భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-111

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతే ఆ ముసలాయన ఆమా ట ఈ మాట చెబుతూ ముందుకు నడుచుకుంటూ వెళ్లారు. కొద్ది సేపట్లోనే అయ్యప్ప క్షేత్రానికి చేరారు. నేను ఇపుడే వస్తాను అంటూ ఆ ముసలాయన ముందుకు వెళ్లాడు. అంతే మరలా ఆ ముసలాయన ముకుంద్‌కు కనిపించలేదు. ముకుంద్ పదినెనుమిది మెట్లు ఎక్కి కొబ్బరికాయను సమర్పించి నమస్కరించుకొని ‘స్వామి అయ్యప్పా నాకు దారిలో కనిపించిన ముసలాయన మరలా కనిపించేట్లు చేయి. నాకు ఎంతో సాయం చేసాడు. ఆయన వల్లనే ఇక్కడికి వచ్చాను. ఒక్కసారి ఆయన కనిపిస్తే నేను నా కృతజ్ఞతలు చెప్పుకుంటాను’అని మనసులో స్వామి అయ్యప్పకు దణ్ణం పెట్టుకున్నాడు. అప్పటిదాకా తిరిగి చూసినా కనిపించని ముసలాయన ముకుంద్ దగ్గరకు నవ్వుతూ వచ్చి ‘ఇదేంటి నేను కనిపించకపోతే ఆయన్ను అడుగుతావు. నీకు ఆయన దగ్గరకు వెళ్లాలంటే నన్ను అడుగుతావు. ఇద్దరూ వేర్వేరు అనుకొంటున్నావా ఇంకా నీలో సంశయాలు అలానే ఉన్నాయా ’అన్నారు. ముకుంద్‌కు మొదట ఏమీ అర్ధం కాలేదు. అర్థం అయ్యేసరికి ‘సరి సరి మళ్లీ కావాలన్నపుడు పిలువు వస్తాను. నాకు చాలా పని వుంది అంటూ ముందుకు అడుగులు వేసాడు ఆ ముసలాయన. ముకుంద్ అపుడే తనకు చైతన్యం వచ్చినట్లు ‘బాబా అంటూ పరుగెత్తి ముసలాయన దగ్గరకు వెళ్లాడు. ఆయన పాదాలపై పడి నమస్కరించాడు. తల ఎత్తి చూసేసరికి స్వామి అయ్యప్ప కనిపించారు. స్వామి శరణం అంటూ లేచి నుంచునేసరికి మరలా శిరిడీ బాబాగా కనిపించారు. ముకుంద్ మరలా పాదాలకు నమస్కరించి ‘బాబా నా అజ్ఞానాన్ని మన్నించు స్వామి’అని వేడుకున్నారు.
భక్తి ఉంటే చాలు అజ్ఞానం అదే పోతుంది. ఇక దర్శనం జరిగింది కదా. హాయిగా ఇంటికి వెళ్లు. రోజువారి పనులు చేసుకో అంటూ బాబా కదిలిపోయారు. ముకుంద్ కు జరిగిదంతా కలలగా అనిపించింది. అతడు అక్కడున్న అందరితో ఈ విషయాన్ని పంచుకున్నాడు. బాలక్‌రామ్ జీవితంలో జరిగిన సంఘటన
బాలక్‌రామ్‌ను వారంరోజులుగా మహిల్సాపతి గమనిస్తున్నాడు. ఒకరోజు బాలక్‌రామ్ దగ్గరకు మహిల్సాపతి వచ్చాడు. ‘మహి’ అంటూ ఆయన్ను పట్టుకొని బాలక్‌రామ్ ఎంతోగానో ఏడ్చాడు. ‘ఎందుకిలా’ ఏడుస్తున్నావని మహిల్సాపతి ఆయన్ను అడిగాడు.
‘మహీ! మనం ఇన్నిరోజులు సాయి బాబా దగ్గరే ఉన్నాంకదా. మనకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అవి అన్నీ బాబాకు చెప్పుకునేవారిమి. మనకు దుఃఖం వస్తే బాబా దాన్ని దూరం చేసేవాడు. ఇక మనకు ఎవరున్నారు. అలా అనుకొంటే నాకు చాలా దుఃఖం వస్తోంది’ అని అన్నాడు. ‘ఓరుూ బాలక్‌రామ్! ఎంత అమాయకుడవయ్యా నీవు. ఇన్నాళ్లుబాబా దగ్గర ఉండే నీవు ఇదా నేర్చుకున్నది. సాయి మనలాగా మామూలు మనిషి. ఇపుడు సమాధి చెందారని ఇక నీకు ఆయనతో బంధం వీడిపోయినట్లే అని అనుకొంటున్నావు. పిచ్చివాడా! ఆయన సద్గురువు. దేవాదిదేవుడు. నీవు సాయిని నమ్ముకొని వున్నావు కదా ఆయనే అన్నింటికీ దారి చూపుతాడు. మన ఎదురుగా లేరని నీవు అనుకోవద్దు. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆయన కనిపిస్తారు. ఇవివేమీ మనసులో పెట్టుకోకుండా ఆనందంతో నీవు చేయవలసిన పనిచేయి. సాయి నీకు త్వరలో కనిపించి నీ దుఃఖాన్ని పొగొడుతాడు. ’అనిచెప్పాడు. ‘నిజంగా మళ్లీ సాయి కనిపిస్తాడా నాకు’అని దిగాలుగా అడిగాడు బాలక్‌రామ్ . ‘తప్పక , కానీ నీవు చేయాల్సిన పని చేయకుండా ఊరికే కూర్చుంటే సాయిబాబాకు అది నచ్చదు. ఎవరి కర్తవ్యాన్ని వారు చేయాలని చెప్పేవారు కదా. అవసరమున్నప్పుడు తప్పక ఆయన దర్శనం నీకు కనిపిస్తుంది. - ఇంకా ఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743