ఆటాపోటీ

రూనీ ఎదురీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్, ఇంగ్లాండ్ సాకర్ సూపర్ స్టార్ వేన్ రూనీ కెరీర్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి. కొంతకాలంగా ఫామ్‌లో లేని అతను తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్ చివరిలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినా, యూరోపియన్ లీగ్‌లో ఫెయెనూర్డ్‌పై అద్భుతమైన గోల్ సాధించినా, అతనిని ఎవరూ ప్రశ్నించడం లేదు. మాంచెస్టర్ యునైటెడ్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన కెప్టెన్‌గా ఇప్పటికే అతను రికార్డు నెలకొల్పాడు. ఆ క్లబ్ తరఫున అన్ని స్థాయి పోటీల్లో ఆల్‌టైమ్ రికార్డు బాబీ చార్ల్‌టన్ పేరుమీద ఉంది. అతను 249 గోల్స్ చేశాడు. రూనీ 248 గోల్స్‌తో అతనికి గట్టిపోటీనిస్తున్నాడు. ఏ క్షణంలోనైనా కార్ల్‌స్టెన్ రికార్డును సమం చేయడం లేదా అధిగమించడం ఖాయం. కార్ల్‌స్టెన్ 1973లో కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. సుమారు నాలుగు దశాబ్దాలుగా మాంచెస్టర్ యునైటెడ్‌కు అతని స్థాయిలో ఆడే సత్తావున్న ఆటగాళ్లు ఎవరూ లభించలేదు. రూనీ మాంచెస్టర్ యునైటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకొని, అడుగుపెట్టిన మరుక్షణమే జట్టు జాతకం మారిపోయింది. అరుదైన విజయాలను ఆ జట్టు అవలీలగా అందుకోవడం ప్రారంభమైంది. యూరోపియన్ సాకర్‌లో బలమైన జట్లలో ఒకటిగా ఎదిగింది. ఇంత అద్భుత స్థాయిలో సేవలు అందిస్తున్నప్పటికీ రూనీపై అభిమానుల్లో వ్యతిరేకత ఎందుకు వ్యక్తమవుతున్నదన్న ప్రశ్న ఉదయిస్తోంది. అయితే, దీనికి కారణం లేకపోలేదు. క్లబ్ మ్యాచ్‌లో అద్వితీయ ప్రతిభ కనబరచే రూనీ ఇంగ్లాండ్ జాతీయ జట్టు తరఫున ఆడే మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఇంగ్లాండ్‌కు చిరస్మరణీయ విజయాలను అందించలేకపోతున్నాడు. భారీ మొత్తాలను తీసుకుంటూ క్లబ్ సుకర్‌కే తన సేవలను పరిమితం చేస్తున్నాడని, జాతీయ జట్టుకు న్యాయం చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు అభిమానుల్లో రూనీపై భారీ అంచనాలు ఉన్నాయి. అతను మైదానంలోకి దిగిన మరుక్షణం నుంచే ప్రత్యర్థి జట్టు గోల్ పోస్టుపై దాడులకు ఉపక్రమించాలని, గోల్స్ వరద పారించాలని వారు కోరుకుంటారు. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా సహించలేరు. రూనీ మీద ఉన్న ఇష్టంతోనే అతను ఎన్నిసార్లు విదాదాల్లో చిక్కుకున్నా సహించారు. క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రదర్శించినా భరించారు. కానీ, ఫామ్‌ను కోల్పోయి, ఒక సామాన్య ఆటగాడిగా మిగిలిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
స్వయంకృతం
రూనీ ప్రస్తుత పరిస్థితికి అతని స్వయంకృతమే ప్రధాన కారణం. ఎంతటి ప్రతిభావంతుడైనా, నిత్యం వివాదాలకు కారణమవుతుంటే అభిమానుల్లో అసహనం పెరిగిపోతుంది. రూనీ ఎంతటి సమర్థుడో అంతకంటే ఎక్కువ వివాదాస్పదుడు. క్రమశిక్షణ అనేది అతనికి తెలియదు. ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నప్పుడు మరింత నిర్లక్ష్యంగా ఉంటాడు. ఒక టోర్నీ లేదా సిరీస్ జరుగుతున్నప్పుడు ఆటగాళ్లు ఎవరూ లేట్‌నైట్ పార్టీలకు వెళ్లరు. అలా వెళ్లరాదని నిబంధనలు కూడా స్పష్టం చేస్తున్నాయి. కానీ, రూనీకి ఈ నిబంధన అసలే పట్టదు. ఫెయెనూర్డ్‌తో మ్యాచ్‌కి ముందు అతను లేట్‌నైట్ పార్టీకి వెళ్లి, అక్కడ పీకలదాకా తాగడం, తూలడం, అమ్మాయిలతో కలిసి డాన్స్ చేయడం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. వీడియో క్లిప్పింగ్స్, ఫొటోలు రూనీ అరాచకత్వాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. ఇలాంటి చేష్టలతోనే అతను నిత్యం విమర్శలకు గురవుతున్నాడు. చివరికి అభిమానులు సైతం అతని వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీస విలువలు కూడా పాటించకుండా, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టే రూనీ వీరాభిమానులు సైతం ఇప్పుడు అతనంటే పెదవి విరుస్తున్నారు. స్వయంకృతంతో సమస్యల ఊబిలో కూరుకుపోయిన రూనీ తన తీరుమార్చుకొని బయటపడతాడో లేక అదే ధోరణిని కొనసాగించి మరిన్ని ఛీత్కారాలను ఎదుర్కొంటాడో చూడాలి.