ఆటాపోటీ

అజేయ జట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియాను ‘అజేయ జట్టు’గా పేర్కొంటారు. 1948లో ఆస్ట్రేలియాకు ఆ పేరు వచ్చింది. క్రమంగా అదే స్థిరపడింది. అప్పట్లో డొనాల్డ్ బ్రాడ్‌మన్ నాయకత్వంలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌ని కూడా కోల్పోలేదు. దీంతో అప్పటి జట్టులోని ఆటగాళ్లను ‘అజేయులు’ అని పిలిచేవారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ జట్టులోని క్రికెటర్లను ‘స్పోర్టింగ్ లెజెండ్స్’గా అభివర్ణించింది. ఆ టూర్‌లో ఐదు టెస్టులు సహా ఆస్ట్రేలియా మొత్తం 31 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడింది. మరో మూడు ప్రాక్టీస్ మ్యాచ్‌లు, రెండు అనధికార ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో పాల్గొంది. 144 రోజుల బిజీ షెడ్యూల్‌లో 112 రోజులు ఏదో ఒక మ్యాచ్‌లో గడపడం విశేషం. సుమారుగా, ఆదివారాలు తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ ఆస్ట్రేలియా మ్యాచ్‌లు ఆడింది. మొత్తం మీద 25 మ్యాచ్‌లు గెల్చుకుంది. తొమ్మిది డ్రాగా ముగిశాయి. టెస్టు సిరీస్‌ను 4-0 తేడాతో సొంతం చేసుకుంది. ఒక టెస్టు డ్రా అయింది. డొనాల్డ్ బ్రాడ్‌మన్, ఆర్థర్ మోరిస్, లిండ్సే హాసెట్, నీల్ హార్వే, సిడ్ బర్నెస్ వంటి హేమాహేమీ బ్యాట్స్‌మెన్ ఆ జట్టులో ఆడారు. బౌలింగ్ విభాగానికి వస్తే రే లిండ్‌వాల్, కీత్ మిల్లర్, బిల్ జాన్సన్ అద్వితీయ ప్రతిభ కనబరిచారు. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న ఆ జట్టుకు ఇంగ్లాండ్ జట్టు స్వదేశంలోనే గట్టిపోటీని ఇవ్వలేకపోయింది. అందుకే అప్పటి ఆసీస్‌ను ‘అజేయ జట్టు’గా పేర్కొన్నారు. ఇప్పుడు నాసిరకమైన జట్టుగా అభివర్ణించాల్సి ఉంటుంది.
‘బాడీలైన్’తో దాడి
ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోవడం, ఓడించడం అసాధ్యంగా మారిన కాలమది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆస్ట్రేలియాను కట్టడి చేయడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. ప్రత్యేకించి డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను విజృంభణకు అడ్డుకట్ట వేయకపోతే, ఆసీస్‌కు తిరుగులేదని అప్పటికే అందరికీ తెలిసిపోయింది. ప్రత్యేకించి చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‌కు ఈ విషయం ఆందోళన కలిగించింది. అందుకే 1932-33 సీజన్‌లో బ్రాడ్‌మన్‌సహా ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను నిలువరించేందుకు ఇంగ్లాండ్ ‘బాడీలైన్’ వ్యూహాన్ని అనుసరించింది. అప్పటి కెప్టెన్ జగ్లస్ జార్డిన్ ఆదేశంతో ఇంగ్లాండ్ బౌలర్లు వికెట్లపైగాక, బ్యాట్స్‌మెన్‌ను లక్ష్యంగా బంతులు వేశారు. హరాల్డ్ లార్‌వుడ్ వేసిన బంతులకు బిల్ ఉడ్‌ఫుల్ పక్కటెముకలు విరిగిపోయాయి. బెర్ట్ ఓల్డ్ఫీల్డ్ తల పగిలింది. పుర్రె చిట్లిందంటే బంతి ఎంత బలంగా తగిలిందో ఊహించుకోవచ్చు. హెల్మెట్, సైడ్ ప్యాడ్స్ వంటి అదనపు ప్రొటెక్టివ్ గార్డ్స్ (రక్షణ పరికరాలు) లేని రోజుల్లో, దెబ్బలకు ఒళ్లు హూనమయ్యేది. అందులోనూ ఉద్దేశపూర్వకంగా గాయపడేలా బంతులు వేస్తే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహించుకోవచ్చు. తర్వాతి కాలంలో ‘బాడీలైన్’ వ్యూహాన్ని ఐసిసి నిషేధించినప్పటికీ, నేటికీ పేసర్లు సంధించే బౌన్సర్లు బ్యాట్స్‌మెన్‌ను గాయపరుస్తున్నాయి. కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.