ఆటాపోటీ

పోలీసు అత్యుత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఓ పోలీసు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి చిక్కుల్లో పడ్డాడు. బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఒక అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడానికి దుబాయ్ వెళ్లాడు. అక్కడి విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ మెస్సీతో కలిసి ఫొటో తీయించుకోవాలని ఉత్సాహపడ్డాడు. కానీ, దూర ప్రయాణం చేసి మెస్సీ అలసిపోయాడని, ఎవరినీ కలవడానికి ఇష్టపడడం లేదని తెలుసుకొని నీరుగారిపోయాడు. నిరాశగా పాస్‌పోర్ట్ కంట్రోల్ రూమ్ వద్దకు చేరుకున్న అతనికి మెస్సీ పాస్‌పోర్ట్ కనిపించింది. వెంటనే దానిని తీసుకొని సెల్ఫీలో దర్జాగా వీడియో తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ‘ఇది మెస్సీ పాస్‌పోర్ట్. అతను దీనిని ఇక్కడే మరచిపోయాడు. ఈ పాస్ట్‌పోర్ట్‌ను ఏం చేయాలి? దీనిని తగలబెట్టాలా లేక తీసిన దగ్గరే పెట్టేయాలా?’ అంటూ పిచ్చిగా వాగుతూ, మొత్తం వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఈ సంఘటన యుఎఇలో సంచలనం సృష్టించింది. ఒక ప్రముఖుడి పాస్‌పోర్ట్‌ను బహిరంగ పరచిన ఆ అత్యుత్సాహ పోలీసును అధికారులు అరెస్టు చేసి, కోర్టులో నిలబెట్టారు. పొరపాటు జరిగిందని, మెస్సీ మీద ఉన్న అభిమానంతోనే అలా చేశానని ఆ పోలీసు అంటున్నాడు. అతని వాదనతో కోర్టు ఎంత వరకూ ఏకీభవిస్తుందో చూడాలి. అతనికి ఆరు నెలల జైలు శిక్షతోపాటు 5,00,000 దీనారాలు (సుమారు 88.4 లక్షల రూపాయలు) జరిమానా విధించే అవకాశం ఉందని అంటున్నారు.