అవీ .. ఇవీ..

ఐస్... నైస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల..ఏదీ కవితకు అనర్హం కాదన్నాడు మహాకవి. కళాకారులకూ ఆ సూత్రం వర్తిస్తుంది. మట్టితో కొందరు, ఇసుకలో మరికొందరు అద్భుత కళాఖండాలు సృష్టిస్తే ఇంకొందరు దారుతో, రాయితో శిల్పాలు మలుస్తారు. ఆధునిక ప్రపంచంలో మంచుతో కళాఖండాలు సృష్టించడం ఓ ఫ్యాషన్‌గా మారింది. చైనాలోని హర్బిన్ ప్రావిన్స్‌లో ఏటా జనవరిలో అంతర్జాతీయ మంచు శిల్పాల వేడుక, పోటీ నిర్వహిస్తారు. ఆ పోటీ కోసం ఇప్పటికే వందలాది మంది మంచు శిల్పకారులు చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టారు. సాధారణంగా జనవరి మొదటి వారంలో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. ముగింపు వేడుక నిర్వహించరు. వాతావరణం బట్టి మంచుకురిసి గడ్డకట్టే పరిస్థితులను బట్టి అది కొనసాగుతుంది.

భారతి