భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-106

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాబా మీరు స్వయంగా భగవానులే. కాని మిమ్ము పోల్చుకునే శక్తి నాకెక్కడిది. అందుకే మీరీ శరీరంతోనే నా దగ్గరే ఉండండి. అంతేకాని నాకు దూరంగా కనిపించకుండా ఉంటే నేను బతకలేను’అన్నాడు.
బాబా చిరునవ్వుతో చూశారు.
‘పిచ్చి దౌమ్యా ఇవే మాటలు ఎవరితో అనకు. ప్రజలంతా అమాయకులు. పుట్టిన జీవి మరణించక తప్పదు కదా. మరేం పర్లేదు నేను ఎక్కడికీ వెళ్లను. నీవు కావాల్సినపుడు ఈ సమాధి దగ్గరకు రమ్ము నీవు కోరిన సమాధానాన్ని నీకు ఈ సమాధి ఇస్తుంది ’అన్నారు. ‘వెళ్లు నీ పని నీవు చేసుకో..
ఎవరి పని వారు చేస్తుంటే చాలు కదా. భగవంతుడు ఎపుడూ మంచి పనులు చేసేవారి దగ్గర ఉంటూనే ఉంటారు. అని మరలా చెప్పారు.
ఇక అక్కడ్నుంచి దౌమ్యా బయటకు వెళ్లాడు. కాని అతని మనసు మళ్లీ వ్యాకులం చెందింది. బాబా నామస్మరణ చేస్తూ ముందుకు వెళ్తుతున్నాడు.
మరుసటి రోజు బాబా దగ్గరకు కాకాసాహెబ్ వచ్చారు. భిక్షాటనకు వెళ్లలేనయ్యా అంటూ బాబా ఆరోజు భిక్షాటనకు వెళ్లలేదు. అదేరోజు కొంతమంది సర్కస్ కంపెనీవారు తమ దగ్గర ఉన్న పులి అస్వస్థతకు గురైంది. బాబాకు చూపిస్తే దాన్ని బాగుచేస్తాడని తీసుకొని వచ్చారు.
ఆ పులి సాయిబాబాను చూడగానే మెల్ల మెల్లగా అడుగులు వేయసాగింది. కాని ఆ పులినంతా దారాలతో కట్టి వేసి ఉన్నారు దానితో పులి అడుగులను భారంగా వేస్తోంది. బాబా ‘ పులినెందుకు అలా కట్టివేసి లాగుతున్నారు. ఆ దారాలన్నింటినీ విప్పివేయండి’అన్నారు.
‘అమ్మో పులి కదా’అన్నారెవరో.
‘మరేంఫర్లేదు. పులి కూడా పిల్లి బాబా ముందు’అన్నారు మరెవరో.
వెంటనే పులికి కట్లు విప్పారు. ఆ పులి వెంటనే సరాసరి నడుచుకొంటూ మసీదు మెట్లైక్కి బాబా పాదాల చెంతకు వెళ్లి నిలబడింది. కళ్లప్పగించి బాబానే తదేకంగా చూసింది. ఆ తర్వాత బాబా పాదాలను వాసన చూసింది. ఆ పాదాల దగ్గరే పడుకొంది. వెంటనే పెద్దగా గర్జించింది. ఆ గర్జన కు అర్థం బాబా అని ఎలుగెత్తి అరవడమేనేమో బాబా తన చేతిని పులి తలపై పెట్టారు. నెమ్మదిగా దాని తలను నెమరారు. అంతే వెంటనే కనులు మూసింది బాబా పాదాల చెంత ప్రాణాలు విడించింది. అది ఎంత పుణ్యం చేసుకొందో తెలియదు. ఆ తరువాత మహిల్సాపతి, బాలాషిండే బాబా దగ్గరకు వచ్చారు. ఆ సమయంలోనే నందూ మార్వాడి భార్యకూడా బాబా దర్శనార్థం వచ్చింది. ‘అమ్మా ఇక నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. బూటీవాడలో ఉంటాను ఇకపై. అక్కడే ఎక్కడెక్కడి నుంచో జనం తండోపతండాలు వచ్చి నన్ను సేవిస్తారు అని అన్నారు. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. మహిల్సాపతి, నానా, పంతు వీరంతా మ్రాన్పడి బాబా అని కన్నీరు కార్చారు.
‘ఇదిగో ఇలా మీరు ఏడ్వకూడదు. నేను ఎక్కడికి పోతాను. భగవంతుడు ఆదేశించిన పనులు మనం చేయాల్సిందే కదా. నా తరువాత మీరు నా వెనుకనే వస్తారు కదా. ఇక మీకు దిగులెందుకు .నేను బూటీ వాడలో ఉంటాను. మీరుకోరినపుడు మీ దగ్గరకు నేను వస్తాను. నా సమాధి మీకు సమాధానాలను ఇస్తుంది’అన్నారు.
ఆరోజు విజయదశిమి. కాని శిరిడీ వాసులంతా బాబా దగ్గర తాత్యా దగ్గర ఉన్నారు. వారినందరినీ బాబా మధ్యాహ్నహారతి కాగానే భోజనాలు చేసి రమ్మని పంపించారు.
శ్రీమతి లక్ష్మీబాయి, భాగోజి జయాజి, అప్పాకోతే పాటిల్, బాలాషింపీ, నిమోన్కర్ , శ్యామాలు మాత్రం బాబా చెబుతున్నా వినకుండా బాబా దగ్గరే ఉండిపోయారు.
కొద్దిసేపటికే బాబా అసహనంగా కదిలారు. ‘నాకు ఇక్కడ సుఖంగా లేదు. నన్ను ఆ దగదీవాడాకు తీసుకొని వెళ్లండి. నాకు అక్కడ చాలా బాగుంటుంది. అక్కడికే చాలమంది నాకోసం వస్తారు’ అన్నారు. ఒకసారి లేచి ఒక చిన్న గద్దె మీద బాబా కూర్చున్నారు. అక్కడే ఉన్న మాధవ్ ని పిలిచారు.‘నాకు తాంబూలం కావాలి’అని అడిగారు.
మాధవ్ అప్పటికప్పుడు తాంబూలం తయారు చేసి బాబా నోటికి అందించారు. కాసేపు తమలపాకులు నమిలారు. ఆ తరువాత ‘మాధవ్ నాకు కాసిని మంచినీళ్లు ఇవ్వు’అని అడిగారు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743