ఆటాపోటీ

మురళీధరన్ ‘శతకం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పిన స్టార్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ భారత్‌పై కూడా అద్భుతంగా రాణించాడు. ఇరు జట్ల బౌలర్లలో వందకుపైగా వికెట్లు సాధించిన ఏకైక బౌలర్‌గా గుర్తింపు సంపాదించాడు. భారత్‌తో 22 మ్యాచ్‌లు ఆడిన అతను 105 వికెట్లు సాధించాడు. అనిల్ కుంబ్లే 74, హర్భజన్ సింగ్ 53 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా, ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్ల రికార్డు కూడా అతని పేరుమీదే ఉంది. 2001 కొలంబో టెస్టులో అతను 34.1 ఓవర్లు బౌల్ చేసి, 87 పరుగులకు ఎనిమిది వికెట్లు కూల్చాడు. రంగన హెరాత్, మనీందర్ సింగ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ ఒక ఇన్నింగ్స్‌లో ఏడేసి వికెట్లు పడగొట్టగా, మురళీధరన్ కూడా ఏడు వికెట్ల వీరుల్లో ఒకడిగా ఉన్నాడు. ఇక ఒక టెస్టు మ్యాచ్‌లో వెంకటపతి రాజు, అనిల్ కుంబ్లే తలా 11 చొప్పున వికెట్లు పడగొట్టాడు. మురళీధరన్ రెండు సార్లు ఈ ఫీట్‌ను సాధించాడు.