ఆటాపోటీ

చేజారిన స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్‌లో జరిగిన 1960 ఒలింపిక్స్‌లో అమెరికా లాంగ్ జంపర్ మెయర్ ప్రిన్స్‌స్టన్‌ను రన్నరప్‌గా ప్రకటించారు. ఇందులో వింత లేకపోయినా, అతను ఫైనల్ జంప్ చేయకుండానే పతకం అందుకోవడం విశేషమే. సిరాకస్ యూనివర్శిటీలో చదువుతున్న అతను క్వాలిఫయింగ్ జంప్స్‌ను సమర్థంగా పూర్తి చేశాడు. అయితే, ఫైనల్ జంప్‌ను ఆదివారం నిర్వహించారు. క్రైస్తవ మత విశ్వాసాలను అనుసరించి ఆదివారం విశ్రాంతికే కేటాయించాలి కాబట్టి, ఫైనల్ జంప్‌లో పాల్గొనరాదని వర్శిటీ అధికారులు అతనిని ఆదేశించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రిన్స్‌న్టన్ ఫైనల్ జంప్ చేయలేదు. అయితే, అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా అతనికి రజత పతకాన్ని అందచేశారు. అత్త మీద కోపం దుత్తమీద చూపిన చందంగా యూనివర్శిటీ అధికారులపై ఆగ్రహాన్ని లాంగ్ జంప్‌లో స్వర్ణ పతకం సాధించిన అథ్లెట్‌పై దాడి చేసి మరీ ప్రదర్శించుకున్నాడు ప్రిన్స్‌స్టన్. తుది జంప్‌లోనూ పాల్గొంటే స్వర్ణం తనకే దక్కేదని, వర్శిటీ అధికారుల ఆదేశం వల్ల అది చేజారిందనీ అతని వాదన.