ఆటాపోటీ

టెస్టు క్రికెట్‌కు కొత్త సొబగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతూ, కొడిగట్టిన దీపంలా మారిన టెస్టు క్రికెట్‌కు కొత్త రూపాన్ని ఇవ్వడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రయత్నిస్తున్నది. 2020 సంవత్సరం నాటికి టెస్టులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నది. అకానేకానేక మార్పులతో కొత్త సొబగులతో ముస్తాబు చేస్తున్నది. కానీ, ఈ ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుందా అన్నదే అనుమానం. 139 సంవత్సరాల చరిత్ర గల టెస్టు క్రికెట్ ఆదరణ కోల్పోవడం సుమారు మూడు దశాబ్దాల క్రితమే మొదలైంది. వనే్డ, టి-20 ఫార్మాట్స్ విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో టెస్టులకు వచ్చే వారి సంఖ్య తగ్గుతూ వస్తున్నది. ‘జంటిల్మన్ గేమ్’గా పిలిచే అసలుసిసలైన క్రికెట్‌ను, ప్రత్యేకించి కళాత్మక ఆటను చూసేందుకు వచ్చే నిజమైన అభిమానులు తప్ప స్టేడియాలకు ఎవరూ రావడం లేదన్నది వాస్తవం. టెస్టు మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు స్టేడియాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయనిగానీ, ఎవరూ అటు వైపు కనె్నత్తి కూడా చూడడం లేదనిగానీ అనుకోవడానికి వీల్లేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్స్ స్థాయిలో స్పందన లేకపోయినా, హాజరీ తక్కువగా ఉన్నా, స్టేడియాలు అసలు జనాలే లేక బోసిపోతున్న పరిస్థితులు మాత్రం ఎక్కడా లేవు. టెస్టులకు కూడా అభిమానులు వస్తున్నారు. కానీ, వారిలో తొంభై శాతం మంది టెస్టు క్రికెట్‌లోని కళాత్మక విలువలను తిలకించడానికి కాకుండా, తమతమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఎగబడుతున్నారన్న నిజం ఆందోళన కలిగిస్తున్నది. కారణాలు ఏవైతేనేం.. టెస్టులకు ప్రేక్షకులు వస్తున్నారుకదా అంటూ సమస్యను తేలిగ్గా కొట్టేయడానికి వీల్లేదు. వ్యక్తి పూజ ఎక్కువ కాలం ఉండదు. టెస్టు క్రికెట్‌ను అభిమానించి, ఆ ఫార్మాట్‌లో మ్యాచ్‌లను తిలకించి ఆనందించడానికి స్టేడియాలకు పరుగులు పెట్టాలే తప్ప కేవలం తమ అభిమాన స్టార్ల కోసం కాకూడదన్నది ఐసిసి అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే, టెస్టు క్రికెట్‌కు నూకలు చెల్లుతాయని భయపడుపడుతున్నది. అందుకే, ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్నది. భారత్ నుంచి వ్యతిరేకత ఎదురుకాకపోతే, ఇప్పటికే సర్వసభ్య సమావేశంలో మార్పులకు ఆమోద ముద్ర పడేది. కానీ, ధన బలంతో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పదేపదే అడ్డు తగలడంతో టెస్టు క్రికెట్‌కు కొత్త రూపాన్నిచ్చేందుకు ఐసిసి చేస్తున్న ప్రయత్నాలు వేగవంతమైన ఫలితాలను ఇవ్వడం లేదు. అయితే, పరిస్థితి పూర్తిగా చేయిదాటలేదని, 2019 నుంచి ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్‌లో కొత్త విధానాలు చోటు చేసుకుంటాయని, అదే విధంగా టెస్టు క్రికెట్ రెండు స్థాయిల్లో జరుగుతుందని ఐసిసి నమ్మకంతో ఉంది. టెస్టు హోదాను ఎక్కువ దేశాలకు ఇవ్వాలన్నది ఐసిసి ఆలోచన. అంతేగాక, ఇప్పుడు హోదా ఉన్నప్పటికీ, పెద్ద జట్లకు ఏ విధంగానూ సరితూగని కొన్ని జట్లకు చెక్ పెట్టాలని కూడా ఐసిసి భావిస్తున్నది. అందుకే, టెస్టు హోదా ఉన్న మొత్తం పది దేశాల్లో కేవలం ఏడు దేశాలను మాత్రమే మొదటి డివిజన్‌లోకి చేర్చాలని అనుకుంటున్నది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి ఏడు స్థానాల్లో ఉన్న జట్లు ఈ డివిజన్‌లో ఉంటాయి. మిగతా మూడు జట్లు రెండో డివిజన్‌లో పోటీపడతాయి. ఇది మంచి పరిణామమే.
