ఆటాపోటీ

నకిలీ టికెట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అమెరికాలోని ఓక్లహామాకు చెందిన జేన్ కోప్‌లాండ్, క్రిస్టెన్ దంపతులు ఒలింపిక్స్‌ను చూడాలని ఉత్సాహపడ్డారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసి టికెట్లు సంపాదించారు. రెండు రోజులు ప్రయాణం చేసి రియో డి జెనీరో చేరుకున్నారు. పోటీలను తిలకించేందుకు ఉరుకులు పరుగుల మీద మెయిన్ స్టేడియానికి చేరుకున్నారు. కానీ, అక్కడ సిబ్బంది అడ్డుకోవడంతో అవాక్కయ్యారు. ఇంతకీ వారికి ఎవరో నకిలీ టికెట్లు అంటగట్టారట. అవి నిజమైన టికెట్లే అనుకొని జేన్, క్రిస్టెన్ ఎంతో ఆశగా రియో చేరారు. నకిలీ టికెట్లు అని తెలుసుకొని చేష్టలుడిగిపోయారు. ఒలింపిక్ క్రీడలు జరుగుతున్న చాలా వేదికల్లో ఇలాంటి సంఘటనలు ప్రతి రోజూ జరుగుతునే ఉన్నాయి. నకిలీ టికెట్ల బెడదను నివారించడానికి అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే క్రీడాభిమానులకు కష్టనష్టాలు, నిరాశ తప్పడం లేదు.