భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-102

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరతరాలు కూర్చుని తినేంత ధనం నాకు భగవంతుడు ఇచ్చాడు. చదువు, సంధ్య కూడా నాకు అబ్బాయి. కాని, నాకు ఆత్మ జ్ఞానం ఒక్కటి రావడంలేదు. దాన్ని మీరు దగ్గర తీసుకొందామని చాలా దూరం నుంచి ప్రయాస పడి వచ్చాను. మీరు నాకు ఆ ఆత్మజ్ఞానాన్ని బోధించండి ’అని అడిగాడు.
బాబా విననట్లే ఉన్నారు.
అంతలో బాబా ‘మహీ! నాకు ఓ ఐదు రూపాయలు కావాలి. నీవు వెళ్లి లక్ష్మీబాయిని అడిగి తీసుకొనిరా’అన్నారు.
అతడు సరే నని వెళ్లాడు. కొద్దిసేపటికి వచ్చాడు. ‘బాబా ఆమె దగ్గర ఐదు రూపాయలు లేవట’అని కూర్చున్నాడు.
బాబా అయ్యో నాకు ఐదురూపాయలు కావాల్సిందే. ఎలా చేయను ఎవరు ఇస్తారు అని పైకి అంటున్నారు. ‘హేమా నీ దగ్గర ఏమన్నా ఉంటే డబ్బు ఇవ్వచ్చు కదా ’అన్నారు.
హేమాదిపంతు ‘బాబా నీకు తెలియంది ఏముంది నాదగ్గర. నా దగ్గర అంత డబ్బు ఏమీ లేదు ’అని అన్నాడు.
‘సరే కాని, నీవువెళ్లి కేల్కర్ ఇస్తాడేమో చూసిరా ’అన్నాడు. అలా ఇద్దరు ముగ్గురిని డబ్బుకోసం పంపారు. కాని వారెవరూ డబ్బు దొరికిందని తెచ్చివ్వలేదు.
ఇంతలో ధనికుడు కుర్చీ మీద నుంచి లేచి అటూ ఇటూ పచార్లు చేసి కాస్త విసుగుదలతో ‘బాబా నాకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తే అయిపోతుందికదా. నేను వెళ్లాలి. ఎన్నో పనులు మానుకొని మీ దగ్గరకు వచ్చాను’అన్నాడు.
బాబా చిరునవ్వు నవ్వారు.
అతడు మనసులో నేను అడిగిన దాన్ని విన్నారో లేదో కూడా తెలియడంలేదు. ఎపుడూ చిరునవ్వు నవ్వుతున్నాడు. సాధువు కదా . ఈయనకు డబ్బు ఎందుకు అందరినీ అడిగి రమ్మని పంపిస్తున్నాడు. డబ్బుతో ఏం చేస్తుండవచ్చు అనుకొన్నాడు.
చివరకు పదేపదే ధనవంతుడు ఆత్మజ్ఞానం బోధించమని అడుగుతుంటే బాబా
‘నాయనా నేను ఇందాకటి నుంచి నీకు అదే బోధిస్తున్నాను. ఆత్మ జ్ఞానం అంటే ఎక్కడైనా పుస్తకాల్లో దొరుకుతుందని అనుకొంటున్నావు. నీపాలిట డబ్బే బ్రహ్మం. ఆత్మజ్ఞానం కావాలంటే గురువుకు పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు,మనస్సు, బుద్ధి, అహంకారం అనేవి భగవంతునికి అర్పించాలి. నీ దగ్గర ఐదు రూపాయలు యాభైరెట్లుగా ఉన్నాయి. కాని వాటిని నీవు తీసి ఇవ్వలేకపోయావు. డబ్బుపై నీకున్న మోహం నశిస్తే కాని ఆత్మజ్ఞానం అలవడదు. నా దగ్గర జ్ఞానముందో లేదో భగవంతునికి తెలుసు. కాని జ్ఞానం లేనివాడు, అహంబావిగా ఉన్నవాడు ఇట్లాంటివారికి జ్ఞానముదయించుదు.
