అవీ .. ఇవీ..

ఇదో రకం కళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాకారుల ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. ఫ్రాన్స్‌కు చెందిన ఆర్ట్ ఫొటోగ్రాఫర్ ‘జెఆర్’ ఆలోచనలూ అలాంటివే. ఒలింపిక్ కమిటీ ఆహ్వానం మేరకు ఈ మధ్య రియోడిజెనీరో వెళ్లిన ఆయన తను తీసిన ఫొటోలను, ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలవద్ద ఇలా కళాఖండాలుగా తీర్చిదిద్దాడు. ప్లాస్టర్, బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో వీటిని రూపొందించాడు. ఈ కళలో ఇతను ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు. ఆయన తీసే ఫొటోలు లేదా ఫోటోలతో రూపొందించే కళాఖండాలు అద్భుత ప్రతిభాపాటవాలు ప్రదర్శించినవారివే అయి ఉంటాయి. అదీ కష్టాలను ఎదురీది ప్రపంచకీర్తి సాధించిన వారికే ప్రాధాన్యం ఇస్తాడు. రాత్రికిరాత్రి హీరో అయిపోయినవారి ఊసెత్తడు. ఇక్కడ కన్పిస్తున్న కళాఖండంలో ఈతకొడుతున్నట్లు కన్పిస్తున్న క్రీడాకారిణి ఫ్రాన్స్‌కు చెందిన ట్రియాథ్లాన్ అథ్లెట్ లియోని పెరియట్. రియో ఒలింపిక్స్‌లో ఆమె ఆడకపోయినప్పటికీ ఆ ఈవెంట్‌లో రికార్డులు సాధించింది. రియోలోని గ్రాన్‌బర్‌బే తీరంలో అట్లాంటిక్ సముద్రంలో ఈతకొడుతున్నట్లు కన్పించేలా తను తీసిన ఫొటోను ఇలా ఓ కళాఖండంగా మార్చేశాడు. ఒలింపిక్ పార్కువద్ద ఓ డైవర్ అట్లాంటిక్ సముద్రంలోకి డైవ్ చేస్తున్నట్లు మరో ఫొటో ఆర్ట్‌నూ తీర్చిదిద్దాడు. రియోలో అతడు ఇలా మూడు కళాఖండాలు తీర్చిదిద్దగా అన్నీ అతిధులను ఆకట్టుకున్నాయి.

భారతి