ఆటాపోటీ

జ్ఞానోదయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్‌కు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు డానీ డ్రింక్‌వాటర్‌కు ఆలస్యంగా జ్ఞానోదయమైంది. ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుందో లేదో చెప్పలేంగానీ, పొరపాటు నిర్ణయం ఒక కెరీర్‌ను నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తుందన్న వాస్తవం తెలిసిందంటూ ఇప్పుడు వాపోతున్నాడు. 1998లో ఇంగ్లాండ్ 3బి2 జట్టులో ఆడే అవకాశం వచ్చినప్పుడు, ఏదో ఒక పెద్ద క్లబ్ తనను పిలిచి మరీ కాంట్రాక్టు ఇస్తారన్న నమ్మకంతో దానిని తిరస్కరించాడు. మేజర్ క్లబ్‌లు పిలవలేదు. ఇంగ్లాండ్ జాతీయ జట్టులో ఆడే అవకాశం శాశ్వతంగా చేజారింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో 24 ఏళ్లకే కెరీర్‌ను ముగించి, చిన్నాచితకా క్లబ్‌లకు కోచ్‌గా కాలం గడుపుతున్నాడు. ఇంగ్లాండ్ 3బి2 జట్టులో ఆడి ఉంటే, జాతీయ జట్టుకు ఎంపికయ్యే వాడినిగానీ, చేతులారా ఆ అవకాశాన్ని కోల్పోయామని డ్రింక్‌వాటర్ తెగ బాధపడిపోతున్నాడు.