అవీ .. ఇవీ..

కందిరీగ.. నీటిబుడగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందిరీగలు తమ గూళ్లను ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటాయో తేల్చి చెప్పే ఫొటో ఇది. చెట్ల బెరడను నమిలి, రసాన్ని ఉమ్మి ఓ కాగితపు పొరలా చేసి అవి గూళ్లను నిర్మించుకుంటాయి. వాన చినుకులు లేదా మంచు కురిసి ఆ గూళ్లు తడిస్తే.. ఆ తేమను, లేదా నీటిని ఇలా బుడగల్లా చేసి బయట పడేస్తాయి. ఆ లక్షణం వాటి ప్రత్యేకత. అదిగో ఓ కందిరీగ అలా తన గూడునుంచి నీటిని బుడగలా మార్చి పడేస్తున్న దృశ్యాన్ని క్లిక్‌మనిపించాడు ఓ ఫొటోగ్రాఫర్. మలేసియాకు చెందిన లిమ్ చూ హౌ తన పెరట్లో తిరుగుతూండగా ఈ దృశ్యం కంటపడింది. అంతే ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లి కెమెరా తెచ్చుకుని క్లిక్‌మనిపించాడంతే.

- భారతి