బిజినెస్

కాలుష్య నియంత్రణకు సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 28: విశాఖ పోర్టు ట్రస్టును అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. పోర్ట్ ట్రస్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు కాన్సులేట్ బృందానికి సాదర స్వాగతం పలికారు. అనంతరం అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ బిట్రస్ హెడా తన బృందంతో పోర్టులో పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాన్సులేట్ ప్రతినిధులకు పోర్టు ప్రగతిని కృష్ణబాబు వివరించారు. పోర్టు ద్వారా జరుగుతున్న ఐరన్ ఓర్, కోల్, ఇతర సరకు రవాణా వివరాలను వెల్లడించారు. అలాగే పోర్టులో ఇటీవల తీసుకున్న పలు నిర్ణయాలను అమెరికన్ కాన్సులేట్‌కు తెలిపారు. ముఖ్యంగా ఆన్‌లైన్ ఇ పేమెంట్ విధానం, 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, పోర్టులో వినియోగించే నీటి వ్యర్థాల శుద్ధి, నిరంతరం సిసి కెమేరాలతో నిఘా వంటి అంశాలను వారికి కృష్ణబాబు విశదీకరించారు. కాగా, పోర్టు పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు సహకరించాల్సిందిగా కాన్సులే ట్ బృందాన్ని కృష్ణబాబు కోరారు. పోర్టు పరిధిలో ఐరన్ ఓర్, బోగ్గు తదితర సరకు రవాణా సందర్భంగా చోటు చేసుకుంటున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చాల్సిందిగా సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేథరిన్ బిట్రస్ హెడా తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించారు. అమెరికా, భారత్ మధ్య సత్సంబంధాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. వ్యాపార, వాణిజ్యపరంగా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అమెరికన్ కాన్సులేట్ బృందంలో పొలిటికల్ అండ్ ఎకనామిక్ అసోసియేట్ జియోఫిచిన్, కమర్షియల్ అసిస్టెంట్ అనె్నట్ డిసిల్వా తదితరులున్నారు.

చిత్రం.. అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధి కేథరిన్‌తో పోర్టు చైర్మన్ కృష్ణబాబు