ఆటాపోటీ

అందరూ దోషులేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జార్ టీం లేదా ఫాన్సీ బేర్స్ బయటపెట్టిన అంశాలు ఇప్పుడు చాలా మంది ప్రముఖ అథ్లెట్లను అనుమానంగా చూసేలా చేస్తున్నాయి. అంతేగాక, ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. రష్యా ప్రభుత్వమే వ్యూహాత్మకంగా డోపింగ్‌ను ప్రోత్సహించి ఉంటే, ఐఒసి, ఐఎఎఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలేకాదు.. వాడా కూడా నిద్ర పోతున్నదా? దశాబ్దాలు దీనిని రహస్యంగానే ఎందుకు ఉంచింది? ఒలింపిక్స్‌కు ముందు ఎందుకు హడావుడిగా నివేదికలను విడుదల చేసింది? మేజర్ టోర్నీలు ఎక్కడ జరిగినా, పోటీదారులందరి రక్తం, మూత్ర నమూనాలను సేకరిస్తారు. ‘ఎ’, ‘బి’ శాంపిల్స్ రూపంలో రెండు దఫాలుగా వీటిని తీసుకుంటారు. వాడా గుర్తింపు పొందిన స్థానిక డోపింగ్ నిరోధక విభాగాలు పలు దేశాల్లో ఉన్నాయి. ఆ కేంద్రాలు జారీ చేసే పరీక్షల నివేదికల ఆధారంగానే నిర్వాహకులు స్పందిస్తారు. రష్యా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడితే, దశాబ్దాలుగా టోకు మొత్తంగా అందరికీ డోప్ పరీక్షల్లో క్లీన్‌చిట్ ఎలా లభిస్తుందన్న అనుమానం రావడం సహజం. తరుణ వ్యాధుల్లో వాడే చాలా మందల్లో నిషిద్ధ ద్రవ్యాలు ఉండడం, వాటిని వాడిన వారు డోప్ దోషులుగా తేలడం ఎంతోకాలంగా సామాన్యమైంది. రష్యా డోపింగ్ నిరోధక విభాగం పోటీదారులందరికీ క్లీన్‌చిట్ ఇస్తున్నప్పుడు అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల అధికారులకు ఎందుకు అనుమానం రాలేదు? వారికి నిజంగానే ఏ పాపం తెలియదా? లేక ప్రలోభాలకు లోబడ్డారా? నలుగురు అమెరికా టాప్ క్రీడాకారిణులు తమకు నచ్చిన మందులు వాడేందుకు అనుమతి లభించిన విషయాన్ని ‘ఆడమ్స్’ను హ్యాక్ చేసిన జార్ టీం వివిధ పత్రాల సాయంతో నిరూపించింది. ఈ రకంగా అమెరికాను ఇరుకున పెట్టడంలో రష్యా సఫలమైంది. ఈ పరిణామాలను చూస్తుంటే అమెరికా, రష్యా రెండూ దొంగలేనన్న అనుమానం కలుగుతోంది.