ఆటాపోటీ

బ్రాడ్లేతో చివరి ఫైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలిప్పీన్స్ బాక్సింగ్ సూపర్ స్టార్ మానీ పాక్వియానో ఈ ఏడాది ఏప్రిల్‌లో రిటైర్ కానున్నాడు. రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరించడానికి వీలుగా బాక్సింగ్ కెరీర్‌ను ముగిస్తానని అతను స్థానిక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఏప్రిల్ 9న తిమోడీ బ్రాడ్లేతో జరిగే ఫైట్ తన కెరీర్‌లోచివరిదని చెప్పాడు. చిరకాల ప్రత్యర్థి ఫ్లాయిడ్ మేవెదర్‌తో రీ మ్యాచ్ తర్వాతే రిటైర్ అవుతానని పాక్వియానో చెప్పినట్టు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. గత ఏడాది మే మాసంలో జరిగిన ఫైట్‌లో పాక్వియానోపై మేవెదర్ గెలిచాడు. బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు సృష్టించిన ఈ ఫైట్ ఫలితాన్ని ముందుగానే నిర్ణయించారని, పాక్వియావో ఉద్దేశపూర్వకంగానే ఎలాంటి పోటీనివ్వకుండా ఓటమిని ఆహ్వానించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. తాము టికెట్ కోసం వెచ్చించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ప్రేక్షకులు ప్రదర్శనలు కూడా చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో మేవెదర్‌తో రీ మ్యాచ్‌కి పాక్వియావో సిద్ధమయ్యాడన్న వార్తలు వచ్చాయి. కానీ, 37 ఏళ్ల పాక్వియావో ఈ వార్తలను ఖండించాడు. తనను ఎవరూ ఇంటర్వ్యూ చేయలేదని, మేవెదర్‌తో రీ మ్యాచ్ తర్వాత రిటైర్ అవుతానని ఎవరికీ చెప్పలేదని అన్నాడు. పార్లమెంటు సభ్యుడిగా తనపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయని, పూర్తికాలం రాజకీయాలకు కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చానని కెరీర్‌లో 38 నాటౌట్స్‌సహా మొత్తం 57 ఫైట్స్‌లో విజయాలను నమోదు చేసిన పాక్వియావో అన్నాడు. 20 ఏళ్ల కెరీర్‌లో అతను కేవలం ఆరు ఫైట్స్‌లో పరాజయాలను ఎదుర్కోగా, రెండు ఫైట్స్‌లో ఫలితం వెలువడలేదు. సెనేట్ సభ్యుడిగా ఎన్నిక కావడం, భవిష్యత్తులో ఫిలిప్పీన్స్ అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఒక మార్గంగా చెప్తారు. సెనేట్ సభ్యుల నుంచే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఎన్నికకావడం ఆనవాయితీగా వస్తోంది. భవిష్యత్తులో అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న పాక్వియావో 12 మంది సభ్యుల జాబితాలో ఏడో స్థానాన్ని ఆక్రమించాడు. ప్రచారం ప్రారంభమైన తర్వాత అతను రేసులో ముందుకు దూసుకెళతాడని పరిశీలకులు అంటున్నారు. పేద కుటుంబంలో పుట్టిన పాక్వియావో చేపలు అమ్మి జీవితాన్ని గడిపాడు. అయితే, బాక్సింగ్ పట్ల ఉన్న ఆసక్తి అతనిని ప్రొఫెషనల్ కెరీర్‌వైపు తీసుకెళ్లింది. ఫిలిప్పీన్స్‌కు బాక్సింగ్ ప్రపంచంలో గుర్తింపును సంపాదించిపెట్టిన అతనిని భవిష్యత్ దేశాధ్యక్షుడిగా చాలా మంది అభివర్ణిస్తున్నారు.