భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-105

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తాత్య నీకోసమని, నాకోసమని రెండు ఊయలలు తెప్పించాను. కాని చూస్తూ చూస్తూ నిన్ను ఊయలలో కూర్చోబెట్టలేక పోతున్నాను. అందుకే నీవు ఇక్కడే ఉండు. నేనొక్కడినే ఊయలనెక్కుతాను ’అన్నారు.
తాత్యకు బాబా మాటలేమీ అర్థం కాలేదు. కాని బాబా ‘నేనే ముందు వెళ్తాను. నీవు నా తర్వాత రా’అని అన్నాడు.
‘నేను ఫకీరును. నేను ఉన్నా, పోయినా ఎవరూ పట్టించుకొనేవారు ఉండరు. కాని నీవు సంసారివి. నీపై ఎంతోమంది ఆధార పడి ఉన్నారు. కనుక నిన్ను నేను పంపలేను. కనుకనే ఊయలను వెనక్కు పంపేశాను’అన్నారు.
‘బాబా నేను సంసారినే
కాదు అనను. కాని నేను పోతే నలుగురు ఏడుస్తారు. కాని మీరు పోతే ఇక ఏముంది. సర్వప్రపంచమూ ఏడుస్తుంది. జనులందరూ బాధపడతారు. మాకు దిక్కు ఎవరుంటారు. అయినా నీవు లేకుండా మేమెలా అందులోను నేనెలా జీవించగలను అనుకొంటున్నావు. ఉంటే ఇద్దరమూ ఉందాము. లేకుంటే నేను ముందు వెళ్తాను. తర్వాత నీవు రా అంతే కాని నన్ను వదిలి నీవు ఎక్కడికీ వెళ్లవద్దు ’అంటూ భోరుభోరున ఏడ్చేశాడు తాత్య. అక్కడున్నవారు వీరి మాటలు విని అయ్యో శిరిడీ వాసులకు ఎంత కష్టం వచ్చింది. ఈ దేవుడు దయలేనివాడు. బాబా ను తీసుకొని పోతే ఇక మమ్ము కాపాడేవారు ఎవరు ఉంటారు. అసలు బాబా లేని జీవితాన్ని మేము ఊహించుకోలేము అంటూ అందరూ ఒక్కసారిగా ఏడడ్వడం మొదలెట్టారు. బాబా నీవు ఎక్కడికీ వెళ్లవద్దు. మా పరంధామునికి నీవే. నిన్ను తప్ప మేమెవ్వరమూ అన్యమెరుగము. అని చేతులెత్తి నమస్కారం చేశారు. బాబా వారిని ప్రేమతో చూశాడు. చిరునవ్వు నవ్వుతో ఆశీర్వదించాడు.
ఇంకా ఏదో చెప్పబోతుండే తాత్యను కోప్పడ్డారు. ఇక చాలు. నీవేమీ చెప్పనక్కర్లేదు. ఇక్కడ్నుంచి వెళ్లిపో.. అంటూ గదమాయించారు.
***
అందరూ బూటీ కట్టించే వాడాలోకి రాకుండే బాబా సమాధి చెందుతారేమో అని భయపడ్డారు. అందరూ బాబాను ప్రార్థించారు. మమ్ములను వదిలి మీరు ఎక్కడికీ వెళ్లకండి అని అందరూప్రార్థనలు జరిపారు.
అందరూ కంట తడిపెడుతున్నారు. అందరి కళ్లల్లోను దైన్యం ఆవరించింది. బాబాను చూస్తూన్నారు. రోజురోజుకీ బాబాబలహీనంగా అవుతున్నారు. అట్లా అని ఏ పని చేయకుండా ఉండడం లేదు. కాని దౌమ్యా వచ్చేసరికి బాబా ఒక భక్తునితో ఇలా అంటున్నారు.
‘ఇక నేను వచ్చిన పని కొంతవరకు అయింది. ఇక నేను ఈ శరీరాన్ని విడిచి సమాధినొందుతాను. నా సమాధినే నా వారిని రక్షిస్తుంది. నామాటలు నిజాలు ’అంటుండగా దౌమ్య ఆ మాటలు వింటూ వచ్చారు. అయోమయంగా చూశాడు.
‘బాబా ఏంటి బాబా మీరు ఏమి మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా తెలుస్తుందా?’ మీరు శరీరాన్ని విడవడం ఏమిటి అసలు మీరు లేకుండా మేము ఎలా జీవించగలం ’అని పెద్దపెట్టున ఏడ్చాడు.
బాబా దౌమ్యాను దగ్గరకు తీసుకొన్నారు. కన్నీళ్లు తుడిచారు.
‘దౌమ్యా! నీవెంత పిచ్చివాడవయ్యా. నాకు పుట్టుట, గిట్టుట ఉన్నాయా , ఇపుడు నేను ఉన్నాను కాని ఇంతకు ముందు నేను లేనా ఇక ముందు ఉండబోనా ఏమిటి నీ పిచ్చి ’అన్నారు.
దౌమ్యాకు ఏదో తెలిసినట్లు అయ్యింది. ఎవరో నెమ్మదిగా అమృతం తనపై చల్లినట్లుగా ఒక్కసారిగాప్రశాంతి నొందింది అతడి మనసు.
‘చెప్పు నేను అంటే కేవలం ఈ శరీరమేనా. నీవు కోరుకున్న చోట నీవు కోరుకున్నట్లు నీకు కనబడనంటావా’ అన్నారు బాబా. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743