ఒక రకంగా చెప్పాలంటే, ఆస్ట్రేలియా, భారత్ వంటి జట్లతో జింబాబ్వే, వెస్టిండీస్ లాంటి బలహీనమైన జట్లు టెస్టు సిరీస్‌లు ఆడే అవకాశాలు ఉండవు. ఫస్ట్ డివిజన్‌లో చోటు దక్కించుకునేందుకు ప్రతి జట్టూ శక్తివంచన లేకుండా పోరాడుతుంది కాబట్టి, టెస్టులు పోటాపోటీగా జరుగుతాయని ఐసిసి ఆశాభావంతో ఉంది. అయితే, ఈ ప్రతిపాదనను భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు వ్యతిరేకిస్తున్నాయి. టెస్టు హోదా స్థిరంగా లేకపోతే, ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని, ఫలితంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని బిసిసిఐ వాదిస్తున్నది. నిన్నమొన్నటి వరకూ అంపైర్స్ డిసిషన్ రివ్యూ విధానం (డిఆర్‌ఎస్)ను వ్యతిరేకించిన బిసిసిఐ ఇప్పుడు టెస్టులకు కొత్త రూపాన్ని ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా అడ్డుకోవడం ఐసిసికి ఆగ్రహం తెప్పిస్తున్నది. అందుకే, భారత్‌తో అటోఇటో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నది. ఈ యుద్ధం ఏ పర్యవ సానాలను తెచ్చిపెడుతుందో?
బిసిసిఐపై కోపంతోనే!
బిసిసిఐపై కోపంతోనే ఐసిసి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నదని, టెస్టులకు కొత్త రూపాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఇప్పుడు ఐసిసికు చైర్మన్. అతను దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయగల మరాఠా యోధుడు శరద్ పవార్ దగ్గరి బంధువు. అంతేగాక, అతని అనుంగు శిష్యుడు. బోర్డు ప్రస్తుత అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కరడుగట్టిన సంఘ పరివార్ సభ్యుడు. బిజెపి తరఫున పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. బిసిసిఐపై ఆధిపత్యం కోసం వీరిద్దరూ చాలాసార్లు, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పోటీపడ్డారు. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అత్యున్నత సంస్థకు మనోహర్ చైర్మన్‌గా ఉన్నాడు. ప్రపంచ క్రికెట్‌ను తన ధన బలంతో శాసిస్తున్న బిసిసిఐ అధ్యక్షుడి హోదాలో అనురాగ్ ఠాకూర్ అతనితో యుద్ధానికి కాలుదువ్వుతున్నాడు. వీరి వ్యక్తిగత స్పర్థలే చివరికి ఐసిసి, బిసిసిఐ మధ్య పోరాటంగా మారిందన్న విమర్శలున్నాయి. భారత మహిళల జట్టుపై ఐసిసి తీవ్రంగా స్పందించడానికి, పాయింట్లు కోత పెట్టడానికి కూడా ఇదే కారణమన్న వాదన ఉంది. ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి అక్టోబర్ 31 మధ్య కాలంలో పాకిస్తాన్‌తో ఐసిసి మహిళల ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండింది. అయితే, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌లకు భారత్ నిరాకరించింది. దీనితో ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఒక్క పరుగు కూడా చేయలేదన్న రీతిలో గణాంకాలను సవరించిన ఐసిసి, ఒక్కో విజయానికి రెండు చొప్పున మొత్తం ఆరు పాయింట్లను పాక్ జట్టుకు ధారాదత్తం చేసింది. స్థూలంగా చూస్తే, ఇదంతా క్రికెట్ సిరీస్‌లు, ముందుగా ఖరారైన షెడ్యూల్, దానికి అనుగుణంగా మ్యాచ్‌లు జరగాల్సిన అవసరం, లేకపోతే ఇదే పరిస్థితి కొనసాగకుండా ఐసిసి జాగ్రత్త పడడం వంటి అంశాలు కనిపిస్తాయి. కానీ, లోతుగా పరిశీలిస్తే, మనోహర్, ఠాకూర్ మధ్య నెలకొన్న విభేదాలే కారణమని తెలుస్తుంది. మొదటి నుంచి ఐసిసిని బిసిసిఐ ఎన్నడూ గౌరవించలేదు. అత్యున్నత సంస్థగా భావించలేదు. ఐసిసి చేసే ప్రతి ప్రతిపాదనను కాదనడం బిసిసిఐకి అలవాటుగా మారింది. ఏ నిర్ణయం కూడా సక్రమంగా అమలు కాకుండా అడ్డుకుంటునే ఉంది. టెస్టు క్రికెట్‌కు కొత్త రూపాన్నిచ్చే విషయంలోనూ బిసిసిఐ నుంచి ఐసిసికి వ్యతిరేక తప్పడం లేదు. చాలా మంది మాజీ క్రికెటర్లతోపాటు లక్షలాది మంది అభిమానులు కూడా టెస్టు క్రికెట్‌ను బతికించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఐసిసి చేస్తున్న మార్పులను స్వాగతిస్తున్నారు. కానీ, బిసిసిఐ మాత్రం ససేమిరా అంటున్నది. ధైర్యం చేసి, భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టిన ఐసిసి వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే సమావేశంలో టెస్టుకు కొత్త రూపాన్ని ఇస్తుందో లేక బిసిసిఐ ఆధిపత్యానికి తలవంచి మరోసారి ఈ ప్రతిపాదనను వాయిదా వేస్తుందో చూడాలి. - ఎస్‌ఎంఎస్