చెప్పినా బోధపడదు. కనుక నీవు నీ కున్న ఆస్తులపై, బంధనాలపై మోహాన్ని వదిలి ఆత్మజ్ఞానం అదే కలుగుతుంది’’అని అన్నారు.
అతడికి బాబా చెప్పింది అంతగా అర్థమయినట్లుగా అక్కడున్నవారికి అనిపించలేదు. బాబా ఎందుకో కోపంగా కూడా చెప్పినట్లుగా వారికీ అనిపించింది. ఒకరిద్దరూ మాత్రం నిజమే కదా అని బాబాకు మాకు నీపై అచంచలమైన నమ్మకాన్ని కలిగించు స్వామి అని నమస్కారం చేసుకొన్నారు. ఆ ధనికుడు ఇంకాసేపు అక్కడే కూర్చున్నాడు. బాబా నోటి నుంచి ఏమాట రాకపోయేసరికి తన గడియారంలో సమయాన్ని చూసుకొంటూ వెళ్లిపోయాడు.
***
ప్రతిరోజు బాబా దగ్గరకు రామదాసు అను నతను వచ్చి విష్ణు సహస్రనామావళిని పఠించి బాబాకు నమస్కరించి వెళ్లేవాడు. ఒకనాడు అతడు విష్ణు సహస్రనామావళిని చదవడం అయిన తరువాత బాబా అతనిని పిలిచాడు.
‘రామదాసు నీవు బజారుకు వెళ్లి నాకు సోనాముఖి అనే మూలికను తెచ్చిపెట్టు ఈమధ్య బాగా కడుపులో నొప్పిగా ఉంటోంది’అని చెప్పాడు. బాబానే ఐదురూపాయలు రామదాసుకు ఇచ్చాడు అట్లాగే తెస్తానని తన విష్ణు సహస్రనామావళి పుస్తకాన్ని జాగ్రత్త చేసుకొని రామదాసు బజారుకు వెళ్లాడు.
అంతలో శ్యామా వచ్చి బాబాకు నమస్కరించాడు.
‘శ్యామా అదిగో అక్కడ విష్ణు సహస్రనామావళి పుస్తకం ఉంది తీసుకుని రా’అన్నారు. శ్యామా తెచ్చిన తరువాత ‘ ఈ పుస్తకం ఎంతో ప్రభావవంతమైంది. ఒకసారి నాకు చనిపోతానేమో అనిపించేంతగా గుండె నొప్పి వచ్చింది. ఈ పుస్తకాన్ని తీసుకొని కొన్ని నామాలను చదివి నా గుండె పై ఈ పుస్తకం పెట్టుకొని పడుకొన్నాను.
కొద్దిసేపటికే నాగుండె నొప్పి తగ్గిపోయింది. చాలా ప్రభావం కలిగిన పుస్తకమని నాకు ఆరోజు తెలసింది. కనుక నీవు కూడా ప్రతిరోజు ఈ పుస్తకంలోని ఒక్క నామాన్నైనా చదువు. నీకు శుభం కలుగుతుంది. తీసుకో ఈ పుస్తకం ’అన్నారు.
‘బాబా నేను మరో పుస్తకం తెచ్చుకుంటానులే. నీవుచెప్పినట్లు చదువుతాను. కాని ఈ పుస్తకం రామదాసుది. ఆయన దెబ్బలాడుతాడు. నాకు భయం ’అని అన్నాడు.
‘మరేం పర్లేదు. రామదాసుకు నేను చెప్తానులే. నీవు ఈ పుస్తకం తీసుకో’అని చెప్పారు. శ్యామా వద్దన్నా వినకుండా బలవంతం చేసి మరీ పుస్తకాన్ని శ్యామాకు ఇచ్చారు. -- ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743