భక్తి కథలు

యాజ్ఞసేని-5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతకుముందు కొంతకాలం రథ గజ తురగ పదాతి బలాలతో సంబంధమున్న ధనుర్వేదాన్నీ, నానావిధాలైన అస్త్ర ప్రయోగ నైపణ్యంతో ధనుర్వేద పండితునిగానున్న ‘కృపాచార్యుడిని’ రప్పించి, మిక్కిలి భక్తితో గౌరవించి తన మనుమలందరికిని విలువిద్య నేర్పడానికై నియమించాడు భీష్మ పితామహుడు. కౌరవులు, పాండవులు యాదవులు మొదలైన రాకుమారులు కృపుని శిక్షణలో విలువిద్యలను నేర్చుకొన్నారు.
మతిమంతుడైన భీష్ముడు తన మనుమందరినీ ద్రోణాచార్యునికి చూపించి ‘‘ఆచార్యా! వీరికి గురుత్వం వహించి గొప్పగా విలువిద్యలన్నింటినీ నేర్పండి. విలువిద్యలో, నీతిలో, పరాక్రమంలోనూ ‘పరశురాముడు’ కూడా నిన్ను బోలడని విన్నాను’’ అని పలికి కుమారులందరినీ ద్రోణునికి శిష్యులుగా సమర్పించాడు. ద్రోణాచార్యుడు కూడా వాళ్ళందరినీ దగ్గరకు తీసి... ‘‘నా దగ్గర అస్తవ్రిద్యలు నేర్చి నా కోరిక మీలో నెవ్వడు తీర్చగలడు’’అని అడుగగా కౌరవులందరూ వౌనం వహించగా ‘అర్జునుడు’ మాత్రం నేను తీరుస్తాను అని ముందుకొచ్చాడు.
అలా అన్న అర్జునునడిని అపార ప్రేమతో కౌగిలించుకొని సంతోషించాడు ద్రోణుడు. కురు కుమారులకు విలువిద్యలు నేర్పుచుండగా నానా దేశాల రాకుమారులు వచ్చి వారితో కలిసి ఆయా విద్యలను నేర్చుకొంటున్నారు. అర్జునుడు శస్త్రాస్తవ్రిద్యా నైపుణ్యంలో అధికుడైఎప్పుడూ గురుపూజ చేస్తూ ద్రోణుణ్ణి సంతోషపరుస్తున్నాడు. సూతపుత్రుడు, రాధేయుడు అయిన కర్ణుడు విలువిద్యా నైపుణ్యంలో అర్జునుడితో ద్వేషిస్తూ దుర్యోధనుడి పక్షం వహించి ఉండేవాడు.
అటులనే అర్జునుడితో యున్న విద్యా స్పర్థతో అశ్వత్థామ చీకట్లో బాణాలు వేయడం అర్జునుడు నేర్చుకొనకుండా యుండునట్లు వంటవాడిని పిలిచి ‘‘చీకట్లో అర్జునుడికి అన్నం పెట్టకు’’ అని ఆజ్ఞాపించగా వంటవాడు ఆ విధంగానే చేస్తుండేవాడు. అయితే ఒకనాటి రాత్రిపెద్ద గాలికి తటాలున దీపం ఆరిపోతుంది. అయినా అలవాటు ప్రకారం అర్జునుడు ఆ చీకటిలోనే భుజించి, మానసిక ప్రేరణతో ఈ విధంగానే విద్యలన్నింటినీ సాధన చేసి నేర్చుకొనవచ్చని నిశ్చయించుకొంటాడు చీకట్లో కూడాపట్టుబట్టి విలువిద్య నభ్యసించసాగాడు. శబ్ధబేధి విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు.
చీకట్లో వింటి యొక్క అల్లెత్రాటి ధ్వని విన్న ద్రోణుడు వచ్చి ‘‘అర్జునా! నీకంటే ఎవ్వరూ అధికులు కానట్లుగా విలువిద్యను నేర్పిస్తాను’’ అని అంటాడు.
ద్వంద యుద్ధ, సంకుల యుద్ధ పద్ధతులను, రథంమీద నేలమీద అశ్వాలపైనుండి, దృఢం, చిత్రం, సౌష్ఠవం అయిన స్థితులలో బాణాలు వేయటాన్ని, బహువిధములైన వ్యూహాల భేదించే ఉపాయాలను, బాణ ప్రయోగ రహస్యాలను ఆ పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటివాడు కాడు’’ అని ప్రజలు మెచ్చటట్లుగా అర్జునుడిని తీర్చుదిద్దుతాడు ద్రోణుడు.
గద, ధనుస్సు, ఈటె, కత్తి, తోమరం, కుంతం, శక్తి మొదలైన అనేక విధాలైన ఆయుధ విద్యలలో రాకుమారులందరినీ నేర్పరులను చేస్తాడు ద్రోణాచార్యుడు.
ఒకనాడు ఏకాంతంలో యున్న ద్రోణాచార్యుడి వద్దకు కర్ణుడు వస్తాడు. అలా వచ్చిన కర్ణుడు ‘‘గురుదేవా! నాకు బ్రహ్మాస్త్రాన్ని సాంగోపాంగంగా ఉపదేశించ వేడుచున్నాను. నీవా శిష్యులందరినీ సమానంగా చూచేవాడవు. నీ దయవలన నేను గూడా బ్రహ్మాస్త్రాన్ని పొంది ప్రకాశించవద్దా?’’ అని అంటాడు.
అందుకు ద్రోణాచార్యుడు ‘‘కర్ణా! నీకు నేను బ్రహ్మాస్త్రాన్ని దానం చేయడం ధర్మంగాదు’’ అని అతడి కోర్కెను తిరస్కరిస్తాడు.
అంత కర్ణుడు పరశురాముడి వద్దకుపోయి తానొక బ్రాహ్మణుడనని చెప్పి అతడి శిష్యుడిగా చేరి అస్త్ర విద్యలనూ, బ్రహ్మాస్త్రాన్ని పొందుతాడు. అయితే నిజం బయల్వడగా కర్ణుడు నేర్చిన అస్తవ్రిద్యలెల్లా పరశురాముడి శాపంవలన పనికిరాకుండా పోతాయి.
ద్రోణాచార్యుడు తన శిష్యులను పరీక్షించనెంచుతాడు. కురుకుమారుల విలువిద్యా నైపుణ్యాన్ని తెలిసికొనగోరి ‘్భస’ అనే కృతిమ పక్షినొకదానిని చెట్టు కొమ్మ చివరన కట్టి దానినందరికినీ చూపించి వారితో
‘‘నేను చెప్పినప్పుడు మీరు మీ ధనుస్సులనెక్కుబెట్టి ఆ పక్షి తలను తెగగొట్టండి. నేను ఒక్కొక్కరినీ ఆజ్ఞాపిస్తాను’’ అని ధర్మరాజును పిలిచి ‘‘ఈ చెట్టుకొమ్మ కొసన ఉన్న పక్షిని చక్కగా చూచి నేను చెప్పినపుడు బాణంతో కొట్టుము’’ అని అంటాడు. ధర్మరాజు ‘సరే’ అని గురువు మాట ప్రకారం సిద్ధంగా ఉండగా ద్రోణుడు ‘‘ఓ ధర్మరాజా! చెట్టుకొమ్మ చివరనున్న పక్షితలను స్పష్టంగా చూచావా?’’ అని అడుగ్గా, ‘‘చక్కగా చూచాను’’ అని అంటాడు ధర్మరాజు. - ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము