ఆటాపోటీ

డోప్‌ ఊబిలో రష్కా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ క్రీడా రంగాన్ని కుదిపేసిన సంఘటనల్లో రష్యా వ్యూహాత్మక డోపింగ్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్, ఉపాధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీపై ఎనిమిదేళ్ల వేటు పడడం సంచలనాన్ని సృష్టిస్తే, రష్యా వ్యూహాత్మక డోపింగ్ అంశం ప్రకంపనలకు కారణమైంది. ఒలింపిక్స్ వంటి మేజర్ ఈవెంట్స్‌లో పతకాలను కొల్లగొట్టడానికి వీలుగా రష్యా ప్రభుత్వం అథ్లెట్లకు ఉత్ప్రేరకాలను ఉద్దేశపూర్వకంగానే ఇచ్చి, ప్రోత్సహించిందని ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆధ్వర్యంలోని కమిటీ సాక్ష్యాధారాలతో బయటపెట్టింది. ఒక దేశ ప్రభుత్వమే అథ్లెట్లకు డోపింగ్‌ను అలవాటు చేసిందన్న వాస్తవాన్ని క్రీడాభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. రియో ఒలింపిక్స్ దగ్గరపడుతున్న నేపథ్యంలో, డోపింగ్ ఏ స్థాయిలో ఆ మెగా ఈవెంట్‌ను కుదిపేస్తుందోనన్న భయం అధికారులను వెంటాడుతోంది. రష్యాను ఒలింపిక్స్ నుంచి ఇప్పటికే నిషేధించారు. డోపింగ్ రహిత ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నారు. అయితే, ఈసారి ఒలింపిక్స్‌ను వేధిస్తున్న ఎన్నో సమస్యలకు అదనంగా డోపింగ్ సమస్య కూడా వచ్చి చేరింది. నిషిద్ధ మాదక ద్రవ్యాన్ని వినియోగించినట్టు రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా చేసిన ప్రకటనతో అక్కడ డోపింగ్ ఏ స్థాయిలో జరుగుతున్నదో స్పష్టమైంది. మొత్తం మీద రష్యా డోపింగ్ ఊబిలో కూరుకుపోయి అల్లాడుతుండగా, మిగతా దేశాల పరిస్థితి ఏమిటన్న భయం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి)ని వెంటాడుతున్నది. రష్యా పరిస్థితి యావత్ క్రీడా ప్రపంచానికి ఒక గుణపాఠం కావాలి.

రియో ఒలింపిక్స్ అధికారులను రష్యా డోపింగ్ వ్యవహారం కలవరానికి గురి చేస్తున్నది. దీనికితోడు రోజురోజుకూ పెరుగుతున్న డోప్ దోషుల జాబితా ఆందోళన కలిగిస్తున్నది. మొరాకోకు చెందిన మిడిల్ డిస్టెన్స్ రన్నర్ అమినె లాలో నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించినట్టు ఐఎఎఎఫ్ ప్రకటించింది. ఆమెపై రెండేళ్ల సస్పెన్షన్ వేటు వేసింది. డోప్ దోషుల్లో ఎక్కువ మంది రష్యా అథ్లెట్లుకాగా, మిగతా దేశాల వారు కూడా చాలా మందే ఉన్నారని ఐఎఎఎఫ్ జాబితా స్పష్టం చేస్తున్నది. డోపింగ్ రహిత ఈవెంట్‌గా రియో ఒలింపిక్స్‌ను నిర్వహించడం సాధ్యమా అన్న అనుమానాన్ని రేకెత్తిస్తున్నది. అథ్లెట్లు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడడం, పతకాలు సాధించడానికి అడ్డదారులు తొక్కడం క్రీడా ప్రపంచానికి కొత్తేమీకాదు. అయితే, ప్రభుత్వమే నేరుగా కల్పించుకొని, వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నదన్న వార్త బయటకు రావడం మాత్రం ఇదే మొదటిసారి. అందుకే, ఒలింపిక్స్ నుంచి రష్యాను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు ఐఎఎఎఫ్ ప్రకటించింది. ఐఒసి కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించింది. దీంతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని రష్యా దాదాపుగా కోల్పోయింది. ఈ పరిస్థితిని రష్యా స్వయంకృతంగా చెప్పుకోవాలి. అక్కడి ప్రభుత్వం, క్రీడా సమాఖ్యల అధికారులతోపాటు డోపింగ్ పరీక్షా కేంద్రం సిబ్బంది మూకుమ్మడిగా డోపింగ్‌ను ప్రోత్సహించడంతో రష్యా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రష్యాలోని డోపింగ్ నిరోధక విభాగం (ఎడిఎ) స్వతంత్ర సంస్థగా కాకుండా ప్రభుత్వ ఏజెంటుగా మారిపోయింది. అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడినట్టు తెలిసినప్పటికీ వారికి క్లీన్ చిట్ ఇస్తూ మోసగించింది. వాడాతో ఐఒసి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎడిఎ ఉన్న దేశాలు మాత్రమే మేజర్ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు అర్హత కలిగి ఉంటాయి. రష్యా ఎడిఎను వాడా నిషేధించిన నేపథ్యంలో, ఆ దేశ అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది. ఆతర్వాత ఐఎఎఎఫ్ తీసుకున్న నిర్ణయం, ఐఒసి స్పందన కలిసి రష్యాను రియో ఒలింపిక్స్‌కు దూరం చేశాయి.

బోస్టన్ మారథాన్ మాజీ చాంపియన్ లిడియా గ్రెగర్యెవా డోపింగ్ పరీక్షల్లో విఫలం కావడంతో రెండున్నర సంవత్సరాల సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్నది. 42 ఏళ్ల గ్రెగర్యెవా రక్తం నమూనాలో నిషిద్ధ మాదక ద్రవ్యాల ఆనవాళ్లు ఉన్నాయి. అదే విధంగా డిస్టెన్స్ రన్నర్ అలియోనా కుడాష్కినాపై కూడా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) రెండున్నరేళ్ల వేటు వేసింది. రష్యాకు చెందిన ఈ ఇద్దరు అథ్లెట్లు తాజాగా డోపింగ్ పరీక్షల్లో దోషులుగా తేలడం అక్కడ నెలకొన్న సమస్యకు అద్దం పడుతుంది. విక్టర్ చెగిన్ కోచ్‌గా వ్యవహరించిన వారిలో కనీసం 25 మంది డోప్ పరీక్షల్లో చిక్కారు. కుడాష్కనాకు కూడా అతనే కోచ్ కావడం గమనార్హం. రష్యా మిడిల్ డిస్టెన్స్ రన్నర్ లారిసా క్లెమెనొవా నిరుడు రష్యా రిలే చాంపియన్‌షిప్ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షలో దోషిగా తేలింది. వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు రష్యా అథ్లెట్లు వరుసగా డోపింగ్ పరీక్షల్లో పట్టుబడడం మరిన్ని సమస్యలను సృష్టిస్తున్నది.

