ఆటాపోటీ

కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో ఐఒసి తీవ్రంగా స్పందించింది. రియో ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లుపై నిషేధాన్ని విధిస్తూ అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) తీసుకున్న నిర్ణయానికే ఐఒసి ఓటు వేసింది. సస్పెన్షన్‌ను అంతర్జాతీయ క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు (సిఎసి)లో రష్యా అథ్లెట్లు కొందరు సవాలు చేసినప్పటికీ, సానుకూల స్పందన రావడం అనుమానంగానే ఉంది. కాగా, ఈ వ్యవహారంపై వాడా కఠిన చర్యలకు ఉపక్రమించింది. రష్యా డోపింగ్ నిరోధిక ఏజెన్సీ (రష్యాఎడిఎ)ను రద్దు చేసింది. ఎక్కువ పతకాలను సాధించేందుకు అడ్డదారులు తొక్కిన రష్యా ఏకంగా అథ్లెట్లకు ఉత్ప్రేరకాల వాడకాన్ని అలవాటు చేసిందని వాడా విచారణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అక్కడి ప్రభుత్వమే డోపింగ్‌ను ప్రోత్సహిస్తున్నదని, ఈ తతంగం కొన్ని దశాబ్దాలుగా సాగుతున్నదని కమిటీ తేల్చిచెప్పడంతో, దోషులపై కఠినంగా వ్యవహరించాలని వాడా నిర్ణయించింది. అందులో భాగంగానే రష్యాఎడిఎని నిషేధించింది.