అవీ .. ఇవీ..

చిత్రం.. విచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఫొటోలను కళ్లప్పగించి చూస్తున్నారు కదూ!. అద్భుతమైన ఈ దృశ్యాలను కెమెరాల్లో బంధించడం ఆషామాషీ కాదుకదూ! ప్రఖ్యాత నేషనల్ జియోగ్రాఫిక్ సంస్థ ఇటీవల నిర్వహించిన నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ -2017లో బహుమతి పొందిన చిత్రాలు ఇవి. ఓ అగ్నిపర్వతంపై పిడుగుపడటం, ఆ వెంటనే ఆ పర్వతం విస్ఫోటనం చెందడం కొన్ని క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించిన ఫొటోగ్రాఫర్ మెక్సికోకు చెందిన సెర్జియోతపిరో వెలస్కో. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన గలపగోస్ అర్చిపలగొకు పదిరోజుల ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఈ దృశ్యాన్ని అతడు వీక్షించి క్లిక్‌మనిపించాడు. ముప్ఫై దేశాల నుంచి వచ్చిన 15వేల ఎంట్రీలలో ఈ ఫొటోకు (నేచర్ విభాగం) గ్రాండ్ ప్రైజ్ వచ్చింది. ఇక ద్రోన్ సహాయంతో తీసిన మరో ఫొటోకు కూడా మరో బహుమతి దక్కింది. లొఫోటన్ దీవుల్లోని హెన్నింగ్‌స్పెయిల్ దీవిలో ఉన్న ఈ అద్భుతమైన ఫుట్‌బాల్ మైదానం ప్రపంచంలో మరెక్కడా కనిపించదంటే నమ్మాల్సిందే. ద్రోన్ సహాయంతో 120 మీటర్ల ఎత్తునుంచి ఈ అందమైన దీవి మైదానాన్ని క్లిక్‌మనిపించిన ఫొటోగ్రాఫర్ మిషాడి-స్ట్రాయర్. జియాగ్రాఫిక్ ఫొటోగ్రాఫర్ అయి ఇతగాడు నార్వేకు పదిరోజుల పర్యటనకు వెళ్లినపుడు ఈ జూన్‌లో ఈ ఫొటో తీశాడు.

- భారతి