అవీ .. ఇవీ..

శిల్పసౌందర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడ కన్పిస్తున్నది ఓ కళాఖండం. శిల్పకళానైపుణ్యానికి ఇది ఓ మచ్చుతునక. షోయిలాసోఖన్వరి అనే కళాకారుడు ఈ శిల్పాన్ని రూపొందించాడు. లండన్‌లోని సాచిగ్యాలరీలో నిర్వహించిన ‘షాంపేన్ లైఫ్’ ప్రదర్శనలో దీనిని చూసిన ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తున్నారు.

ఆకట్టుకున్న కన్ఫ్యూసియస్
చైనాలోని షెన్‌జన్ నగరంలో ఇటీవల ఓ అంతర్జాతీయ సాంస్కృతిక పారిశ్రామిక ప్రదర్శన నిర్వహించారు. ఇందులో చైనాలో అందరికీ ఇష్టమైన కార్టూన్ పాత్ర కన్ఫ్యూసియస్ బొమ్మలను ఇలా ప్రదర్శించారు. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

జాజ్ వేడుకలో జానపదం
లూసియానాలో గిరిజన గ్రామంగా పిలిచే ప్రాంతంలో ప్రతి ఏడు మాదిరిగానే ఈ ఏప్రిల్ చివరివారంలో జాజ్ సంగీతోత్సవం ప్రారంభమైంది. న్యూ ఓర్‌లీన్స్ జాజ్ అండ్ హెరిటేజ్ ఫెస్టివల్‌గా దీనిని పిలుస్తారు. ఈ వారం అంతా జాజ్ సంగీత వైభవాన్ని చాటే కార్యక్రమాలు నిర్వహిస్తారు. పనిలో పనిగా జానపద వారసత్వాన్ని, సంస్కృతిని చాటే కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తారు. తమతమ జీవనవిధానాన్ని, ప్రత్యేకతలను చాటిచెప్పేందుకు పెద్దఎత్తున ‘వౌహక్ హంటర్స్ మర్దిగోస్ ఇండియన్స్’ (స్థానిక గిరిజన తెగలకు చెందినవారు) తరలివస్తారు. విభిన్న వేషధారణలు, వృత్తికి సంబంధించిన అంశాలను ప్రదర్శిస్తారు. కలర్‌ఫుల్‌గా కన్పించే ఈ వేడుకలో ఆధునిక అమెరికాకు భిన్నమైన కోణం ఆవిష్కృతమవుతుందంటే నమ్మాల్సిందే.

కళాత్మక పర్వతాలు

ప్రపంచంలో ఏడు వింతైన
పర్వతాల పేరిట ఓ
కళాకారుడు ఈ రాతి
శిల్పాలను ఇలా అమర్చాడు. లాస్‌వెగాస్‌లోని నెవెడా ఎడారి ప్రాంతంలో కళాకారుడు యుగో రోడినోన్ వీటిని
తీర్చిదిద్దాడు. ‘సెవెన్ మ్యాజిక్ వౌంటెయిన్స్’ అని దీనికి పేరు
పెట్టాడు.

మ్యూరల్...ముద్దుముచ్చట

లిధువేనియా రాజధాని విల్లినస్‌లో ఓ రెస్టారెంట్ గోడపై కన్పించిన ఈ పెయింట్‌లో కన్పిస్తున్నది ఎవరో గుర్తుపట్టారా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిని, అమెరికా అధ్యక్ష బరిలో నిలిచేందుకు తహతహలాడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. వీరిద్దరూ ఒకరినొకరు ముద్దుపెట్టుకుంటూ పలకరించుకుంటున్న దృశ్యం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

భారతి