అవీ .. ఇవీ..

రబ్బర్‌బాతుల ‘సహాయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో నదిలో దాదాపు 60వేల రబ్బర్ బాతు బొమ్మలను ఈమధ్య వదిలారు. వాటిలో ఏ బొమ్మయితే ముందుగా నిర్ణయించిన ఫినిషింగ్ లైన్‌ను తాకుతుందో ఆ బొమ్మ యజమాని ప్రైజ్ మనీ గెలుచుకుంటారు. ఇల్లినాయిస్ ఒలింపిక్స్ కోసం విరాళాల సేకరించేందుకు ఏటా ఈ విండ్‌సిటీ రబ్బర్ డక్ డెర్బీ పేరుతో ఓ పోటీ నిర్వహిస్తారు. ఒక్కో బొమ్మ 5 డాలర్లకు విక్రయిస్తారు. వాటిని కొన్నవారి పేరుతో అవి ఉంటాయి. అలా అమ్మినవాటిని సేకరించి ట్రక్కుల్లో తీసుకువెళ్లి చికాగో నదిలో పడేస్తారు. కొందరు అధికారుల పర్యవేక్షణలో ఆ బొమ్మలు దిగువకు కదిలేలా చేస్తారు. నది దిగువభాగంలో ఏర్పాటు చేసిన ఫినిషింగ్ లైన్‌ను తాకిన బొమ్మ యజమానిని విజేతగా నిర్ణయిస్తారన్నమాట. ఈసారి దాదాపు 60వేల రబ్బర్ బాతులను విక్రయించి నీటిలో వదిలారు. లక్ష యూఎస్ డాలర్ల ప్రైజ్‌మనీ ఇచ్చారు.

- భారతి