ఆటాపోటీ

జెర్సీలకూ రిటైర్మెంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెటర్లకే కాదు.. వాళ్లు వేసుకున్న జెర్సీలకూ రిటైర్మెంట్ ఉంటుంది. లెజెండరీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ గౌరవార్థం టీమిండియాలో అతను వేసుకున్న ‘నంబర్ 10’ జెర్సీని రద్దు చేయాలని, ఇకపై ఎవరికీ దానిని కేటాయించరాదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) చేసిన సూచన జెర్సీలకూ రిటైర్మెంట్ తప్పదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నది. దేశవాళీ క్రికెట్‌లో ఒక మ్యాచ్ ఆడుతూ ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ వేసిన బంతి మెరుపువేగంతో దూసుకొచ్చి, మెడకు బలంగా తగలడంతో గాయపడి, ఆ తర్వాత మృతిచెందిన ఫిల్ హూస్ జెర్సీని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇదే తరహాలో రద్దు చేసింది. హూస్ మృతితో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఆ యువ క్రికెటర్‌కు నివాళులర్పిస్తూ, అతని జెర్సీ నంబర్ 64కు సీఏ రిటైర్మెంట్ ప్రకటించింది. భవిష్యత్తులో ఆ జెర్సీని ఎవరికీ కేటాయించరు. అదే రీతిలో సచిన్ వేసుకునే 10వ నంబర్ జెర్సీకి కూడా త్వరలోనే అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ కోణంలో ఆలోచిస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చాలామంది క్రికెటర్ల జెర్సీలకు రద్దు ఇప్పుడుగానీ, భవిష్యత్తులోగానీ రిటైర్మెంట్ ప్రకటించక తప్పదు.
తమ తమ దేశాల్లో క్రికెట్‌కు ప్రత్యేక గుర్తింపు సంపాదించి లేదా తమ శక్తిసామర్థ్యాలతో చిరస్మరణీయ విజయాలను అందించడం ద్వారా యువతకు స్ఫూర్తిగా నిలిచిన, నిలుస్తున్న ఆటగాళ్ల జెర్సీలకు రిటైర్మెంట్ ప్రకటిస్తే, మన దేశం తరఫున సచిన్ తర్వాత ఆ జాబితాలో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేరతాడు. 29 ఏళ్ల కోహ్లీ అండర్-19 స్థాయి నుంచి భారత క్రికెట్‌లో కీలకభూమిక పోషిస్తున్నాడు. అతని జెర్సీ నంబర్ 18. అతను ఈ అంకెను ఎంచుకోవడానికి బలమైన కారణమే ఉంది. 2006 డిసెంబర్ 18న అతని తండ్రి ప్రేమ్ కోహ్లీ మృతి చెందాడు. తండ్రి పట్ల అభిమానంతోనే కోహ్లీ 18వ నంబర్‌ను ఎంపిక చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మరుక్షణం నుంచే అతను భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. సచిన్ తెండూల్కర్‌తో పోటీపడుతూ అతను ఇప్పటికే వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 32 శతకాలు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు నమోదు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో అతను సచిన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. మైదానంలో దూడుకుడుగా ఉంటూ, టీమిండియాకు స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందిస్తున్న అతను సహజంగానే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. భారత్‌కు తిరుగులేని విజయాలను అందిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ పోరాట యోధుడుగా పేరు సంపాదించాడు కాబట్టి, అతని జెర్సీ నంబర్ 18ను భవిష్యత్తులో ఎవరికీ కేటాయించకుండా ఉంటేనే బాగుంటుంది. వనే్డ, టి-20 వరల్డ్ కప్ టోర్నీలతోపాటు ఐసిసి చాంపియన్‌షిప్‌ను కూడా సాధించిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కిన భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ దేశ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. 2004లో మొట్టమొదటిసారి అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టినప్పుడు అతను 7వ నంబర్‌ను ఎంచుకున్నాడు. అతను జూలై 7న జన్మించాడు. అందుకే ఆ అంకెపై మక్కువ చూపాడని అంటారు. దీనితోపాటు, అతనికి ఎంతో ఇష్టమైన మాంచెస్టర్ యునైటెడ్ సాకర్ క్లబ్‌లో అదే నంబర్ జెర్సీ వేసుకున్న ఆటగాళ్లు అద్భుతంగా రాణించడం కూడా ధోనీ అదే నంబర్‌ను అడగాడికి కారణం.
అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కనీసం కొంతమంది పేర్లను ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. శ్రీలంకకు విశేష సేవలు అందించిన కుమార సంగక్కర వేసుకునే 11వ నంబర్ జెర్సీని కూడా అక్కడి క్రికెట్ బోర్డు రద్దు చేయాల్సిందే. సంఖ్యా శాస్త్రాన్ని అనుసరించి 11వ అంకెను జ్ఞానానికి ప్రతీకగా పేర్కొంటారు. లంక బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేసిన సంగక్కరను అజాత శత్రువుగా క్రికెట్ ప్రపంచం అభివర్ణిస్తుంది. ప్రపంచ మేటి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని, పరుగుల వరద సృష్టించడం సంగక్కర ప్రతిభకు నిదర్శనం. లంక క్రికెటర్లలో ఎవరిదైన జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలంటే, ఆ జాబితాలో సంగక్కర వేసుకున్న 11వ నంబర్‌ది అగ్రస్థానం.
ఆస్ట్రేలియా క్రికెట్‌లో సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ వంటి ఎంతోమంది మేటి క్రికెటర్లు ఉన్నారు. అయితే, వారి జెర్సీ నంబర్లను ఇప్పటికే చాలామందికి కేటాయించారు. ఇంకా ఎవరికీ ఇవ్వని జెర్సీ నంబర్ 14. మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వేసుకున్న జెర్సీ అది. 17 ఏళ్ల వనే్డ కెరీర్‌లో పాంటింగ్ చేరుకోని శిఖరాలు లేవు. ఒక రకంగా ఆస్ట్రేలియా క్రికెట్‌కు అతను మారుపేరయ్యాడు. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ఇప్పటివరకూ ఆస్ట్రేలియా అదేస్థాయిలో నిలకడగా రాణించలేకపోతున్నది. అతని నుంచి పగ్గాలు తీసుకున్న మైఖేల్ క్లార్క్‌గానీ, ప్రస్తుత కెప్టెన్ స్టీవ్ స్మిత్‌గానీ పాంటింగ్ స్థాయిలో ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలవలేకపోతున్నారు. అందుకే, ఆస్ట్రేలియా విషయానికి వస్తే, ముందుగా పాంటింగ్ వేసుకున్న 14వ నంబర్ జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించారు.
దక్షిణాఫ్రికా క్రికెటర్లలో ఏబీ డివిలియర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ దేశ మేటి క్రికెటర్ల జాబితాలో అతనికి అగ్రస్థానం దక్కకపోయినా, ముందు వరుసలో ఉంటాడన్నది వాస్తవం. 2004లో వనే్డ ఇంటర్నేషనల్స్‌లోకి అడుగుపెట్టిన అతను 17వ నంబర్ జెర్సీతో రాణిస్తున్నాడు. దక్షిణాఫ్రికా జట్టుకు ఎనలేని సేవలు అందిస్తున్నారు. 1984 ఫిబ్రవరి 17న జన్మించాడు కాబట్టి అతను 17వ నంబర్‌ను ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా ప్రపంచానికి అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన డివిలియర్స్ జెర్సీని భవిష్యత్తులో ఎవరికీ కేటాయించకుండా ఉంటేనే అతనిని నిజంగా గౌరవించినట్టు అవుతుంది.
సచిన్ జెర్సీ నంబర్ 10ను రిటైర్ చేస్తారా లేదా అన్నది పక్కనబెడితే, క్రికెట్‌లో ఆటగాళ్లతోపాటు జెర్సీలకూ రిటైర్మెంట్ అంశం ఆసక్తిని రేపుతున్నది. ఏయే దేశాల క్రికెట్ బోర్డులు ఎవరెవరి జెర్సీలను రద్దు చేస్తారో చూడాలి.