భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-103

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతలో రామదాసు వచ్చాడు. సోనాముఖి ని బాబాకు ఇచ్చాడు.
‘రామదాసు చూసుకొన్నావు. నీ విష్ణు సహస్రనామావళి పుస్తకాన్ని ఈ శ్యామా దొంగతనం చేసి తీసుకొన్నాడు.’అన్నాడు.
శ్యామా అయోమయంగా చూశాడు. రామదాసు ఎక్కడలేని కోపం తెచ్చుకున్నాడు.
‘ఏమీ బుద్ధి లేదా నీకు నా పుస్తకం దొంగతనం చేస్తావా. అది నాకు ఎంత ప్రాముఖ్యమైనదో నీకు తెలియదాఅయినా వేరేవాళ్ల పుస్తకాన్ని నీవు ఎలా తీసుకొంటావు ’అని నానామాటలు అడిగాడు. శ్యామా ఏదో చెప్పబోతుంటే కూడా వినిపించుకోకుండా తన మానాన తాను తిట్టుకొంటూ వెళ్తున్నాడు. అపుడు
బాబా ‘ఓ రామదాసు!’అని గట్టిగా పిలిచాడు.
‘బాబా అసలు మీవల్లే ఇంత గొడవ జరిగింది. నా పుస్తకాన్ని నేను పోగొట్టుకున్నాను. ఇపుడు నా కు ఆ పుస్తకం దొరక్కపోతే తల పగుల కొట్టుకుని చస్తాను’ అని ఆవేశంగా అన్నాడు.
బాబా చిరునవ్వు నవ్వారు. ‘ఓహో నాకు తెలియదు. విష్ణు సహస్రనామావళిని రోజు చదివితే ఈ ప్రయోజనం ఉంటుందని ’అన్నారు. రామదాసు తో పాటుగా అక్కడున్నవారంతా అయోమయంగా బాబా వైపు చూశారు.
రామదాసుకూడా వౌనంగా కన్నీరు కారుస్తూ బాబా వైపు తిరిగాడు.
‘చూడు రామదాసు ఇన్నాళ్లు చదివిన ఈ పుస్తకంపై మమకారాన్ని వదలలేకుండా ఉన్నావు. పుస్తకంపైనే ఇంత మమకారం ఉంటే ఇక మిగతావాటిపై నీకు ఎంత మమకారం ఉంటుంది? అయినా ఆ విష్ణు సహస్రనామావళి నంతా నీవు నోటికి నేర్చుకున్నావు కదా. అయినా మరొకరికి దాన్ని ఇవ్వలేకపోతున్నావు అంటే ఇక నీవు తెలుసుకున్నది ఏమిటి ఊరికే నోరు నొప్పి పుట్టేట్టుగా నామాలు చదవడమా. ఇదేనా నీవు నేర్చుకున్న విషయం జ్ఞానం లేకుండా ఎంత సేపు ఏమి చేసినా వృథా నే కదా ’అని మెల్లగా అన్నారు.
అంతే రామదాసు బాబా దగ్గరగా వచ్చి మోకాళ్లపై కూర్చున్నాడు. అతడి తలను నెమురుతూ ‘నాయనా ఇవ్వడం నేర్చుకో. నీకు మంచి జరిగేది నేను చెబుతాను కదా. ఎందుకంత ఆవేశం. నీకు తెలిసింది నలుగురికీ చెప్పడం మంచిది కదా. ఎపుడు తెలుసుకొంటావు’అన్నారు. అంతే బాబా కరస్పర్శ రామదాసు లో మార్పు తెచ్చింది. ‘బాబా నన్ను క్షమించు. నేను ఇంతదాకా చాలా తప్పు చేశాను. ఇక నుంచి ఎప్పుడూ ఇలా ప్రవర్తించను.’అన్నాడు. వెంటనే శ్యామా కాళ్లపై బడి తన్నుక్షమించమని అడిగాడు.
ఇక నాకు ఉన్నంతలో నలుగురికీ పంచడం నేర్చుకుంటాను. అని ప్రతిరోజు చిన్నవారికి ఈ విష్ణు సహస్రనామావళిని నేనే నేర్పిస్తాను. నాకు మంచిబుద్ధిని ప్రసాదించు స్వామి. నేను మంచిమార్గంలో నడుచుకునే ట్లుగా చేయి అని బాబా కు నమస్కారం చేశాడు.
అంతే
అందరిలోను ఎంతో మార్పు వచ్చింది. బాబా ఎవరికి ఏమి కావాలో తనను అడిగినా, అడగకపోయినా ఇలానెమ్మదిగా చెప్పేవారు.
***
బాబా ఎవరినీ ఏమి అనేవారు కాదు. ఎవరినీ ఇది చేయండి అని చెప్పేవారు కాదు. దేనిని చదవమని కూడా పెద్దగా చెప్పేవారు కాదు కాని ఎపుడూ గురు చరిత్రను చదవమని అందరికీ చెప్పేవారు. గురువు లేనిదే ఏ పని చేయలేమని గురు ప్రశస్తిని గుర్తించని వారు ఈలోకంలో మనుష్యులు పుట్టి కూడా వారి జన్మము వృథాగా గడుపుతున్నారని, వారి సమయమంతా వ్యర్థ చేసుకొంటున్నారని అనేవారు.
అట్లాంటి బాబా దగ్గర ఎపుడూ ఎవరో ఒకరు వచ్చి గురు చరిత్రను, లేక రామాయణాది కావ్యాలను చదువుతుండేవారు. ఒకసారి వాఝే అనే భక్తుడు వచ్చి ‘బాబా నాకు ఏదైనా చదవమని చెప్పండి’అని అడిగాడు.
‘కేవలం చదివితే సరిపోతుందా’అని నవ్వుతూ అడిగారు బాబా.
‘అతడు బాబా నేను నినే్న నమ్ముకున్నాను. నీవే నన్ను గట్టున చేర్చాలి. కేవలం నేను నిన్ను నమ్మి నీవే నాలో సంకల్పించిన పనులను చేస్తాను అంతే నాకు తెలుసు’అని నమస్కారం చేశాడు.
బాబా చిరునవ్వు నవ్వుతూ ‘సరే నీ కోరికను నేను ఎందుకు కాదనాలి. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743