రష్యాలో క్రీడా రంగం డోపింగ్ ఊబిలో కూరుకుపోయి అల్లాడుతోంది. దేశ అథ్లెటిక్స్‌కు కొత్త రూపాన్ని ఇవ్వడానికి పుతిన్ సర్కారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఒలింపిక్స్‌లో రష్యా అనర్హత వేటును ఎదుర్కోక తప్పలేదు. వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిన కారణంగా సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటున్న రష్యా ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్టు ప్రకటించింది. ఒకవైపు కఠిన చర్యలు తీసుకుంటున్నామని సర్కారు ప్రకటిస్తుండగా, మరోవైపు ఒకరి తర్వాత మరొకరిగా డోప్ దోషులు పుట్టుకొస్తునే ఉన్నారు. దీంతో రష్యాను ఒలింపిక్స్ నుంచి సస్పెండ్ చేయాలని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) నిర్ణయించింది. అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించడంతో రష్యా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్ వంటి మెగా టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టడానికి వీలుగా అథ్లెట్లతో ప్రభుత్వమే నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగింప చేసిందని ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆధ్వర్యంలోని కమిటీ ప్రకటించడం ప్రకంపనలు సృష్టించింది. రష్యా ఎంచుకున్న అడ్డదారికి ఐఎఎఎఫ్‌లోని కొందరు మాజీ అధికారులు సహకరించారన్నది క్రీడాభిమానులు జీర్ణించుకోలేకపోతున్న వాస్తవం. విజయాలు సాధించడానికి, పతకాలను పెంచుకోవడానికి అథ్లెట్లు అడ్డదారులు తొక్కడమే అప్పటి వరకూ అందరికీ తెలుసుగానీ, ఏకంగా ఒక దేశ సర్కారే ఈ విధంగా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడుతుందని ఎవరికీ అనుమానం కూడా రాలేదు. రష్యా ఉదంతం క్రీడా రంగాన్ని డోపింగ్ మహమ్మారి ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నదనే విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. అత్యంత కీలక పరిస్థితుల్లో, ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగించే ఉత్ప్రేరకాలు క్రీడా రంగానికి శాపంగా మారాయనడానికి రష్యా డోపింగ్ వివాదాన్ని మించిన రుజువు మరొకటి లేదు. ప్రపంచ వ్యాప్తంగా డోపింగ్ నిబంధనలను అతిక్రమిస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలవడం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. రష్యాలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం, ఎక్కువ కష్టపడకుండానే అందలం ఎక్కడం కోసం మాదక ద్రవ్యాలను వినియోగించడం ప్రపంచ క్రీడా రంగంలో ఒక విషసంస్కృతిని అలవాటు చేసింది. డోపింగ్ చీడ సోకిన క్రీడా రంగం అనేక సందర్భాల్లో పరువు పోగొట్టుకుంది. రష్యా ఉదంతం సరికొత్త కోణాలను ఆవిష్కరించగా, భారత్, కెన్యా, ఇథియోపియా తదితర దేశాల్లో పెరుగుతున్న డోపింగ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
వాడా ఆధ్వర్యంలోని స్వతంత్ర కమిటీ రెండు విడతలుగా సమర్పించిన నివేదికల్లో ఎవరూ ఊహించని కొత్తకొత్త అంశాలు తెరపైకి వచ్చాయి. ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మెగా ఈవెంట్స్‌లో పతకాలను సాధించడానికి రష్యా ప్రభుత్వమే అథ్లెట్లకు డోపింగ్ అలవాటు చేసిందన్న నిజాన్ని ఈ కమిటీ బయటపెట్టి సంచలనం సృష్టించింది. ఒక ప్రభుత్వమే వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడుతున్నదన్న విషయం క్రీడా రంగంలో ప్రకంపనలు సృష్టించింది. రష్యా అనైతిక విధానాలకు అంతర్జాతీయ అమెచూర్ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) అధికారులు సంపూర్ణంగా సహకరించారన్నది కమిటీ నిగ్గుతేల్చిన నిజం. రష్యా నిర్వాకంతో ప్రభుత్వ క్రీడా రంగం దిగ్భ్రాంతికి గురైంది. క్రీడల్లో డోపింగ్ కొత్తకాకపోయినా, ప్రభుత్వం, జాతీయ క్రీడా సమాఖ్యలు కలిసి అథ్లెట్లకు బలవంతంగా మాదక ద్రవ్యాలను అలవాటు చేయడం సరికొత్త పరిణామం. ఏ స్థాయిలోనైనా పోటీకి దిగిన తర్వాత జయాపజయాలను ఒకే రకంగా చూడాలన్నది క్రీడల ప్రధాన సూత్రం. విజయాలు సాధించడానికి చెమటోడ్చి సాధన చేయకుండా దగ్గర మార్గాలను ఎంచుకోవడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ఎవరైనా ఇలాంటి విధానాలను అనుసరిస్తున్నట్టు అనుమానం వేస్తే, వెంటనే స్పందించి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సినన బాధ్యత ఐఎఎఎఫ్ అధికారులపై ఉంది. కానీ, అథ్లెట్ల మోసాన్ని ఎండగట్టాల్సిన వారే వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి, డోపింగ్‌ను ప్రోత్సహించడం దారుణం. రష్యా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఐఎఎఎఫ్‌లోనూ ప్రక్షాళన అనివార్యమవుతుంది.
వాడా నివేదిక బట్టబయలు చేసే వరకూ వ్యూహాత్మక డోపింగ్ జరుగుతోందన్న అనుమానం ఎవరికీ రాలేదు. ప్రభుత్వాలే స్వయంగా రంగంలోకి దిగి, అథ్లెట్లను డోపింగ్‌కు ప్రోత్సహిస్తాయనిగానీ, ఐఎఎఎఫ్ అధికారులు డబ్బు కోసం చూసీచూడనట్టు వదిలేస్తారనిగానీ ఎవరూ ఊహించలేదు. నిషిద్ధ మాదక ద్రవ్యాలను ఉపయోగించిన అథ్లెట్లను, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న దేశాలను కూడా ఐఎఎఎఫ్ అధికారులు బ్లాక్‌మెయిల్ చేసి, లక్షలాది డాలర్లు లంచాలుగా తీసుకున్నారన్నది ఈ వ్యవహారంలో కొత్త కోణం. భారీగా ముడుపులు చెల్లించిన దేశాల్లో రష్యాది అగ్రస్థానం. ఐఎఎఎఫ్ మాజీ అధ్యక్షుడు లామిన్ డియాక్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడని, అథ్లెట్ల నుంచి, వివిధ దేశాల నుంచి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకునేవాడని వాడా కమిటీ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను రుజువు చేసే సాక్ష్యాధారాలను కూడా సేకరించి, వాస్తవాలను ప్రపంచం ముందుకు తెచ్చింది. రష్యా తదితర దేశాల ప్రభుత్వ వైఖరిని, ఐఎఎఎఫ్ అధికారుల లంచగొండి అవతారాలను బహిర్గత పరచింది. లామిన్ డియాక్‌తోపాటు అతని కుమారుడు పపా మసటా డియాక్, వారి న్యాయ సలహాదారు హబీబ్ సిసేలకు కూడా లంచావతారులేనని నిరూపించింది. మొ త్తం మీద రష్యా అనుసరించిన అక్రమ వి ధానాలు యాతవ్ క్రీడా రంగాన్ని అతలాకు తలం చేస్తున్నాయ. రష్యా దిద్దుబాటు చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో, డోపింగ్ రహిత క్రీడలు జరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే.

-శ్రీహరి