ఆటాపోటీ

అచ్చొచ్చిన ఓపెనింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకేష్ రాహుల్‌కు మిడిల్ ఆర్డర్ కంటే ఓపెనింగ్ స్లాటే అచ్చొచ్చింది. 2014లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అతను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి విఫలమయ్యాడు. 2015లో ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ప్రారంభించి, ఈ స్థానంలో తన తొలి ప్రయత్నంలోనే సెంచరీ నమోదు చేశాడు. 2016 జూన్ 11న జింబాబ్వేతో హరారేతో జరిగిన మ్యాచ్‌తో వనే్డల్లోకి అడుగుపెట్టిన అతను ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి శతకం సాధించాడు. ఈ విధంగా టెస్టు, వనే్డల్లో ఓపెనర్‌గా దిగిన మొదటి మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా అతని పేరు రికార్డు పుస్తకాల్లోకి చేరింది.