ఆటాపోటీ

ఫెదరర్ స్పెషల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ మాజీనంబర్ వన్ రోజర్ ఫెదరర్‌ది విలక్షణ శైలి. తనదైన ఆట తీరుతో అతను లక్షలాది మందిని ఆకట్టుకున్నాడు. ఫెదరర్ కొట్టిన ఒక ‘ట్రిక్ షాట్’ చాలా కాలంగా యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నది. ఒక కంపెనీ వ్యాపార ప్రకటనలో పాల్గొన్న ఫెదరర్ అద్భుతమైన సర్వీస్ చేశాడు. అతను కొట్టిన బంతి వేగంగా వెళ్లి, స్టాండ్స్‌లో ఉన్న ఓ వ్యక్తి తలపై పెట్టుకున్న క్యాన్‌కు తగిలింది. ఒకసారి కాదు.. వరుసగా రెండు సార్లు ఫెదరర్ ఆ క్యాన్‌కు గురి చూసి సర్వ్ చేశాడు. ఆరెండు పర్యాయాలు అది కింద పడింది. ఇది ట్రిక్ షాటా? కాదా? అన్నది అప్రస్తుతం. ఈ విషయంపై ఫెదరర్‌ను విలేఖరులు స్వయంగా అడిగినా అతను నేరుగా సమాధానం చెప్పలేదు. ఆ షాట్ గురించి తానేమీ చెప్పలేనని ముక్తసరిగా సమాధానం చెప్పాడు. మ్యాజిక్ ఎలా చేస్తారో ఒక మెజిషియన్ చెప్తాడా? అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. ఫెదరర్ షాట్ అతని ప్రతిభకు నిదర్శనమైనా లేక వీడియో మాయాజాలమైనా అది ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ఆకట్టుకుంటున్నది.