది.

ఇదో నమ్మకం

ప్రపంచ మాజీ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్‌కు ఓ వింత నమ్మకం ఉంది. మ్యాచ్‌లు ఆడే ప్రతిసారీ అతను తన వాటర్ బాటిల్‌ను కుర్చీకి మధ్యగా ఉంచుతాడు. నీళ్లు తాగిన తర్వాత మళ్లీ అదే ప్రదేశంలో ఉంచుతాడు. ఒక్క అంగుళం కూడా అటూ ఇటూ జరగకుండా ప్రతిసారీ ఒకే చోట వాటర్ బాటిల్‌ను ఉంచితే విజయం తనేదనని అతని నమ్మకం. చాలా మంది క్రీడాకారుల్లో ఇలాంటి విశ్వాసాలు ఉంటాయి. అయితే, వాటర్ బాటిల్‌ను అంగుళ మాత్రం కూడా జరగకుండా ఒకే చోట పెట్టడం అనేది చిత్రమే. ఇదేమి విడ్డూరం? అంటూ ఎవరైనా నవ్వినా అతను పట్టించుకోడు. కెరీర్‌లో ఐదుసార్లు ఫ్రెంచ్ ఓపెన్, రెండు సార్లు వింబుల్డన్, ఒక్కోసారి ఆస్ట్రేలియా ఓపెన్, యుఎస్ ఓపెన్ టైటిళ్లను సాధించిన నాదల్ ఖాతాలో ఒలింపిక్ స్వర్ణ పతకం కూడా ఉంది.

ఫెదరర్ ట్రిక్ షాట్

లక్షలాది మంది ఇప్పటికీ రోజర్ ఫెదరర్ కొట్టిన ఒక ‘ట్రిక్ షాట్’ను యూట్యూబ్‌లో విరగబడి చూస్తున్నారు. ఇంతకీ ఆ షాట్‌లో విశేషం ఏమిటో తెలుసా? ఒక కంపెనీ వ్యాపార ప్రకటనలో పాల్గొన్న ఫెదరర్ అద్భుతమైన సర్వీస్ చేశాడు. అతను కొట్టిన బంతి వేగంగా వెళ్లి, స్టాండ్స్‌లో ఉన్న ఓ వ్యక్తి తలపై పెట్టుకున్న క్యాన్‌కు తగిలింది. ఒకసారి కాదు.. వరుసగా రెండు సార్లు ఫెదరర్ ఆ క్యాన్‌కు గురి చూసి సర్వ్ చేయడం, అది కిందపడడం జరిగింది. ఇది ట్రిక్ షాటా? కాదా? అన్నది ప్రశ్న. ఫెదరర్‌ను విలేఖరులు స్వయంగా అడిగినా అతను నేరుగా సమాధానం చెప్పలేదు. మ్యాజిక్ ఎలా చేస్తారో ఒక మెజిషియన్ చెప్తాడా? అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. ఫెదరర్ షాట్ అతని ప్రతిభకు నిదర్శనమైనా లేక వీడియో మాయాజాలమైనా.. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ఆకట్టుకుంటున్నదనే విషయం మాత్రం వాస్తవం. ఈ షాట్ నిజమా కాదా అని ఆలోచించేకంటే దానిని చూసి ఆనందించడమే మేలు.

- సత్య